AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలీస్‌ కస్టడీలో నటి రన్యా రావు.. బెయిల్‌పై ఉత్కంఠ! లేటెస్ట్ ఫొటో చూశారా?

ప్రముఖ కన్నడ నటి రన్యా రావ్ అరెస్ట్ కేసు కర్ణాటకలో తీవ్ర స్థాయిలో దుమారం లేపుతుంది. ఆమె తండ్రి స్వయానా కర్ణాటక డీజీపీ కె.రామచంద్ర రావు కావడంతో ఈ విషయం మరింత ఆసక్తిగా మారింది. ఏకంగా14 కేజీల బంగారం బిస్కెట్లను బెల్టులో దాచుకుని దుబాయ్‌ నుంచి బెంగళూరుకు రావడం, ప్రోటోకాల్ తప్పించుకోవడం సర్వత్రా హాట్‌ టాపిక్‌గా మారింది..

పోలీస్‌ కస్టడీలో నటి రన్యా రావు.. బెయిల్‌పై ఉత్కంఠ! లేటెస్ట్ ఫొటో చూశారా?
Actor Ranya Rao
Srilakshmi C
|

Updated on: Mar 06, 2025 | 7:13 PM

Share

గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో బెంగళూరు ఎయిర్‌పోర్టులో కన్నడ నటి రన్యా రావు అరెస్టు అయిన సంగతి తెలిసిందే. సోమవారం రాత్రి దుబాయ్ నుంచి వచ్చిన ఆమె రూ.12 కోట్ల విలువైన 14.8 కిలోల బంగారంతో పట్టుబడింది. ఈ కేసులో కస్టడీలో ఉన్న నటి రన్యారావు ఫస్ట్‌ ఫొటో పోలీసులు విడుదల చేశారు. నటి రన్యా రావు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా, ఆర్థిక నేరాల కోర్టు ఆమె బెయిల్ పిటిషన్‌పై తీర్పును శుక్రవారానికి రిజర్వ్ చేసింది.

విచారణ సందర్భంగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) తరపు న్యాయవాది.. ఎయిర్‌పోర్ట్‌ ప్రోటోకాల్‌లను నటి ఎలా ఉల్లంఘించిందో, స్మగ్లింగ్ ఆపరేషన్ ఎలా నిర్వహించబడిందో దర్యాప్తు చేయడానికి కస్టడీ అవసరమని కోర్టులో కోరారు. అంతేకాకుండా ఈ ఏడాది ప్రారంభం నుంచి నటి రన్యా రావు ఏకంగా 27 సార్లు దుబాయ్‌కు ప్రయాణించినట్లు పేర్కొన్నాఉ. గోల్డ్‌ స్మగ్లింగ్‌ కార్యకలాపాల్లో ఆమె ప్రమేయం ఉందా? గతంలో కూడా బంగారం స్మగ్లింగ్ చేసిందా? వంటి పలు తీవ్రమైన అనుమానాలు లేవనెత్తారు.

అయితే డీఆర్‌ఐ ఇప్పటికే ఆమెను విచారించిందని, ఇకపై ప్రశ్నించాల్సిన అవసరం లేదని రన్యా రావు తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. అందుకే ఆమెను జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు పేర్కొన్నారు. ఒకసారి బెయిల్ కోసం దాఖలు చేసిన తర్వాత మళ్ళీ కస్టడీలోకి తీసుకోవడాన్ని నటి తరపు న్యాయవాది తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ చర్యను ప్రశ్నార్థకంగా పేర్కొన్నారు. ఆమె ల్యాప్‌టాప్ ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారని, దర్యాప్తుదారులకు కీలకమైన డిజిటల్ ఆధారాలు అందుబాటులో ఉన్నాయని సూచిస్తూ డిఫెన్స్ కూడా ఎత్తి చూపారు. ఈ కేసు రోజురోజుకూ ముదురుతున్నందున శుక్రవారం కోర్టు బెయిల్ పిటిషన్‌పై తీర్పును వెలువరించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.