AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Millets Side Effects: ఈ సమస్యలు ఉన్నవారు మిల్లేట్స్ అస్సలు తినకూడదట!

మిల్లేట్స్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుత కాలంలో ఇవి చాలా పాపులర్ అయ్యాయి. ఇప్పుడు చాలా మంది హెల్దీ డైట్‌ మెయిన్ టైన్ చేస్తున్నారు. వీరి డైట్‌లో వీటిని కూడా యాడ్ చేసుకుంటున్నారు. పూర్వం పెద్దలు మిల్లేట్సే ఎక్కువగా తీసుకునేవారు. అందుకే ఎన్ని అనారోగ్య సమస్యలు వచ్చినా తట్టుకుని ఉక్కులా ఉన్నారు. కొర్రలు, రాగులు, జొన్నలు, సజ్జలు, సామలు, ఐదలు, ఉలవలు, అరికెలు, ఆండూ కొర్రలు ఇలా వీటిని..

Millets Side Effects: ఈ సమస్యలు ఉన్నవారు మిల్లేట్స్ అస్సలు తినకూడదట!
Millet Side Effects
Chinni Enni
|

Updated on: Aug 31, 2024 | 6:39 PM

Share

మిల్లేట్స్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుత కాలంలో ఇవి చాలా పాపులర్ అయ్యాయి. ఇప్పుడు చాలా మంది హెల్దీ డైట్‌ మెయిన్ టైన్ చేస్తున్నారు. వీరి డైట్‌లో వీటిని కూడా యాడ్ చేసుకుంటున్నారు. పూర్వం పెద్దలు మిల్లేట్సే ఎక్కువగా తీసుకునేవారు. అందుకే ఎన్ని అనారోగ్య సమస్యలు వచ్చినా తట్టుకుని ఉక్కులా ఉన్నారు. కొర్రలు, రాగులు, జొన్నలు, సజ్జలు, సామలు, ఐదలు, ఉలవలు, అరికెలు, ఆండూ కొర్రలు ఇలా వీటిని కలిపి మిల్లేట్స్ అని పిలుస్తారు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని తినడం వల్ల ఫిట్‌గా ఉంటారు. శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు ఎక్కువగా రాకుండా ఉంటాయి. ప్రస్తుతం వీటిని మళ్లీ తీసుకోవడం మొదలు పెట్టారు. అయితే ఇంత ఆరోగ్యకరమైన ఆహారం మాత్రం.. కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు తినకూడదు. వీటిని ఎక్కువగా తిన్నా కొన్ని రకాల సమస్యలు ఏర్పడతాయట. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఖనిజాల లోపాలు:

పోషకాహార నిపుణులు చెబుతున్న దాని ప్రకారం మిల్లెట్స్‌లో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. వీటిని అధికంగా తినడం వల్ల ఐరన్, క్యాల్షియం, జింక్ వంటి అవసరమైన ఖనిజాలను బంధిస్తుంది. వాటిని శరీరం శోషించకుండా అడ్డుకుంటాయి. వీటిని మరీ ఎక్కువగా తీసుకున్నా ఖనిజాల లోపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని పలు అధ్యయానలు చెబుతున్నాయి.

థైరాయిడ్ ఉన్నవారు..

థైరాయిడ్ సమస్యతో బాధ పడేవారు మిల్లేట్స్ తినకపోవడమే మంచిది. ఒకవేళ తినాలనిపిస్తే చాలా తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. లేదంటే హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడుతుంది. కానీ కొన్ని అధ్యయనాల ప్రకారం మిల్లేట్స్ తీసుకుంటే థైరాయిడ్ లెవల్స్ తగ్గుతాయని వెల్లడించాయి. కాబట్టి వీరు మిల్లేట్స్ తినాలంటే వైద్యుల్ని సంప్రదించడం మేలు.

ఇవి కూడా చదవండి

పోషకాహార లోపం ఉన్నవాళ్లు..

పోషకాహార లోపం ఉన్నవాళ్లు కూడా మిల్లేట్స్ తీసుకోకుండా ఉంటేనే మంచిదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇందులో కొన్ని టానిన్లు ఉంటాయి. ఇవి పోషకాలను శోషించకుండా అడ్డుకుంటాయి. కాబట్టి వైద్యుల్ని సంప్రదించి తీసుకోవాలి. వీటిని తినాలి అంటే.. ఐదు లేదా ఆరు గంటలు నానబెట్టి తీసుకోవాలి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..