AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మండుటెండలతో ఇంట్లో ఉండలేకపోతున్నారా..? ఈ సింపుల్ టిప్స్‌ ట్రై చేశారంటే మీ ఇల్లు స్విట్జర్లాండే!

వేసవిలో సూర్యుని వేడి నేరుగా ఇంటి కప్పుపై పడటం వల్ల గదులు వేడెక్కుతాయి. మండుటెండలో మీ ఇంటిని చల్లగా ఉంచుకోవడానికి ఒక సులభమైన మార్గం. ఏసీ లేకుండా కూడా ఉపశమనం కలిగించే, మీ ఇంటి పైకప్పును చల్లగా ఉంచే ఉపాయం కోసం చూస్తున్నారా..? అయితే, మీ కోసమే ఈ వార్త.

మండుటెండలతో ఇంట్లో ఉండలేకపోతున్నారా..? ఈ సింపుల్ టిప్స్‌ ట్రై చేశారంటే మీ ఇల్లు  స్విట్జర్లాండే!
Roof Cooling Methods
Jyothi Gadda
|

Updated on: Apr 16, 2026 | 12:56 PM

Share

వేసవి కాలం రాగానే ఇంటి పైకప్పులు నిప్పుల కొలిమిలా మారుతాయి. సూర్యుని వేడి నేరుగా ఇంటి కప్పుపై పడటం వల్ల గదులు వేడెక్కుతాయి. కంక్రీట్ కప్పులు పగలు వేడిని గ్రహించి, రాత్రి వేళల్లో గదులను ఉక్కపోతతో నింపుతాయి. మీరు పై అంతస్తులో నివసిస్తున్నట్టయితే, పగటిపూట మీ గదిలో కూర్చోవడం ఒక శిక్షలా అనిపిస్తుంది. ఫ్యాన్ కూడా వేడి గాలిని వీచడం మొదలవుతుంది. కూలర్, ఏసీ పనిచేయడం మానేస్తాయి. ఏసీ బిల్లుల భారం లేకుండా మీ ఇంటిని చల్లగా ఉంచుకోవడానికి ఇక్కడ 4 ప్రభావవంతమైన మార్గాలు ఇక్కడ ఉన్నాయి. వేసవిలో ఏసీ, కూలర్ల వాడకం తగ్గించి, సహజ పద్ధతుల్లో ఇంటి కప్పును (Roof) చల్లబరచడానికి ఆ అద్భుతమైన చిట్కాలేంటో తప్పక తెలుసుకోవాలి.

గ్రీన్ నెట్ ఏర్పాటు: నర్సరీల్లో మొక్కల పైన వాడే గ్రీన్ నెట్‌ను మీ ఇంటి కప్పు పైన కూడా అమర్చుకోవచ్చు. ఇది సూర్యుని నుండి వచ్చే నేరుగా కిరణాలను 70 నుండి 90 శాతం వరకు అడ్డుకుంటుంది. దీనివల్ల కప్పు తక్కువగా వేడెక్కుతుంది. లోపలి గదులు చల్లగా ఉంటాయి.

కప్పుపై మొక్కల పెంపకం: టెర్రస్ గార్డెన్ ఏర్పాటు చేయడం వల్ల కప్పుకు సహజమైన రక్షణ లభిస్తుంది. కుండీలలోని మట్టి, మొక్కలు వేడిని లోపలికి రానివ్వవు. మీరు మొక్కలకు నీరు పోసినప్పుడు జరిగే భాష్పీభవనం (Evaporation) ప్రక్రియ వల్ల పైకప్పు సహజంగా చల్లబడుతుంది.

ఇవి కూడా చదవండి

జూట్ బ్యాగుల ప్రయోగం: ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడిన పద్ధతి. పాత గోనె సంచులను కప్పుపై పరచి, వాటిని ఎప్పుడూ తడిగా ఉండేలా నీరు చల్లుతూ ఉండాలి. ఇవి వేడిని పీల్చుకుని, కిందికి చల్లటి గాలి వెళ్లేలా చేస్తాయి. రాత్రి వేళల్లో ఈ పద్ధతి అద్భుతంగా పనిచేస్తుంది.

సాయంత్రం వేళల్లో నీటి చిలకరింపు: సూర్యుడు అస్తమించిన తర్వాత కప్పు పైన నీటిని చిలకరించడం వల్ల కంక్రీట్ గ్రహించిన వేడి అంతా ఆవిరైపోతుంది. అయితే, మధ్యాహ్నం వేళల్లో నీటిని పోయడం మానుకోవాలి, లేదంటే గదిలో తేమ (Humidity) పెరిగి ఉక్కపోత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.

అదనపు చిట్కా: కప్పుపై తెల్లటి సున్నం లేదా హీట్ రిఫ్లెక్టివ్ పెయింట్ (White Lime Wash) వేయడం వల్ల సూర్యరశ్మి పరావర్తనం చెంది గది ఉష్ణోగ్రత 4 నుండి 5 డిగ్రీల వరకు తగ్గుతుంది. ఈ సహజ సిద్ధమైన చిట్కాలను పాటించడం వల్ల విద్యుత్ ఆదా అవ్వడమే కాకుండా, పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా మీ ఇల్లు సిమ్లా లా చల్లగా మారుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us