New Year Resolutions: కొత్త సంవత్సరంలో సరికొత్తగా మీ ఆరోగ్యం..ఆరోగ్య రక్షణకు పాటించాల్సిన సూచనలు ఇవే
ప్రతి ఏడాది మీ నడవడికకు సంబంధించి తీర్మానాలు తీసుకుంటారు. ఈ సంవత్సరం మీ ఆరోగ్య రక్షణకు తీర్మానాలు తీసుకుంటే బెటర్. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే అన్నీ బాగుంటాయి.

2023 లో అడుగుపెట్టాం. అందరూ ఉత్సాహంగా వేడుకలు చేసుకుంటున్నారు. 2022 లో చేసిన కొత్త తప్పులను కొత్త సంవత్సరంలోనైనా సవరించుకోవాలని కొన్ని తీర్మానాలు చేసుకుంటాం. అయితే ప్రతి ఏడాది మీ నడవడికకు సంబంధించి తీర్మానాలు తీసుకుంటారు. ఈ సంవత్సరం మీ ఆరోగ్య రక్షణకు తీర్మానాలు తీసుకుంటే బెటర్. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే అన్నీ బాగుంటాయి. ఈ ఏడాది మనం చేసుకోవాల్సిన తీర్మానాలు ఇవే..
ఆరోగ్య బీమా
ప్రతి ఒక్కరూ ఆరోగ్య రక్షణలో భాగంగా కచ్చితంగా ఆరోగ్య బీమా తీసుకోవాలి. ఎందుకంటే మనకు ఆపద సమయంలో బీమా కాపాడుతుంది. చాలా మంది ఇప్పటికే ఆరోగ్య బీమా తీసుకున్నా..దాన్ని రెన్యువల్ చేయించారు. కొత్త సంవత్సరంలో మీ ఆరోగ్య బీమా లైవ్ లో ఉండేలా చూసుకోండి.
ఇంటి భోజనమే మేలు
చాాలా మంది టేస్ట్ కోసమంటూ బయట ఫుడ్స్ ఎక్కువగా తింటుంటారు. ఈ అలవాటు ధీర్ఘకాలంలో చేటు చేస్తుంది. కాబట్టి వీలైనంతగా బయట ఫుడ్స్ తినడం మానేసి ఇంటి భోజనమే తినడమే మేలు




నీరు అధికంగా తాగడం
నీరు అధికంగా తాగితే ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరికీ తెలిసిన విషయమే..కానీ దాన్నే మనం నిర్లక్ష్యం చేస్తుంటాం. కాబట్టి కొత్త సంవత్సరంలో పరిశుభ్రమైన నీరు తగిన మోతాదు తాగడం అలవాటు చేసుకోవాలి.
వ్యక్తిగత పరిశుభ్రత
కోవిడ్ -19 మళ్లీ విజృంభిస్తున్న తరుణంలో వ్యక్తిగత పరిశుభ్రత కీలక అంశంగా మారింది. చేతులను కడుక్కోవడం, శానిటైజర్, మాస్క్ వాడడం వంటి చర్యలను 2023 నుంచి కచ్చితంగా పాటించాలి.
క్రమం తప్పని వ్యాయామం
2023 నుంచైనా ఫిట్ గా ఉండడానికి ప్రయత్నించాలి. సోమరితనం వదిలి ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇలా చేయడం వల్ల సరళమైన జీవనశైలి అలవాటు అవుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..