Eyes Health: మొబైల్ వినియోగించినప్పుడల్లా కంటివెంట నీరు వస్తున్నాయా? ఈ ప్రమాదమే కావొచ్చు..!

ప్రస్తుతం మొబైల్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఇది ఒక వ్యసనంగా మారిపోయింది. చాలా మంది పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మొబైల్, ల్యాప్‌టాప్‌లను అస్సలు వదలడం లేదు.

Eyes Health: మొబైల్ వినియోగించినప్పుడల్లా కంటివెంట నీరు వస్తున్నాయా? ఈ ప్రమాదమే కావొచ్చు..!
Eyes Health
Follow us

|

Updated on: Jan 01, 2023 | 7:56 PM

ప్రస్తుతం మొబైల్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఇది ఒక వ్యసనంగా మారిపోయింది. చాలా మంది పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మొబైల్, ల్యాప్‌టాప్‌లను అస్సలు వదలడం లేదు. అయితే, ఎక్కువ సేపు సెల్‌ఫోన్‌ని చూడటం వల్ల కళ్ళలో నీరు రావడం సహజమే.. కానీ తక్కువ వాడినప్పటికీ కళ్ళు అలాగే చెమ్మగిల్లుతుంటే ఏదో ప్రమాదం ఉందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

కళ్లలో నీళ్లు రావడానికి కారణాలివే..

1. డ్రై ఐస్: కంటి కండరాలు మన శరీరంలో అత్యంత చురుకైన, సున్నితమైన కండరాలు. వాటి పని పొడి కళ్ళను నివారించడం. చాలా సమయంపాటు కళ్ళ తెరిచి ఉంచితే.. వెంటనే కళ్ల వెంట నీళ్లు వస్తాయి. నిజానికి శరీరంలో నీరు, నూనె, శ్లేష్మం సమతుల్యంగా లేనప్పుడు కళ్లు పొడిబారుతుంటుంది. అలాంటి సమయంలో కళ్ల వెంట నీళ్లు వస్తుంటాయి.

2. అలర్జీలు: మొబైల్‌ లోంచి వచ్చే నీలి కాంతి కారణంగా కళ్ల వెంట నీళ్లు కారుతాయి. అయితే, ప్రతిసారి ఇదే కారణం కాదు. అలెర్జీ వల్ల కూడా కంట్లో నీళ్లు వస్తుంటాయి. దీని వలన కళ్ల దురద కూడా వస్తుంది. దీనికి వెంటనే చికిత్స అందించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

3. కనురెప్పల వాపు: మీ కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన కనురెప్పలు ముఖ్యం. కనురెప్పల్లో ఎలాంటి వాపు వచ్చినా కళ్లు దురద వస్తుంది. కంటి వెంట నీళ్లు వస్తాయి.

4. ఇన్ఫెక్షన్లు: బాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా కళ్లలో నీళ్లు వస్తాయి. దీని కారణంగా, కళ్ళు ఎర్రగా మారడం, నీరు రావడం మొదలవుతుంది. ఈ వ్యాధి ముఖ్యంగా పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..