Cold vs Heat Treatment: కీళ్ల నొప్పి తగ్గడానికి ఐస్ క్యూబ్స్ మంచిదా? వేడి కాపడం మంచిదా? తెలుసుకోండి..
ప్రస్తుత కాలంలో వృద్ధులే కాకుండా, యువకులు సైతం కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులతో బాధపడుతున్నారు. అయితే, చాలా సందర్భాల్లో ప్రజలు వేడి నీటితో కాపడం పట్టడం గానీ..

ప్రస్తుత కాలంలో వృద్ధులే కాకుండా, యువకులు సైతం కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులతో బాధపడుతున్నారు. అయితే, చాలా సందర్భాల్లో ప్రజలు వేడి నీటితో కాపడం పట్టడం గానీ, ఐస్ ప్యాక్ ఉపయోగించి గానీ నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు. అయితే, ఈ రెండూ పూర్తి భిన్నమైన చికిత్సలు. అందుకే వీటిలో దేనిని పాటించడం ఉత్తమం అనే విషయంలో ప్రజలు కాస్త కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. ఏది త్వరగా నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది? ఏది త్వరగా నిప్పిని తగ్గిస్తుంది? అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
నొప్పికి చికిత్సలో వేడి పద్ధతి ఎలా సహాయపడుతుంది?
మాక్స్ హాస్పిటల్‌లోని అసోసియేట్ డైరెక్టర్-ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్‌మెంట్ డాక్టర్ అఖిలేష్ యాదవ్ ప్రకారం.. ఎర్రబడిన, పట్టుకున్నట్లుగా ఉన్న ప్రాంతంలో వేడి నీటితో గానీ, వేడి వస్తువుతో గానీ కాపడం పెట్టడం వల్ల రక్త నాళాలు ఫ్రీ అవుతాయి. తద్వారా రక్త ప్రవాహం పెరుగుతుంది. ఒత్తిడి తగ్గి, కండరాలకు విశ్రాంతి లభిస్తుంది.
కీళ్లు, కండరాల నొప్పికి ఐస్ ప్యాక్ ఎలా సహాయపడుతుంది..?
కోల్డ్ థెరపీ, ఐస్ ప్యాక్‌లు గాయపడిన భాగానికి రక్త ప్రవాహాన్ని తగ్గిస్తాయని డాక్టర్ యాదవ్ వివరించారు. ఇది వాపు, కణజాల నష్టాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు.. మెదడుకు అందే నొప్పి సంకేతాలను నిరోధిస్తుంది. ఫలితంగా ఐస్ ప్యాక్ ద్వారా త్వరగా నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.




వాపు, కండరాల నొప్పి నుంచి ఉపశమనం పొందడంలో ఐస్ ప్యాక్ ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఐస్ ప్యాక్‌లు గాయం తర్వాత 48 గంటలలోపు ఉత్తమంగా పని చేస్తాయి. ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న రోగులకు ఐస్ మసాజ్, 10 నిమిషాల పాటు కోల్డ్ ప్యాడ్‌ని ఉపయోగించవచ్చని డాక్టర్ యాదవ్ సిఫార్సు చేస్తున్నారు.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




