AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Fall in Winter: మీకూ శీతాకాలంలో జుట్టు రాలుతుందా?.. ఐతే వారానికి 3 సార్లు ఇలా చేయండి

simple tips to get rid of hair fall in Winter: శీతాకాలంలో జుట్టు సంరక్షణపై మీరు కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. అయితే చాలా మంది ఈ సమస్య నుంచి బయటపడటానికి ఖరీదైన చికిత్సలను ఆశ్రయిస్తుంటారు. బదులుగా ఆరోగ్యకరమైన జుట్టు కోసం ఈ కింది కొన్ని జుట్టు సంరక్షణ చిట్కాలను పాటిస్తే సమస్య చిటికెలో మాయం అవుతుంది..

Hair Fall in Winter: మీకూ శీతాకాలంలో జుట్టు రాలుతుందా?.. ఐతే వారానికి 3 సార్లు ఇలా చేయండి
Natural Remedies For Hair Fall
Srilakshmi C
|

Updated on: Nov 21, 2025 | 6:00 AM

Share

నేటి కాలంలో జుట్టు రాలడం సాధారణ సమస్యగా మారింది. కాలుష్యం, రసాయనాలతో కూడి జుట్టు ఉత్పత్తుల అధిక వినియోగం, ఒత్తిడి, ఆహారం, జీవనశైలి వంటివి ఇందుకు ప్రధాన కారణాలు. ఇటువంటి పరిస్థితిలో జుట్టు సంరక్షణపై మీరు కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. అయితే చాలా మంది ఈ సమస్య నుంచి బయటపడటానికి ఖరీదైన చికిత్సలను ఆశ్రయిస్తుంటారు. బదులుగా ఆరోగ్యకరమైన జుట్టు కోసం ఈ కింది కొన్ని జుట్టు సంరక్షణ చిట్కాలను పాటిస్తే సమస్య చిటికెలో మాయం అవుతుంది. ఫలితంగా 90% జుట్టు రాలడం సమస్య పరిష్కరించబడుతుంది. కాబట్టి జుట్టు రాలడం సమస్యకు వీడ్కోలు చెప్పడానికి ఏమేం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

జుట్టు రాలడం తగ్గాలంటే ఏం చేయాలి?

ఆయిల్ మసాజ్

చాలా మంది జుట్టుకు నూనె రాసుకోరు. ఇది మీరు చేస్తున్న పెద్ద తప్పు. మొక్కలకు నీళ్ళు పోసినట్లే జుట్టుకు కూడా నూనె రాసి మసాజ్ చేయాలి. ఇది మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సహాయపడుతుంది. మీరు వారానికి కనీసం మూడు రోజులు జుట్టుకు నూనె రాసి మసాజ్ చేయాలి. ఇది జుట్టు ఒత్తుగా పెరగడానికి, జుట్టు రాలడాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

రెండు నుంచి మూడు రోజులకోసారి తల స్నానం

కొంతమంది జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజూ తల స్నానం చేస్తారు. బదులుగా వారానికి 2 లేదా 3 సార్లు తల స్నానం చేస్తే సరిపోతుంది. తల స్నానం చేయడానికి కనీసం అరగంట ముందు మీ జుట్టుకు నూనె రాసుకోవాలి. ఇది తల చర్మం ఎండిపోకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. తల చర్మం పొడిగా ఉంటే మీ జుట్టు బలహీనంగా మారుతుంది. త్వరగా రాలిపోతుంది. కాబట్టి మీ జుట్టుకు పోషణ అందివ్వండి. నూనె రాసిన ఓ గంట తర్వాత స్నానం చేస్తే సరిపోతుంది. స్నానానికి గోరువెచ్చని నీటిని వాడాలి. అధిక వేడి లేదా చల్లటి నీటిని వాడకపోవడమే మంచిది. అలాగే తల స్నానానికి తేలికపాటి సల్ఫేట్ లేని షాంపూలను ఉపయోగించాలి.

ఇవి కూడా చదవండి

సరైన పోషకాహారం తీసుకోవాలి

జుట్టు ఆరోగ్యానికి బయటి నుంచి మీ జుట్టుకు పోషణ ఎంత ముఖ్యమో, లోపలి నుంచి కూడా పోషణ ఇవ్వడం అంతే ముఖ్యం. దీని కోసం మీరు గుడ్లు, వాల్‌నట్‌లు, బాదం, జీడిపప్పు, పాలకూర, క్యారెట్లు, చేపలు వంటి పోషకమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఇవన్నీ మీ జుట్టును లోపలి నుంచి బలోపేతం చేస్తాయి.

సహజ విటమిన్ డి

ప్రతి ఉదయం కనీసం 15 నిమిషాలు సూర్యకాంతికి గురికావాలి. ఇది శరీరం విటమిన్ డి ఉత్పత్తికి సహాయపడుతుంది. తగినంత విటమిన్ డి తీసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

అధికంగా నీళ్లు తీసుకోవాలి

హైడ్రేషన్ కూడా చాలా ముఖ్యం. శరీరంతోపాటు ఆరోగ్యకరమైన జుట్టు పెరగడానికి హైడ్రేషన్‌గా ఉండటం ముఖ్యం. దీని కోసం రోజుకు రెండు నుంచి మూడు లీటర్ల నీళ్లు తాగాలి. కొబ్బరి నీళ్లు, నిమ్మరసం తాగడం ఇంకా మంచిది. జుట్టు సంరక్షణ కోసం ఈ చిట్కాలన్నింటినీ పాటిస్తే జుట్టు రాలడం సమస్యకు మీరు సులభంగా వీడ్కోలు చెప్పవచ్చు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us