మెరిసే చర్మం కోసం ఖరీదైన క్రీములు అవసరం లేదు.. ఇలా చేయండి చాలు..!
ప్రస్తుతం అందరికీ మెరిసే చర్మం అంటే ఇష్టం. కానీ దానికి ఖరీదైన క్రీములు, లోషన్లు, మాయిశ్చరైజర్లు కొనడం, రోజూ వాటిని వాడటం కష్టంగా మారుతోంది. అయితే సహజ మార్గంలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మన పూర్వీకులు చెప్పిన పద్ధతులను పాటిస్తే అందానికి డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.

మన తాతల కాలం నుంచి కొన్ని మూలికలు చర్మానికి నెమ్మదిగా ప్రకాశం తీసుకువస్తాయి. వీటిని రోజూ స్నానం చేసే నీటితో కలిపి ఉపయోగిస్తే చర్మం మృదువుగా మారుతుంది. ఇప్పుడు వాటిని ఎలా వాడాలో.. అలాగే ఎవరైనా ఇంటి నుంచే పాటించే సులభమైన చిట్కాల గురించి తెలుసుకుందాం.
వేపాకులు.. వేపాకు చర్మ రక్షణలో చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. వీటిని నీటిలో మరిగించి ఆ నీటితో స్నానం చేస్తే చర్మంపై వచ్చే చిన్న చిన్న సమస్యలు రాకుండా నివారించవచ్చు. ఇది సహజమైన డీటాక్స్ టానిక్ లా పనిచేస్తుంది.
పటికం.. పటికం అంటే అలమ్. ఇది చర్మాన్ని శుభ్రంగా ఉంచడంలో గాయాలపై శుభ్రత కలిగించడంలో ఉపయోగపడుతుంది. మునుపటి కాలంలో చిన్న చిన్న చర్మ సమస్యలకు మన పెద్దలు ఎక్కువగా దీన్ని వాడేవారు. చర్మాన్ని మృదువుగా, శుభ్రంగా ఉంచే గుణం దీనికి ఉంది.
కల్లు ఉప్పు లేదా ఎప్సమ్ సాల్ట్.. ఇది చర్మంలోని మృత కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. కాళ్ల వాపుతో బాధపడేవారికి ఇది ఉపశమనం కలిగించగలదు. మంచి నిద్రకు ఇది తోడ్పడుతుంది. స్నానపు నీటిలో చిన్న స్పూన్ కలుపుతూ వాడితే చాలు.
గులాబీ నీరు.. గులాబీ నీరు అన్ని రకాల చర్మాలకు అనువుగా ఉంటుంది. ఇది చర్మానికి చల్లదనాన్ని, తేమను ఇస్తుంది. ప్రతిరోజూ 10 మిల్లీలీటర్ల గులాబీ నీటిని బకెట్ నీటిలో కలిపి స్నానం చేస్తే కొన్ని రోజుల్లోనే తేడా కనిపిస్తుంది.
బేకింగ్ సోడా.. బేకింగ్ సోడా చర్మం మీద ఉన్న మలినాలను, మృత కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది పొడిబారిన చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. ఒక బకెట్ నీటిలో ఒక స్పూన్ చాలు.
ఈ పదార్థాలన్నీ ఇంట్లోనే ఉండే సాధారణమైనవి. ఇవి ఖరీదైనవి కావు.. ప్రత్యేకంగా వెతకాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఇవన్నీ సహజమైనవి కావడంతో ఎలాంటి రసాయనాలు లేవు. దాంతో మీ చర్మం మీద ఎటువంటి హానికర ప్రభావం పడదు. ఇవి ప్రతిరోజూ స్నానం చేసేటప్పుడు వాడటం వల్ల చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మారుతుంది. సహజంగా అందాన్ని పొందాలనుకునే వారు ఈ స్నాన పద్ధతులను పాటించవచ్చు.
(NOTE: పై చిట్కాలు ఉపయోగించే ముందు తప్పని సరిగా పాచ్ టెస్ట్ చేయండి. ఈ మిశ్రమాన్ని చేతి వెనుక భాగంలో లేదా చెవి వెనుక భాగంలో చిన్నగా రాసి ఎలాంటి అలర్జీ, దురద రాకపోతే మాత్రమే వాడాలి)
