ఉదయాన్ని ఇలా మొదలుపెట్టండి.. ఈ అలవాట్లు మీ జీవితాన్నే మార్చేస్తాయి..!
ఉదయం ఎలా మొదలుపెడితే ఆ రోజు అంతా మన ఆలోచనలు శరీర స్థితి దానిపై ఆధారపడి ఉంటాయి. రోజూ ఉండే ఒత్తిళ్లు, నిద్రలేమి లాంటి సమస్యల నుంచి బయటపడటానికి కొంత సమయం మనకు మనమే కేటాయించుకోవాలి. ఉదయాన్నే కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిస్తే శరీరం మనసు రెండూ ఉల్లాసంగా ఉండగలవు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రాత్రిపూట 5 నుంచి 7 తులసి గింజలను నీటిలో నానబెట్టండి. ఉదయం ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగండి. ఇవి శరీరానికి తేమను చక్కగా సమతుల్యం చేస్తాయి. యాంటీఆక్సిడెంట్ లక్షణాల వల్ల శరీరంలోని వేడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఈ పద్ధతి మీ రోజును బాగా ప్రారంభించడంలో సహాయపడుతుంది.
ఉదయాన్నే ఫోన్ చూస్తే మనసుకు ప్రశాంతత లేకుండా మారుతుంది. చుట్టూ జరుగుతున్న వార్తలు, సోషల్ మీడియా నోటిఫికేషన్లు మన ఉదయాన్ని తొందరగా ఆందోళనలోకి నెడతాయి. మొదటి 30 నిమిషాలు మొబైల్ కు దూరంగా ఉండండి. దానికి బదులుగా పచ్చని చెట్ల మధ్యలో కాసేపు నిశ్శబ్దంగా కూర్చోవచ్చు లేదా ప్రశాంతంగా మౌనంగా ఉండండి.
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని ఉదయం తాగడం ద్వారా శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపించవచ్చు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఉదయాన్నే వేడి నీరు తాగడం మన శరీరానికి ఒక సహజ డిటాక్స్ ప్రక్రియగా పని చేస్తుంది.
రోజంతా శక్తిగా ఉండాలంటే సరైన బ్రేక్ ఫాస్ట్ చాలా అవసరం. తక్కువ చక్కెర కలిగిన జీర్ణానికి అనుకూలమైన ధాన్యాలు, పండ్లు, నట్స్ తీసుకోవడం మంచిది. ప్రాసెస్ చేసిన ఆహారాలకు బదులుగా స్వచ్ఛమైన ఆహారాన్ని ఎంచుకోవాలి. ఇలా చేస్తే మానసిక స్పష్టత కూడా పెరుగుతుంది.
ఉదయాన్నే 5 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చుని రోజూ ఉండే ఆందోళనల నుంచి కాసేపు విరామం తీసుకోవడం అవసరం. శ్వాసపై ధ్యానం లేదా మెలోడీ సంగీతం వినడం ద్వారా మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇది శరీరానికే కాదు మన ఆలోచనల తీరుకు కూడా మంచి మార్గాన్ని కలిగిస్తుంది.
మీకు ఎక్కువ సమయం లేకపోయినా సరే ఉదయాన్నే కనీసం 5 నిమిషాలు స్ట్రెచింగ్ లేదా సూర్య నమస్కారాలు చేయడం శరీరానికి మంచి శక్తిని ఇస్తుంది. కండరాల ఉల్లాసం, రక్త ప్రసరణ మెరుగుపడటం, శరీరం ఫ్రెష్ గా మారడం లాంటి లాభాలు ఉంటాయి.
నిద్రలేచిన వెంటనే ఆ రోజు చేయాల్సిన ముఖ్యమైన పనులను గుర్తించండి. వాటికి ప్రాధాన్యతనిచ్చి దృష్టి పెట్టండి. ఇలా చేస్తే పనులపై స్పష్టత ఏర్పడి ఇతర ఆందోళనలు దూరంగా ఉంటాయి. ఇది మీ పనిదినాన్ని విజయవంతంగా మారుస్తుంది.
ఈ అలవాట్లను ప్రతి ఉదయం పాటిస్తే శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు.. మానసిక ప్రశాంతత కూడా మీకు దక్కుతుంది. చిన్న చిన్న మార్పులతో పెద్ద మార్పులను సాధించవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)