National Youth Day 2026: మీ కోసం స్ఫూర్తి రగిలించే స్వామి వివేకానంద టాప్ 10 కోట్స్
ప్రపంచ పటంపై భారత ఆధ్యాత్మిక కీర్తి పతాకాన్ని ఎగరవేయడంతోపాటు దేశ యువతలో ఎంతో స్ఫూర్తిని రగిలించారు వివేకానందుడు. దేశ యువత ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదో? ఆయన స్పష్టంగా తెలియజేశారు. వివేకానందుడి మాటలు, సూక్తులు ఇప్పటికీ, ఎప్పటికీ యువతకు మార్గనిర్దేశనం చేస్తూనే ఉన్నాయి.. ఉంటాయి. స్వామి వివేకానంద జయంతినాడైన జనవరి 12న జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా వివేకానంద స్ఫూర్తి రగిలించే కొన్ని సూక్తులు..

స్వామి వివేకానంద.. భారతీయ ఆధునిక ఆధ్యాత్మికవేత్తలలో ప్రముఖులు. వివేకానందుడి అసలు పేరు నరేంద్ర నాథ్ దత్తా. వివేకానందుడు.. మరో గొప్ప ఆధ్యాత్మిక గురువు అయిన రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. రామకృష్ణ పరమహంస వద్ద శిశ్యుడిగా చేరిన తర్వాతే ఆయన వివేకానందుడు అయ్యారు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రాలలో సమాజంపై అత్యంత ప్రభావం కలిగించిన ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడుగా మారారు. వివేకానందుడు.. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక గొప్ప వ్యక్తి. రామకృష్ణ మఠం ఆయనే స్థాపించారు.
ప్రపంచ పటంపై భారత ఆధ్యాత్మిక కీర్తి పతాకాన్ని ఎగరవేయడంతోపాటు దేశ యువతలో ఎంతో స్ఫూర్తిని రగిలించారు వివేకానందుడు. దేశ యువత ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదో? ఆయన స్పష్టంగా తెలియజేశారు. వివేకానందుడి మాటలు, సూక్తులు ఇప్పటికీ, ఎప్పటికీ యువతకు మార్గనిర్దేశనం చేస్తూనే ఉన్నాయి.. ఉంటాయి. స్వామి వివేకానంద అందించిన అనేక కొటేషన్లలో కొన్నింటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
స్వామి వివేకానంద సూక్తులు
1. లేవండి! మేల్కొండి! గమ్యం చేరే వరకు విశ్రమించకండి.
2. నీ వెనుక ఏముంది.. ముందు ఏముంది.. అనేది నీకనవసరం నీలో ఏముంది అనేది ముఖ్యం.
3. రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి, లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశం కోల్పోతారు.
4. విజయం కలిగిందని విర్రవీగకు, అపజయం కలిగిందని నిరాశ చెందకు, విజయమే అంతం కాదు, అపజయం తుది మెట్టు కాదు.
5. ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం, ఇది విజయాన్ని కాక్షించే వారి ప్రాథమిక లక్షణం.
6. ఏ పరిస్థితులలో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరుగుతాయి.
7. జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్టు, కానీ, వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే.
8. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే.. ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది.
9. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి.. బలహీనులుగా మార్చే ప్రతి ఆలోచననూ తిరస్కరించండి.
10. తనను తాను చిన్నబుచ్చుకోవడం అన్ని ఇతర బలహీనతలకంటే పెద్ద బలహీనత, తనను తాను ద్వేహించుకోవడం మొదలు పెట్టిన వ్యక్తికి పతనం తప్పదు.
ఇంకా కొన్ని..
భయపడకు, ముందుకు సాగు, బలమే జీవితం, బలహీనతే మరణం.
విద్య లక్ష్యం కేవలం ఉద్యోగం సంపాదించడం కాదు, వ్యక్తిత్వ నిర్మాణం, స్వావలంబన
మీరు లోపలి నుండి ఎదగాలి. ఎవరూ మీకు నేర్పించలేరు, మీ ఆత్మే మీ గురువు.
మీరు ఎటువంటి సమస్యలను ఎదుర్కోని రోజు, మీరు తప్పు మార్గంలో ఉన్నారని మీరు నిర్ధారించుకోవచ్చు.
మీ మీద మీరు నమ్మకం ఉంచండి, దేవుడిని నమ్మండి, అదే గొప్పతనం రహస్యం.
దేశానికి యువతే పునాది అని.. భారతదేశ భవిష్యత్తును మీ బాధ్యతగా తీసుకోవాలని యువతకు స్వామి వివేకానంద నిర్దేశించారు.
