
అందరు మహిళలు తమ చేతులను అందంగా మార్చుకోవడానికి నెయిల్ పాలిష్‌ని వాడుతుంటారు. ప్రతి రంగు నెయిల్ పాలిష్ మార్కెట్‌లో సులువుగా దొరుకుతుంది. ఇది వారి బట్టల కలర్ సహా కంప్లీట్ డ్రెసింగ్‌కు తగినట్టుగా నెయిల్ పాలిష్ కలర్‌ని ఎంచుకుని వాడుతుంటారు. ఈ రోజుల్లో నెయిల్ ఆర్ట్‌కి చాలా క్రేజ్ ఉంది. కానీ నెయిల్ పాలిష్ మీ చేతులను అందంగా మార్చడమే కాకుండా, మీకు అనారోగ్య సమస్యలను కూడా కలిగిస్తుందని మీకు తెలుసా.? అవును ఈ అందమైన నెయిల్ పాలిష్‌లలో ఆరోగ్యానికి హాని కలిగించే అనేక హానికరమైన రసాయనాలు ఉంటాయి.
నెయిల్ పాలిష్ అప్లై చేయడం ప్రమాదకరం –
నెయిల్ పాలిష్ ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు ఆరోగ్య్ నిపుణులు. నెయిల్ పాలిష్‌లో అనేక రసాయనాలు ఉంటాయి. ఈ రసాయనాలన్నీ ఆరోగ్యానికి చాలా హానికరం. వాటి నిరంతర, సుదీర్ఘమైన ఉపయోగం వల్ల అలెర్జీలు, వాపు, ఎరుపు వంటి చర్మ సమస్యలను కలిగిస్తుంది. నెయిల్ పాలిష్ రిమూవర్లను కూడా హానికరమైన రసాయనాలతో తయారు చేస్తారు. వీటిని ఉపయోగించడం వల్ల చర్మం పొడిబారడంతోపాటు గరుకుగా మారుతుంది. చర్మం సహజ ఆయిల్, క్షీణత ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా ప్రమాదాన్ని పెంచుతుంది.
శ్వాసకోశ సమస్యలు-
అలాగే, నెయిల్ పాలిష్‌లో ఉండే రసాయనాలు శ్వాసకోశ సమస్యలకు దారి తీస్తాయి. కాబట్టి నెయిల్ పాలిష్ వేసేటప్పుడు లేదా తొలగించేటప్పుడు మాస్క్ ధరించడం చాలా ముఖ్యం. నెయిల్ పాలిష్ లో ఉండే ట్రైఫినైల్ ఫాస్ఫేట్ ఊపిరితిత్తులకు కూడా హానికరం. ఇది ఊపిరితిత్తులలో వాపుకు కారణమవుతుంది. దీని కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. ఆస్తమా వంటి వ్యాధులు కూడా రావచ్చు.
బ్రెయిన్ డ్యామేజ్ –
నెయిల్ పాలిష్‌లోని టోలున్, ఫార్మాల్డిహైడ్, డైథైల్ థాలేట్ వంటి రసాయనాలు శరీరంలోని ఇతర భాగాల మాదిరిగా మెదడుకు చేరుతాయి. ఈ రసాయనాలు మెదడు కణాలను దెబ్బతీస్తాయి, మెదడుకు రక్త ప్రసరణకు అంతరాయం కలిగిస్తాయి. ఇది తీవ్రమైన తలనొప్పికి కారణమవుతుంది. నెయిల్ పాలిష్ వల్ల చాలా మందికి వికారం, వాంతులు వస్తాయి.
గర్భిణీ స్త్రీలకు ప్రమాదం-
నెయిల్ పాలిష్‌లో ఉండే రసాయనాలు గర్భిణీ స్త్రీలకు మరింత ప్రమాదకరం. ఎందుకంటే అవి పిండం వద్దకు చేరుతాయి. పుట్టబోయే బిడ్డ శరీరంలో లోపాలను కలిగిస్తాయి. కాబట్టి, నెయిల్ పాలిష్ వాడకాన్ని తగ్గించాలి. మీరు తప్పనిసరిగా నెయిల్ పాలిష్‌ను ధరించాలంటే, సహజమైన నెయిల్ పాలిష్‌ని ఉపయోగించండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)