AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Panchami: నాగు పాములు పగబడతాయా..! నాగమణి ఉంటుందా.. ఈ నమ్మకాలపై ప్రముఖులు చెప్పిన విషయాలు ఏమిటంటే..

ప్రతి ఒక్కరికీ పాములు అంటే చాలా భయం. అందుకనే పామును చూసిన వెంటనే వాటికి దూరంగా పారిపోతారు. అయితే పర్యావరణ సమతుల్యతలో పాముల పాత్రను ఎన్నదగినది. చాలా మందికి నాగు పాముల విషయంలో అనేక అపోహలు ఉన్నాయి. హిందువులకు నాగుపాములకు సంబంధించిన అనేక రకాల నమ్మకాలు ఉన్నాయి. ఈ రోజు ఈ నమ్మకాల్లో ఎంత వరకూ నిజం ఉందో తెలుసుకుందాం..

Naga Panchami: నాగు పాములు పగబడతాయా..! నాగమణి ఉంటుందా.. ఈ నమ్మకాలపై ప్రముఖులు చెప్పిన విషయాలు ఏమిటంటే..
Naga Panchami 2025
Surya Kala
|

Updated on: Jul 29, 2025 | 3:54 PM

Share

మన పెద్దలు చెప్పిన విషయాలను చాలా వరకూ అనుసరించడానికి ప్రయత్నిస్తాం. అవును మన పెద్దలు చెప్పిన కొన్ని ఆలోచనలు, ఆచారాల వెనుక ఉన్న కారణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, వాటి గురించి ప్రశ్నలు అడగడానికి పెద్దగా ఆసక్తి చూపించం. నాగుపాముల విషయంలో కూడా ఇది మినహాయింపు కాదు. నేటికీ హిందువులు నాగుపాములు పాలు తాగుతాయని, తలపై నాగమణి ఉన్న నాగుపాములు ఉన్నాయని నమ్ముతారు. ఇదే విషయంపై ఈ రోజు ఉడిపికి చెందిన రచయిత, హెర్పెటాలజిస్ట్ గురురాజ్ స్పందించారు. నాగు పాములకు సంబంధించిన అపోహలు, నమ్మకాల గురించి రకరకాల విషయలను తెలియజేశారు.

నాగుపాములు పాలు తాగుతాయా?

నాగుపాము ఎప్పుడూ పాలు తాగదు. పాములు సరీసృపాలు కనుక తల్లిపాలు ఇవ్వవు. గుడ్లను పొదగి పిల్లలను చేస్తాయి. ఇవి కప్పలు, పాములు వంటి జీవులను పట్టుకుని తింటాయి. ఇది పాముల జీవన విధానం. కనుక పాలకు పాముతో సంబంధం లేదు. అయితే మన దేశంలో హిందువులు సర్పాలను దైవంగా భావించి పూజిస్తూ పంచామృతాన్ని , లేదా పుట్టలో పాలు పోసే ఆచారాన్ని పాటిస్తారు. అయితే పాములు పాలు తాగవు. ఒక పామును నెలల తరబడి బోనులో ఉంచి దానికి ఆహారం, నీరు ఇవ్వకుండా ఉంచి.. అప్పుడు నీటితో కలిపిన పాలు ఇస్తే.. అప్పుడు ఆ పాము దాహం తీర్చుకోవడానికి ఆ పాలను తాగవచ్చు. అంతేకానీ సంప్రదాయం పేరుతో బతికి ఉన్న పాములకు పాలు పోయడం చాలా సమంజసం కాదని చెప్పారు.

పూజ పేరుతో పుట్టలో పాలు పోయడం సరైనదేనా?

వివిధ ప్రదేశాలలో నాగ పంచమి వేడుకలను వివిధ రకాలుగా జరుపుతారు. కొన్ని ప్రాంతాలలో పాముల పుట్టలో పాలు పోయడం ఆచారం. ఈ పుట్టలు నాగుపాముల నివాసాలు మాత్రమే అని నమ్ముతారు. ప్రకృతిలోని ఈ పుట్టలను చెదపురుగులు నిర్మిస్తాయి. ఈ గూళ్ళు పచ్చని వాతావరణంలో నిర్మించబడతాయి. కాలక్రమేణా చెదపురుగులు ఈ గూళ్ళను వదిలివేస్తాయి. అప్పుడు ఎలుకలు చెదపుట్టలకు బొరియలు తవ్వి వాటిని తమ నివాసాలుగా చేసుకుంటాయి. ఆహారం కోసం ఈ గూళ్ళలోకి ప్రవేశించే ఈ పాములు క్రమంగా ఇక్కడి వాతావరణానికి అనుగుణంగా మార్చుకుని అక్కడే శాశ్వతంగా నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. అయితే నాగ పంచమి రోజున పూజ అనే నెపంతో పుట్టలో పాలు పోస్తారు. ఇది పనికిరాని ఆచారం. ఈ విధంగా లీటర్ల కొద్దీ పాలు పోయడం వల్ల పుట్టకి, పుట్టలో ఉండే పాములకు, ఇతర జీవులకు సమస్యలు వస్తాయి.

ఇవి కూడా చదవండి

నాగుపాము జతకట్టడం చూడటం పాప కర్మా..!

ఏ రకమైన లైంగిక సంపర్కాన్ని చూసినా అది అపవిత్రం అని హిందువులు భావిస్తారు. దీనికి కారణం.. ఈ ప్రక్రియ పట్ల మనకు అసహ్యం కలగకపోతే.. ఒకవేళ చూపరులకు ఉద్రేకం కలుగుతుందనే ఆలోచన మన పెద్దలకు ఉండవచ్చు. అదే విధంగా నాగుపాములు దేవుల్లగా భావించి పూజిస్తారు. కనుక ఇవి జత కట్టినప్పుడు చూడడం పాపమని .. దురదృష్టాన్ని కలిగిస్తుందనే నమ్మకం ఉంది. అయితే పాములు జంటగా ఉన్న సమయంలో చూడడం వలన ఎటువంటి సమస్యలు రావు. అలాంటి సందర్భాలలో పాములను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశ్యంతో సంభోగంలో నిమగ్నమైన పాములను చూడకూడదని మన పెద్దలు పెట్టిన నియమం అయి ఉండవచ్చు.

పాములు పగ పెంచుకుంటాయా?

పాములకు పగ పన్నెండేళ్లుగా ఉంటుందనేది అబద్ధం. ఒకసారి గాయపడితే. వెంటనే కాటు వేయదు. భయపెట్టి తరిమికొడుతుంది. ఆ తర్వాత.. ఆ పాము ఎప్పటికీ ఆ ప్రాంతానికి లేదా ప్రదేశానికి తిరిగి రాదు. పాములకు పగ పెట్టుకునేంత మెదడు అభివృద్ధి లేదు. అయితే నాగు పాములకు సహజ జ్ఞానం ఉంటుంది. తాము నివసించే వాతావరణం, ఆహారం ఉన్న చోటు, వాటి సహచరుడు ఉన్న చోటు వంటివి తెలుసుకునే సహజ జ్ఞానం ప్రకృతి పాములకు ఇచ్చింది. అంతేకాని పాములకు జ్ఞాపకశక్తి ఉండదు. కనుక పాములు పగ బడతాయనేది ఒక అపోహ.

నాగుపాము తలపై నాగమణి ఉంటుందా..!

నాగమణి అనే రత్నం ఉండవచ్చు. అయితే నాగుపాము పడగపై రత్నం ఉన్నట్లు ఎటువంటి రికార్డులు లేవు. అయితే కొంతమంది పురాణం గ్రంథాల్లోని ఆలోచనలను పెట్టుబడిగా చేసుకుని కృత్రిమ రత్నాలను సృష్టించడం ద్వారా ప్రజల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని దోపిడీ చేస్తున్నారు. అంతేకానీ నాగమణి అనేది నమ్మకం, పురాణాలలో తప్ప ఎక్కడా శాస్త్రీయంగా నమోదు కాలేదు.

గంట శబ్దం వింటే నాగుపాములు తలలు ఊపుతాయా?

నాగుపాములతో సహా అన్ని పాములకు చెవులు అనే అవయవం ఉండదు. అవి తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గ్రహించడానికి తమ చీలిక నాలుకలను ఉపయోగిస్తాయి. భూమిలోని కంపనాలు, వాటి దవడలు, పక్కటెముకలు, చెవుల ఎముకల ద్వారా సుదూర శబ్దాలను గుర్తిస్తాయి. వాటి కళ్ళు కొంత పని చేస్తాయి. అంతేకానీ పాములకు నాగుపాములకు సంగీతానికి సంబంధించిన ఎటువంటి జ్ఞానం లేదు. వాటి కోరల కొన కూడా పదునైనవి కనుక అవి భయపడి తలలు ఊపుతాయి. అయితే హెర్పెటాలజిస్టులు ఈ నాగుపాములు సంగీతానికి తలలు ఊపుతాయని ప్రజలు నమ్ముతారు.. అది తప్పు అని చెబుతున్నారు.

మరిన్ని జీవనశైలి వార్తలను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి .

మైదా లేదు, సాస్ లేదు.. వింటర్ సీజన్‌లో ఆరోగ్యకరమైన పిజ్జా..
మైదా లేదు, సాస్ లేదు.. వింటర్ సీజన్‌లో ఆరోగ్యకరమైన పిజ్జా..
వాళ్లకు ఈజీగా ఛాన్స్‌లు.. నాకు మాత్రం కష్టమే: థమన్
వాళ్లకు ఈజీగా ఛాన్స్‌లు.. నాకు మాత్రం కష్టమే: థమన్
డిసెంబర్‌ 31 చివరి గడువు.. లేకుంటే రేషన్‌ సరుకులు బంద్‌!
డిసెంబర్‌ 31 చివరి గడువు.. లేకుంటే రేషన్‌ సరుకులు బంద్‌!
ఎస్బీఐ కాదు.. దేశంలో బెస్ట్ బ్యాంక్ ఇదే.. మీరు అస్సలు ఊహించలేరు..
ఎస్బీఐ కాదు.. దేశంలో బెస్ట్ బ్యాంక్ ఇదే.. మీరు అస్సలు ఊహించలేరు..
జుట్టు రాలుతోందా..? ఈ మ్యాజిక్ జ్యూస్ తాగితే వెంటనే ఆగిపోతుంది..
జుట్టు రాలుతోందా..? ఈ మ్యాజిక్ జ్యూస్ తాగితే వెంటనే ఆగిపోతుంది..
మెస్సీ ప్రయాణించిన విమానం ఖరీదు ఎంతో తెలిస్తే గుండె ఆగిపోతుంది?
మెస్సీ ప్రయాణించిన విమానం ఖరీదు ఎంతో తెలిస్తే గుండె ఆగిపోతుంది?
బాలయ్య 'అఖండ 2' మూవీలో శివుడిగా నటించింది ఎవరో తెలుసా?
బాలయ్య 'అఖండ 2' మూవీలో శివుడిగా నటించింది ఎవరో తెలుసా?
గెలిపించేస్తాడు..వైభవ్ సూర్యవంశీపై కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే ధీమా
గెలిపించేస్తాడు..వైభవ్ సూర్యవంశీపై కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే ధీమా
ఎంతకు తెగించ్చార్రా.. బిగ్‌బాస్‌లో దుమారం..
ఎంతకు తెగించ్చార్రా.. బిగ్‌బాస్‌లో దుమారం..
లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. ఆ డబ్బు ఎవరు కట్టాలి.. రూల్స్..
లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. ఆ డబ్బు ఎవరు కట్టాలి.. రూల్స్..