AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు రాష్ట్రాల్లోనే ఫేమస్.. మటన్ బోటిలో ఇదొక్కటి వేశారంటే డబుల్ స్టామినా.. ఆ రోగాల ముచ్చటే ఉండదు..

బోటి గోంగూర తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన సంప్రదాయ వంటకం. గోంగూరలోని విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో పాటు బోటిలోని ప్రోటీన్, ఐరన్‌ వంటి పోషకాలు శరీరానికి అందుతాయి. రుచి మాత్రమే కాకుండా పోషక విలువలు కూడా ఉన్న ఈ వంటకం రక్తహీనత, రోగనిరోధక శక్తి, ఎముకల ఆరోగ్యం వంటి అంశాల్లో ఎలా ఉపయోగపడుతుంది? బోటి గోంగూరను ఎంత మోతాదులో తీసుకోవాలి? తెలుసుకుందాం..

తెలుగు రాష్ట్రాల్లోనే ఫేమస్.. మటన్ బోటిలో ఇదొక్కటి వేశారంటే డబుల్ స్టామినా.. ఆ రోగాల ముచ్చటే ఉండదు..
Mutton Boti
Shaik Madar Saheb
|

Updated on: Aug 23, 2026 | 6:24 PM

Share

బోటి గోంగూర.. తెలుగు రాష్ట్రాలు.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో అత్యంత ప్రజాదరణ పొందిన, రుచికరమైన సంప్రదాయ వంటకాల్లో ఒకటి. గోంగూర ఆకుల పులుపు, బోటి (మటన్ పేగులు) ప్రత్యేకమైన రుచి కలగలిసి ఈ కూరను అద్భుతంగా చేస్తుంది. అయితే, దీని రుచి మాత్రమే కాదు, ఇది అందించే ఆరోగ్య ప్రయోజనాలు కూడా విశేషమైనవి. ఇది కేవలం నోటికి రుచిని మాత్రమే కాకుండా, శరీరానికి పోషణను కూడా అందిస్తుందని డైటీషియన్లు చెబుతున్నారు.

పోషక విలువలు:

బోటి గోంగూరలో శరీరానికి అవసరమైన అనేక పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. గోంగూరలో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ బి1 (థయామిన్), విటమిన్ బి2 (రిబోఫ్లేవిన్), విటమిన్ బి9 (ఫోలేట్) వంటి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్ వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా ఇందులో ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల శరీర కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడంలో సహాయపడుతుంది. బోటి, ముఖ్యంగా మటన్ ప్రేగులు, ప్రోటీన్‌తో పాటు ఐరన్ వంటి ఖనిజాలను అందిస్తుంది.

డయాబెటిస్ నియంత్రణలో:

డయాబెటిస్ ఉన్నవారికి బోటి గోంగూర ఒక మంచి ఆహార ఎంపిక. గోంగూర రక్తంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచి, చక్కెర స్థాయిలను సమర్థవంతంగా తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడం ద్వారా డయాబెటిస్ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు తమ ఆహారంలో దీనిని చేర్చుకోవడం వల్ల ప్రయోజనం పొందవచ్చు..

రోగనిరోధక శక్తి పెంపు:

బోటి గోంగూరను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది. విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లు శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. బలమైన రోగనిరోధక శక్తి జలుబు, దగ్గు, రొంప వంటి సాధారణ సీజనల్ వ్యాధుల బారి నుండి శరీరాన్ని కాపాడుతుంది. ఇది సహజసిద్ధమైన ఔషధంగా పనిచేస్తుంది.

రక్తహీనత నివారణ:

రక్తహీనత సమస్యతో బాధపడేవారికి బోటి గోంగూర ఒక అద్భుతమైన పరిష్కారం. బోటిలో ఉండే ఐరన్, గోంగూరలో ఉండే విటమిన్ సి ఐరన్ శోషణకు సహాయపడతాయి, తద్వారా శరీరంలో రక్తం వృద్ధి చెందుతుంది. హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి రక్తహీనత సమస్యను సమర్థవంతంగా నియంత్రించడంలో ఇది తోడ్పడుతుంది.

కంటి చూపు మెరుగుదల:

గోంగూరలో అధికంగా ఉండే విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి చాలా ముఖ్యం. బోటి గోంగూరను తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. దృష్టి లోపాలు తొలగిపోతాయి. ఎలాంటి కంటి సమస్యలు త్వరగా దరిచేరకుండా ఇది రక్షణ కల్పిస్తుంది.

ఎముకల బలం:

ఈ కూరలో లభించే కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ కె ఎముకలను బలంగా, ఆరోగ్యంగా, పటిష్టంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఎముకలకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడేవారు బోటి గోంగూరను తమ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది ఎముకల సాంద్రతను పెంచి, బోలు ఎముకల వ్యాధి వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.

కొంతమంది బోటి గోంగూరను ఎక్కువగా తింటే వేడి చేస్తుందని భావిస్తారు. అయితే, ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, వారానికి రెండు లేదా మూడుసార్లు దీనిని తినడం వల్ల ఎటువంటి సమస్యలు ఉండవని, పైగా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని సూచిస్తున్నారు. రుచి, ఆరోగ్యం రెండింటినీ అందించే బోటి గోంగూర నిజంగా ఒక పోషకాల గని.. అని ఎవ్వరైనా తినొచ్చని సూచిస్తున్నారు డైటీషియన్లు.. అయితే, ఏమైనా సమస్యలుంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us