AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jailer 2: ‘కావాలయ్యా’ను మరిపించేలా అల్ల బోలలే.. కంపోజ్ చేసిన అనిరుధ్

Jailer 2: ‘కావాలయ్యా’ను మరిపించేలా అల్ల బోలలే.. కంపోజ్ చేసిన అనిరుధ్

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Aug 23, 2026 | 7:59 PM

Share

‘జైలర్’ సక్సెస్‌లో అనిరుధ్ రవిచందర్ సంగీతం కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదలైంది. మలయాళీ కల్చర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతున్న ఈ పాటకు అనిరుధ్ కొత్త తరహా కంపోజిషన్ అందించారు. స్పెషల్ సాంగ్‌లో పూర్ణ కనిపించగా, క్లాసికల్ టచ్‌తో రూపొందిన పాట ‘కావాలయ్యా’ స్థాయిలో మరో చార్ట్‌బస్టర్ అవుతుందా అనే ఆసక్తి నెలకొంది.

ఊపిరి తీసుకునే గ్యాప్ కూడా ఇవ్వట్లేదుగా.. అప్పుడే మళ్లీ కొత్త పాట ఇచ్చేసారు అనిరుధ్ రవిచందర్. డిసి మ్యాజిక్ ఇంకా నడుస్తుండగానే.. హమ్ చేసుకోడానికి అల్ల బోలెలే అంటూ సూపర్ స్టార్‌ను వెంటబెట్టుకుని వచ్చేసారు ఈ సంగీత సంచలనం. జైలర్ 2 ప్రమోషన్స్ సైలెంట్‌గా మొదలైపోయాయి.. ఇందులో ఫస్ట్ లిరికల్ వచ్చేసింది.. మరి కావాలయ్యాను మరిపించే సత్తా ఈ కొత్త పాటకు ఉందా..? జైలర్ సినిమా అంత పెద్ద హిట్ అయిందంటే దానికి ప్రధానమైన కారణం అనిరుధ్ సంగీతం.. ఆర్ఆర్ లేకుండా నేనే జైలర్ చూడలేకపోయానంటూ రజినీ స్వయంగా చెప్పారంటే ఆ విజయంలో అనిరుధ్ పాత్ర ఏంటో అర్థం అయిపోతుంది. తాజాగా జైలర్ 2 వచ్చేస్తుంది.. అక్టోబర్ 15న విడుదల కానుంది ఈ చిత్రం. ఇందులోంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. జైలర్ మాదిరే ఈ కథ కూడా వేర్వేరు రాష్ట్రాల బ్యాక్‌డ్రాప్‌లోనే సాగుతుందని పాట చూస్తుంటేనే అర్థమైపోతుంది. జైలర్‌లో కర్ణాటక, ఏపీ, తెలంగాణ అంటూ చాలా స్టేట్స్ తిప్పారు నెల్సన్. ఈసారి కేరళను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా విడుదలైన పాట మొత్తం మలయాళం కల్చర్‌లోనే సాగుతుంది.. కంపోజిషన్ కూడా పూర్తిగా ఆ స్టైల్‌లోనే చేసారు అనిరుధ్. జైలర్‌లో స్పెషల్ సాంగ్ కోసం తమన్నాను తీసుకుంటే.. ఈసారి నెల్సన్ ఛాయిస్ ఆసక్తికరంగా పూర్ణ వైపు మళ్లింది. పాట క్లాసికల్ టచ్‌లో సాగడంతో స్వతహాగా డాన్సర్ అయిన ఆమెనే తీసుకున్నారు. రెండేళ్ల కింద గుంటూరు కారంలో పూర్ణ చేసిన కుర్చీ మడతబెట్టి సాంగ్ చార్ట్‌బస్టర్ అయింది.. చూస్తుంటే ఈ పాట కూడా అదే రేంజ్‌కు వెళ్లేలా కనిపిస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాన్,ఆధార్ వాట్సాప్‌లో పంపుతున్నారా? క్షణాల్లో రంగంలోకి సైబర్ నేరగాళ్లు.. రెప్పపాటులో బ్యాంకు ఖాతాలు గుల్ల

బయటకి ఆరోగ్యంగా కనిపిస్తున్నా.. కొన్ని విటమిన్‌ లోపాలు ఉండొచ్చు.. ఎలా చెక్‌ చేసుకోవాలి?

వేగంగా వేడెక్కుతున్న భూమి.. ప్రమాదంలో పెద్దల ప్రాణాలు మేలుకోకుంటే మరణ మృదంగమే !

కుటుంబంలో ఆర్థిక, ఆరోగ్య సమస్యలా.. అయితే మళ్లీ పెళ్లి చేసుకోండి!

అంతరిక్షంలో అగ్రికల్చర్.. తాజా ఆకుకూరలు పండించిన నాసా వ్యోమగామి

Published on: Aug 23, 2026 04:54 PM
Follow Us