మన హీరోలు వద్దా.. పరభాషా స్టార్లే ముద్దా? టాలీవుడ్ దర్శకుల కొత్త రూట్ ఇదే!
టాలీవుడ్ దర్శకుల చూపు ఇప్పుడు సొంత హీరోలకే పరిమితం కావడం లేదు. వెంకీ అట్లూరి, శేఖర్ కమ్ముల, పూరీ జగన్నాథ్, కళ్యాణ్ శంకర్, శైలేష్ కొలను వంటి దర్శకులు పరభాషా హీరోలతో సినిమాలు చేస్తున్నారు లేదా ప్లాన్ చేస్తున్నారు. తమిళ, హిందీ హీరోల వైపు పెరుగుతున్న ఈ ఆసక్తికి కథల అవసరమా, మార్కెట్ విస్తరణా, లేక మన హీరోల డేట్స్ సమస్యా అన్న చర్చ ఇండస్ట్రీలో సాగుతోంది.
తెలుగు దర్శకులను మన హీరోలు పట్టించుకోవట్లేదా లేదంటే వాళ్ళు రాసుకుంటున్న కథలకు మన హీరోలే సరిపోవట్లేదా..? ప్రతీ కథకు పక్క భాష నుంచి హీరోలనెందుకు మన దర్శకులు తెచ్చుకుంటున్నారు.?? వందల కోట్ల మార్కెట్ ఉన్న మన హీరోలను కాదని.. పరాయి భాషల్లోని హీరోల వైపు ఎందుకు మన దర్శకుల అడుగులు పడుతున్నాయి..? మన దర్శకులు ఎందుకో మరి ఈ మధ్య ఎక్కువగా పరభాషా హీరోల వైపే వెళ్తున్నారు. ఒక్కరో ఇద్దరో అంటే ఏమో అనుకోవచ్చు కానీ చాలా మంది డైరెక్టర్స్ చూపులు ఇండస్ట్రీ దాటి వెళ్తున్నాయి. వెంకీ అట్లూరి కొన్నేళ్లుగా మన హీరోలతో సినిమాలు చేయడమే మానేసారు.. శేఖర్ కమ్ముల గతేడాది ధనుష్‌తో కుబేరా చేసారు. ఆఖరికి పూరీ జగన్నాథ్ కూడా విజయ్ సేతుపతితో స్లమ్ డాగ్ చేస్తున్నారు. స్లమ్ డాగ్ తర్వాత కూడా పూరీ జగన్నాథ్ చూపులు పరభాషా హీరోలపైనే ఉన్నాయని తెలుస్తుంది. సూర్య, ధనుష్‌లలో ఒకరికి కథ చెప్పి ఒప్పించి సినిమా చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నారీయన. ఇక మ్యాడ్ ఫ్రాంచైజీతో బాగా నవ్వించిన కళ్యాణ్ శంకర్.. ప్రస్తుతం కార్తితో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను కూడా సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తుంది. శైలేష్ కొలను ప్రస్తుతం రోషన్‌తో ఏమో ఏమో ఇది సినిమా చేస్తున్నా.. నెక్ట్స్ కార్తితో హిట్ 4 లైన్‌లో పెట్టారు. స్టార్ డైరెక్టర్స్ చూపులు కూడా వేరే ఇండస్ట్రీపైనే ఉన్నాయి. ఆల్రెడీ విజయ్‌తో వారిసు చేసి హిట్ కొట్టిన వంశీపైడిపల్లి.. ప్రస్తుతం సల్మాన్‌తో హిందీ సినిమా చేస్తున్నారు. ఇక త్రివిక్రమ్ కూడా సూర్యతో ఓ సినిమాకు సిద్ధమవుతున్నారు. మొత్తానికి మన దర్శకులంతా మన హీరోలను వదిలేసి పక్క ఇండస్ట్రీలకు వెళ్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బయటకి ఆరోగ్యంగా కనిపిస్తున్నా.. కొన్ని విటమిన్ లోపాలు ఉండొచ్చు.. ఎలా చెక్ చేసుకోవాలి?
వేగంగా వేడెక్కుతున్న భూమి.. ప్రమాదంలో పెద్దల ప్రాణాలు మేలుకోకుంటే మరణ మృదంగమే !
కుటుంబంలో ఆర్థిక, ఆరోగ్య సమస్యలా.. అయితే మళ్లీ పెళ్లి చేసుకోండి!
అంతరిక్షంలో అగ్రికల్చర్.. తాజా ఆకుకూరలు పండించిన నాసా వ్యోమగామి
తెల్లవారేసరికి ఇళ్ల ముందు క్షుద్రపూజలు
లక్షల ఖర్చు లేదు.. రోడ్డుపైనే పెళ్లి.. వీడియో వైరల్!
తిరుమల గదిలో 9 అడుగుల జర్రిపోతు.. భక్తుల్లో భయం!
ప్రపంచ రికార్డు సృష్టించిన 13 రోజుల చిన్నారి
అర్థరాత్రి రోడ్డు దాటుతూ కనిపించిన వింత జీవి!
62 ఏళ్ల వయసులోనూ వర్కవుట్స్.. నీతా అంబానీ ఫిట్నెస్ రహస్యం ఇదే!
కదులుతున్న రైల్లోకి పార్శిల్ డెలివరీ.. వాటే టైమింగ్ బాస్!
అయ్యో.. ఈ భర్త కష్టం ఎవరికీ రాకూడదు!
హిట్టు కొడితే.. కోట్ల విలువ చేసే లగ్జరీ కార్ చేతిలో పడ్డట్టే..
బిగ్ బాస్ 10 - కామనర్స్ Vs సెలబ్రిటీస్ మధ్యలో మంట పెట్టిన మానస్
మహేష్ బాబు, రాజమౌళిలకు నోటీసులు..అసలేం జరిగిందంటే?
మీర్జాపూర్ ఊచకోత.. రూ.200 కోట్ల కలెక్షన్స్ దిశగా అడుగులు

