AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కంటి చూపును చురకత్తిలా మార్చే పచ్చడి.. వారానికి రెండుసార్లు తింటే మసక అనే మాటే ఉండదు..

పొన్నగంటాకు మన సంప్రదాయ ఆహారంలో ఎంతో ప్రత్యేకమైన ఆకుకూర. విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు లభించే ఈ ఆకుతో తయారు చేసే పచ్చడి రుచితో పాటు పోషకాలను కూడా అందిస్తుంది. అన్నం, ఇడ్లీ, దోశతో తినగలిగే పొన్నగంటాకు పచ్చడిని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలి? దాని పోషక విలువలు ఏంటి? తెలుసుకుందాం..

కంటి చూపును చురకత్తిలా మార్చే పచ్చడి.. వారానికి రెండుసార్లు తింటే మసక అనే మాటే ఉండదు..
Ponaganti Aaku Pachadi
Shaik Madar Saheb
|

Updated on: Aug 23, 2026 | 4:59 PM

Share

ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఆధునిక జీవనశైలిలో ఒక ప్రధాన భాగం. మన సాంప్రదాయ వంటకాలలో ఎన్నో ఔషధ గుణాలున్న పదార్థాలు ఉన్నాయి. ముఖ్యంగా.. ఆహారంలో పోషకాలు, రుచి కలిపి ఉన్న వంటకాలు చాలా అరుదు.. అలాంటి అద్భుతమైన వంటకాలలో ఒకటి పొన్నగంటాకు ఒకటి.. ఈ పొన్నగంటి ఆకు పచ్చడి తింటే.. ఎన్నో సమస్యలను నివారించవచ్చు.. ఎన్నో పోషక విలువలు కలిగిన పొన్నగంటాకులో శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు పుష్కటంగా ఉన్నాయి.. విటమిన్ ఏ, బి6, సి, ఐరన్, కాల్షియం వంటివి పుష్కలంగా ఉన్నాయి.. ముఖ్యంగా ఈ పొన్నగంటాకు పచ్చడి కంటి చూపును మెరుగుపరచడంలో, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతో తోడ్పడుతుంది.

పొన్నగంటాకు శాస్త్రీయ నామం “ఆల్టర్నాంథెరా సెసిలిస్”, భారతదేశంలో విస్తృతంగా లభించే ఒక ఔషధ గుణాలున్న ఆకుకూర. ఇది విటమిన్ ఏ, బి6, సి, ఐరన్, కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలకు సమృద్ధిగా నిలయం. విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి, రాత్రిపూట చూపును మెరుగుపరచడానికి అత్యంత అవశ్యకం. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. ఐరన్ రక్తహీనతను నివారిస్తుంది.. కాల్షియం ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఈ పొన్నగంటాకును తరచుగా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరం శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది.

పొన్నగంటి ఆకు పచ్చడి తయారీ విధానం:

ఈ పచ్చడి తయారుచేయడానికి కొన్ని సులభమైన చిట్కాలు..

కావలసిన పదార్థాలు: ఒక పెద్ద కట్ట పొన్నగంటాకు (శుభ్రం చేసి కడిగినది) లేకపోతే.. నాలుగు చిన్న పొన్నగంటాకు కట్టలు, రెండు టమాటాలు (కట్ చేసినవి), ఎనిమిది ఎండుమిర్చి, ఏడు వెల్లుల్లి రెబ్బలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు అంగుళాల చింతపండు (కడిగినది), పది మిల్లీలీటర్ల నూనె, ఒక టేబుల్ స్పూన్ కల్లుప్పు. తాలింపు కోసం ఆవాలు, పచ్చిపప్పు, మినప్పప్పు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు.

కావాలంటే పల్లీలు, పచ్చిశనగ పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు..

వేయించడం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి, నూనె వేసి వేడిచేయాలి. నూనె వేడెక్కాక, ఎండుమిర్చి వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి ఒక మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి.

మగ్గించడం: అదే పాన్‌లో శుభ్రం చేసుకున్న పొనగంటాకు వేసి రెండు నిమిషాలు వేయించాలి. ఆ తరువాత కట్ చేసుకున్న టమాటాలు, కడిగిన చింతపండు వేసి రెండు నిమిషాలు తిప్పుకుంటూ వేయించి, మూత పెట్టి పది నిమిషాలు మగ్గనివ్వాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. మగ్గిన తర్వాత స్టవ్ ఆపి చల్లారనివ్వాలి.

గ్రైండ్ చేయడం: మిక్సీ జార్‌లోని ఎండుమిర్చిలో ఒక టేబుల్ స్పూన్ కల్లుప్పు, ఐదు వెల్లుల్లి రెబ్బలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి గ్రైండ్ చేయాలి. ఆ తరువాత మగ్గించుకున్న పొనగంటాకు, టమాటా మిశ్రమాన్ని వేసి మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.

తాలింపు కోసం ఒక చిన్న పాత్రలో నూనె వేసి వేడిచేయాలి. నూనె వేడెక్కాక అర టేబుల్ స్పూన్ ఆవాలు, అవి వేగాక అర టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, అర టేబుల్ స్పూన్ మినప్పప్పు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, మూడు వెల్లుల్లి రెబ్బలు, రెండు ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, చిటికెడు పసుపు వేసి తాలింపు వేగనివ్వాలి.

తాలింపు వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి, గ్రైండ్ చేసుకున్న పచ్చడిని అందులో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన పొనగంటాకు పచ్చడి సిద్ధం.

ఈ పచ్చడిని అన్నం, ఇడ్లీ, దోశ వంటి వాటితో కలిపి తినవచ్చు. ఇది కేవలం రుచిని మాత్రమే కాకుండా, మీ కుటుంబ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఈ సులభమైన వంటకాన్ని మీ ఇంట్లో తప్పకుండా ప్రయత్నించి, పొన్నగంటాకు అందించే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.. అయితే.. ఏమైనా అనారోగ్య సమస్యలుంటే ముందుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us