ఫారిన్ నుంచి ఫలక్‌నుమా దాకా.. టాలీవుడ్‌ను హైదరాబాద్ గల్లీలు ఎందుకు అంతగా ఆకట్టుకుంటున్నాయి?
ఇంటర్నేషనల్ మాఫియా, ఫారిన్ లొకేషన్లకు బదులుగా టాలీవుడ్ సినిమాలు ఇప్పుడు హైదరాబాద్ గల్లీల వైపు మళ్లుతున్నాయి. ప్రభాస్ ‘స్పిరిట్’, నాని–శ్రీకాంత్ ఓదెల ‘ది ప్యారడైజ్’ వంటి భారీ చిత్రాలు పక్కా లోకల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్నాయి. హైదరాబాద్ సంస్కృతి, యాస, పాతబస్తీ వాతావరణం కథలకు కొత్త రియాలిటీని తీసుకొస్తుండటంతో సిటీ బ్యాక్‌డ్రాప్ సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది.
ఒకప్పుడు ఇంటర్నేషనల్ మాఫియా, ఫారిన్ లొకేషన్ల చుట్టూ తిరిగిన పాన్ ఇండియా కెమెరాలన్నీ ఇప్పుడు భాగ్యనగరం గల్లీల్లోకి క్యూ కడుతున్నాయి. ప్రభాస్ లాంటి గ్లోబల్ స్టార్ నుంచి చిన్న సినిమాల వరకు అంతా పక్కా హైదరాబాదీ బ్యాక్‌డ్రాప్‌పై ఫోకస్ పెడుతున్నారు. టాలీవుడ్ కథల్లో బిర్యానీ ఫ్లేవర్ ఎక్కువగా కనిపిస్తుందిప్పుడు. ఉన్నట్లుండి సిటీ బ్యాక్‌డ్రాప్ సినిమాలకు డిమాండ్ ఎలా పెరిగింది..? హైదరాబాద్ నేపథ్యంలో సాగే కథలు చాలానే వచ్చాయి కానీ హైదరాబాదీ ఫ్లేవర్‌తో వచ్చిన సినిమాలు తక్కువే. ఆ మధ్య ఫలక్‌నుమా దాస్, ఈ నగారానికి ఏమైంది సినిమాలు అలాగే వచ్చాయి. ప్రేమలు లాంటి మలయాళం సినిమా కథంతా హైదరాబాద్‌లోనే జరుగుతుంది. తాజాగా ప్యాన్ ఇండియా కథలు కూడా సిటీ బ్యాక్‌డ్రాప్‌లో సిద్ధమవుతున్నారు. ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమా కథ అంతా లోకల్ నేపథ్యంలో సాగుతుంది. ఈ విషయం చెప్పింది నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగే. ఇన్నాళ్లూ ఈ సినిమా కథ ఇంటర్నేషనల్ మాఫియా చుట్టూ తిరుగుతుందని అనుకున్నా.. అదేం కాదు ఇది పక్కా లోకల్ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇందులో ప్రభాస్ పవర్‌ఫుల్ లోకల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు.. గతంలో పోకిరి కూడా ఇలా సిటీ బ్యాక్‌డ్రాప్‌లోనే సాగే పోలీస్ కథే. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ది ప్యారడైజ్ సినిమా కూడా పూర్తిగా హైదరాబాద్ నేపథ్యంలోనే సాగే కథ. దసరాను సింగరేణి నేపథ్యంలో తీసిన శ్రీకాంత్.. ఈసారి పక్కా పాతబస్తీ కథ రాసుకున్నారు. ఓల్డ్ సిటీ గల్లీ నుంచి వస్తున్న ఈ యాక్షన్ డ్రామాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పెద్ద సినిమాలే కాదు.. ఈ మధ్య దీవానా, అమీర్ లోగ్ లాంటి సినిమాలు పూర్తిగా లోకల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చినవే.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బయటకి ఆరోగ్యంగా కనిపిస్తున్నా.. కొన్ని విటమిన్ లోపాలు ఉండొచ్చు.. ఎలా చెక్ చేసుకోవాలి?
వేగంగా వేడెక్కుతున్న భూమి.. ప్రమాదంలో పెద్దల ప్రాణాలు మేలుకోకుంటే మరణ మృదంగమే !
కుటుంబంలో ఆర్థిక, ఆరోగ్య సమస్యలా.. అయితే మళ్లీ పెళ్లి చేసుకోండి!
అంతరిక్షంలో అగ్రికల్చర్.. తాజా ఆకుకూరలు పండించిన నాసా వ్యోమగామి
తెల్లవారేసరికి ఇళ్ల ముందు క్షుద్రపూజలు
లక్షల ఖర్చు లేదు.. రోడ్డుపైనే పెళ్లి.. వీడియో వైరల్!
తిరుమల గదిలో 9 అడుగుల జర్రిపోతు.. భక్తుల్లో భయం!
ప్రపంచ రికార్డు సృష్టించిన 13 రోజుల చిన్నారి
అర్థరాత్రి రోడ్డు దాటుతూ కనిపించిన వింత జీవి!
62 ఏళ్ల వయసులోనూ వర్కవుట్స్.. నీతా అంబానీ ఫిట్నెస్ రహస్యం ఇదే!
కదులుతున్న రైల్లోకి పార్శిల్ డెలివరీ.. వాటే టైమింగ్ బాస్!
అయ్యో.. ఈ భర్త కష్టం ఎవరికీ రాకూడదు!
హిట్టు కొడితే.. కోట్ల విలువ చేసే లగ్జరీ కార్ చేతిలో పడ్డట్టే..
బిగ్ బాస్ 10 - కామనర్స్ Vs సెలబ్రిటీస్ మధ్యలో మంట పెట్టిన మానస్
మహేష్ బాబు, రాజమౌళిలకు నోటీసులు..అసలేం జరిగిందంటే?
మీర్జాపూర్ ఊచకోత.. రూ.200 కోట్ల కలెక్షన్స్ దిశగా అడుగులు

