White Onion Benefits: తెల్ల ఉల్లిపాయలతో ఎన్ని హెల్త్ బెనిఫిట్సో.. మిస్ చేయకండి..

ఉల్లిపాయల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీటి గురించి అందరికీ తెలుసు. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. అలా శరీరంలోని అన్ని భాగాలకు కూడా ఉల్లి పాయ మేలు చేస్తుంది. గుండెకు, జుట్టుకు, చర్మానికి, లివర్, కళ్లకు ఇలా అన్ని శరీర భాగాలకు ప్రయోజనం చేకూర్చుతుంది. అయితే సాధారణ ఉల్లిపాయల కంటే తెల్ల ఉల్లిపాయలను కూడా చూసే ఉంటారు. ఇవి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని కూడా సాధారణ ఉల్లిపాయలాగే..

White Onion Benefits: తెల్ల ఉల్లిపాయలతో ఎన్ని హెల్త్ బెనిఫిట్సో.. మిస్ చేయకండి..
White Onions
Follow us

|

Updated on: Mar 28, 2024 | 2:39 PM

ఉల్లిపాయల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీటి గురించి అందరికీ తెలుసు. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. అలా శరీరంలోని అన్ని భాగాలకు కూడా ఉల్లి పాయ మేలు చేస్తుంది. గుండెకు, జుట్టుకు, చర్మానికి, లివర్, కళ్లకు ఇలా అన్ని శరీర భాగాలకు ప్రయోజనం చేకూర్చుతుంది. అయితే సాధారణ ఉల్లిపాయల కంటే తెల్ల ఉల్లిపాయలను కూడా చూసే ఉంటారు. ఇవి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని కూడా సాధారణ ఉల్లిపాయలాగే ఉపయోగించుకోవచ్చు. ఈ తెల్ల ఉల్లిపాయలో పొటాషియం, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు లభ్యమవుతాయి. ఈ తెల్ల ఉల్లిపాయను తింటే శరీరంలోని దెబ్బతిన్న కణాలను రక్షించడంలో సహాయ పడుతుంది. తెల్ల ఉల్లిపాయలు తింటే ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

షుగర్ లెవల్స్‌ కంట్రోల్ అవుతాయి:

తెల్ల ఉల్లిపాయల్లో క్రోమియం అనేది ఉంటుంది. ఇది రక్తంలో షుగర్ లెవల్స్ పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు ఎలాంటి ఆలోచన లేకుండా తెల్ల ఉల్లిపాయలు తినవచ్చు.

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది:

తెల్ల ఉల్లి పాయల్లో అనేక పోషకాలు ఉంటాయి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా చేయడంలో సహాయ పడతాయి. అలాగే శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతాయి. అలాగే దెబ్బ తిన్న కణాలను రక్షిస్తాయి.

ఇవి కూడా చదవండి

రోగ నిరోధక శక్తిని పెంచుతాయి:

తెల్ల ఉల్లిపాయలు తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించడం వల్ల బాడీలో ఇమ్యూనిటీ లెవల్స్ పెరుగుతాయి. దీంతో అంటు వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది.

గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది:

తెల్ల ఉల్లిపాయలో క్వెర్వెటిన్ అనే ప్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి రక్త పోటును తగ్గించడంలో, చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయ పడతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా పని చేస్తుంది. అదే విధంగా ఎముకలు, దంతాలు కూడా బలంగా ఉంటాయి. చర్మానికి, జుట్టుకు కూడా చాలా మంచిది. పొడి బారకుండా హైడ్రేట్‌గా ఉంటాయి.

జీర్ణ క్రియ మెరుగు పడుతుంది:

వైట్ ఆనియన్‌లో ఫైబర్ కూడా మెండుగా లభిస్తుంది. ఇవి తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్యల తలెత్తదు. అలాగే ఇందులో శ్వాస కోశ సమస్యలను కూడా తగ్గిస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో