AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bathing Tips: ఉదయం లేదా రాత్రి.. స్నానం ఎప్పుడు చేస్తే మంచిదో తెలుసా..? వైద్యులు ఏం చెబుతున్నారంటే…

భోజనం చేసిన తర్వాత కూడా స్నానం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. భోజనం తర్వాత, ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి కడుపుకు ఎక్కువ శక్తి, సరైన మొత్తంలో శరీర ఉష్ణోగ్రత అవసరం. కానీ, భోజనం తరువాత స్నానం చేయటం వల్ల శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. దీనివల్ల ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. అందుకే భోజనం చేసిన గంట లేదా గంటన్నర తర్వాత తలస్నానం చేయడం మంచిదని నిపుణులు అంటున్నారు.

Bathing Tips: ఉదయం లేదా రాత్రి.. స్నానం ఎప్పుడు చేస్తే మంచిదో తెలుసా..? వైద్యులు ఏం చెబుతున్నారంటే...
Bathing
Jyothi Gadda
|

Updated on: May 02, 2025 | 1:23 PM

Share

Bathing Tips: ప్రతిరోజూ స్నానం చేయడం అందరికీ అలవాటు. మంచి ఆరోగ్యానికి రోజూ స్నానం చేయడం చాలా అవసరం. స్నానం శరీరాన్ని శుభ్రపరచడమే కాకుండా, రిఫ్రెష్ చేస్తుంది. అయితే, భారతదేశంలో చాలా మంది ఉదయం స్నానం చేస్తారు. అదే చైనా, జపాన్, కొరియా వంటి దేశాల ప్రజలు రాత్రిపూట స్నానాలు చేస్తారు. అయితే, మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? ఉదయం లేదా సాయంత్రం స్నానం ఎప్పుడు చేస్తే మంచిది..? సైన్స్ నిజంగా ఏం చెబుతుంది. ఆయుర్వేదం ఏం చెబుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

జపాన్‌లో చాలా మంది సాయంత్రం, రాత్రి స్నానం చేస్తుంటారు. ఇక్కడ రాత్రి స్నానం చేసే ఆచారం వారికి పురాతన సంప్రదాయంగా పాటిస్తుంటారు. రాత్రి పూట స్నానం చేయడం వల్ల పగటిపూట శరీరంపై పేరుకుపోయిన విషవ్యర్థాలు, మురికిని తొలగిపోతుందని నమ్ముతారు.. అదేవిధంగా, దక్షిణ కొరియాలో కూడా ఎక్కువ గంటలు పనిచేసిన తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి ప్రజలు రాత్రిపూట స్నానం చేస్తుంటారు. కానీ,  అమెరికా, యూరప్, కెనడా వంటి దేశాలలో మాత్రం ప్రజలు ఎక్కువగా  ఉదయం పూట స్నానం చేస్తారు.

చైనీస్ సంస్కృతిలో కూడా ప్రజలు రాత్రిపూట స్నానం చేస్తుంటారు.  రోజంతా పని చేసి అలిసిపోయిన తరువాత సాయంత్రం స్నానం చేయడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుందని చైనీయులు నమ్ముతారు. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. అయితే, చైనా వాతావరణం తేమగా, ఉష్ణమండలంగా ఉండటం ఒక కారణం. అందుకే అక్కడ జనాలకు బాగా చెమటలు పడతాయి. దీని వల్ల వారికి అనేక రకాల చర్మ వ్యాధులు వస్తాయి. అందుకే, వారు రాత్రిపూట స్నానం చేస్తారు.

ఇవి కూడా చదవండి

కానీ, సైన్స్ ప్రకారం, రాత్రిపూట స్నానం చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.. రోజంతా కష్టపడి పనిచేసిన తర్వాత స్నానం చేయడం వల్ల శరీరం ఉత్తేజంగా ఉంటుంది. రాత్రి స్నానం చేయడం వల్ల పగటిపూట కలిగే అలసట నిమిషాల్లో మాయమవుతుంది. బాగా నిద్రపడుతుంది కూడా. అందుకే చాలా మంది ఉదయం పూటనే కాదు, రాత్రిపూట కూడా స్నానం చేస్తారు. రాత్రి పడుకునే ముందు వేడినీటి స్నానం చేయడం వల్ల బాగా నిద్రపోతుందని పరిశోధనలో తేలింది. అయితే, ఉదయం స్నానం కూడా ముఖ్యం. ముఖ్యంగా రోజంతా చురుకుగా ఉండాలనుకునే వారికి ఉదయాన్నే స్నానం చేయడం తప్పనిసరి.

ఆయుర్వేదంలో, స్నానం అనేది శరీరం, మనస్సు, ఆత్మను తాజాగా, ప్రశాంతంగా ఉంచడానికి పనిచేసే చికిత్సా చర్య. ఆయుర్వేదంలో ఉదయం స్నానం చేయడం ఉత్తమమని నిపుణులు అంటున్నారు. ఉదయం సూర్యోదయానికి ముందు, సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు స్నానం చేయడం ఉత్తమమని ఆయుర్వేదం చెబుతోంది. అలాగే, ఆయుర్వేదం ప్రకారం మధ్యాహ్నం స్నానం చేయడం మంచిది కాదు. మధ్యాహ్నం స్నానం చేయడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి. అలా చేయడం వల్ల కండరాలు కణాలతో కప్పబడి వాపు వస్తుంది. దీనిని మైయోసిటిస్ అంటారు. మధ్యాహ్నం స్నానం చేయడం వల్ల వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పులు, కంటి సమస్యలు వస్తాయి.

భోజనం చేసిన తర్వాత కూడా స్నానం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. భోజనం తర్వాత, ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి కడుపుకు ఎక్కువ శక్తి, సరైన మొత్తంలో శరీర ఉష్ణోగ్రత అవసరం. కానీ, భోజనం తరువాత స్నానం చేయటం వల్ల శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. దీనివల్ల ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. అందుకే భోజనం చేసిన గంట లేదా గంటన్నర తర్వాత తలస్నానం చేయడం మంచిదని నిపుణులు అంటున్నారు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..