Hair Care: వర్షా కాలంలో జుట్టు విపరీతంగా ఊడిపోతుందా.. మునగాకుతో సెట్!

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే చాలా పోషకాలు అవసరం. మీరు తీసుకునే ఆహారంతోనే జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. ప్రస్తుత కాలంలో ఎక్కువగా వినిపించే సమస్యల్లో జుట్టు రాలిపోవడం కూడా ఒకటి. కొందరికి ఒక మాదిరిగా ఊడితే.. మరి కొందరికి మాత్రం జుట్టు విపరీతంగా రాలిపోతుంది. ఎంత కంట్రోల్ చేద్దామన్నా అస్సలు ఆగదు. ఒత్తుగా ఉన్న జుట్టు మొత్తం రాలిపోయి పల్చగా మారుతుంది. దీంతో మహిళలు చాలా బాధ పడుతూ ఉంటారు. జుట్టు రాలిపోవడానికి చాలా కారణాలు..

Hair Care: వర్షా కాలంలో జుట్టు విపరీతంగా ఊడిపోతుందా.. మునగాకుతో సెట్!
మునగాకులను ఆరబెట్టి పొడి చేసి.. దానిని స్క్రబ్బర్ వాడొచ్చు. ఇలా చేయడం వల్ల మీ చర్మం పై ఉన్న బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అన్నీ తొలగిపోయి చర్మం మృదువుగా మారుతుంది. మునగాకు పేస్టుతో ముఖానికి ఫేస్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు. ఇది కూడా మీ చర్మాన్ని అందంగా మార్చడానికి సహాయపడుతుంది.
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Oct 10, 2024 | 9:30 PM

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే చాలా పోషకాలు అవసరం. మీరు తీసుకునే ఆహారంతోనే జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. ప్రస్తుత కాలంలో ఎక్కువగా వినిపించే సమస్యల్లో జుట్టు రాలిపోవడం కూడా ఒకటి. కొందరికి ఒక మాదిరిగా ఊడితే.. మరి కొందరికి మాత్రం జుట్టు విపరీతంగా రాలిపోతుంది. ఎంత కంట్రోల్ చేద్దామన్నా అస్సలు ఆగదు. ఒత్తుగా ఉన్న జుట్టు మొత్తం రాలిపోయి పల్చగా మారుతుంది. దీంతో మహిళలు చాలా బాధ పడుతూ ఉంటారు. జుట్టు రాలిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా వర్షా కాలంలో జుట్టు ఎక్కువగా రాలుతూ ఉంటుంది. జుట్టు రాలకుండా ఆరోగ్యంగా పెరగాలంటే చాలా పోషకాలు కావాలి. ఇలాంటి పోషకాలు అన్నీ మనకు మునగాకులో లభిస్తాయి. నెల రోజుల్లోనే మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది. మరి మునగాకును జుట్టుకు ఎలా ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం.

మునగాకు ఆయిల్:

మునగాకు జుట్టు సంరక్షణకు ఎంతో చక్కగా సహాయ పడుతుంది. ఈ ఆయిల్ హెయిర్ ఫోలికల్స్‌కి పోషణ అందించి.. రక్త ప్రసరణ చక్కగా జరిగేలా చేస్తుంది. జుట్టు మూలాలకు కూడా పోషకాలను అందించి బలంగా, దృఢంగా ఉండేలా చేస్తుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. అంతే కాకుండా దురద, చుండ్రు వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. అంతే కాకుండా జుట్టు సాఫ్ట్‌గా కూడా ఉంటుంది. వారంలో రెండు సార్లు ఈ ఆయిల్ ఆప్లై చేస్తే చాలు.

మునగాకు ఆయిల్ ఉపయోగించే విధానం:

ముందుగా మునగాకు ఆయిల్‌ని తీసుకోవాలి. ఇందులో కొబ్బరి నూనె, జొజొబా ఆయిల్, ఆముదం ఆయిల్.. వీటిల్లో ఏదో ఒకటి మునగాకు ఆయిల్‌లో కలపాలి. దీన్ని జుట్టుకు బాగా పట్టించి.. స్నానం చేస్తే చాలు.

ఇవి కూడా చదవండి

మునగాకు హెయిర్ స్ప్రే:

జుట్టు రాలే సమస్యతో బాధ పడేవారికి మునగాకు హెయిర్ స్ప్రే కూడా ఎంతో చక్కగా పని చేస్తుంది. ముందుగా మునగాకును నీటితో శుభ్రంగా కడిగి.. ఓ పది నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత ఈ నీళ్లు చల్లగా మారాక ఓ బాటిల్‌లో వేసి స్టోర్ చేసుకోవచ్చు. ఈ నీటిని జుట్టు మొత్తం స్ప్రే చేయాలి. కాసేపు మర్దనా చేసుకోవాలి. ఓ అరగంట పాటు ఇలానే ఉంచి సాధారణ నీటితో జుట్టును కడగాలి. అదే విధంగా ప్రతి రోజూ ఓ చిన్న గ్లాస్ మునగాకు జ్యూస్ తాగినా చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్
కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్
చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో..
చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో..
అవుట్ అయ్యినా పరవాలేదు.. ఆ విషయంలో వెనక్కి తగ్గేదేలే..!
అవుట్ అయ్యినా పరవాలేదు.. ఆ విషయంలో వెనక్కి తగ్గేదేలే..!
ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన భారీ కొండచరియలు.. అల్లకల్లోలంగా మారిన..
ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన భారీ కొండచరియలు.. అల్లకల్లోలంగా మారిన..
అన్‌సోల్డ్ ఆడిన మ్యాజిక్: ఐపీఎల్ వేలం మిస్.. షాక్ లో కావ్య పాపా
అన్‌సోల్డ్ ఆడిన మ్యాజిక్: ఐపీఎల్ వేలం మిస్.. షాక్ లో కావ్య పాపా