Beauty Tips: వర్షాకాలంలో అరికాళ్లు, వేళ్లు దురద పెడుతున్నాయా? బకెట్ నీళ్లలో ఇవి కలిపి..
వర్షాకాలంలో పాదాలు ఎక్కువ సేపు నానడం వల్ల అరికాళ్లు, కాళ్ల వేళ్ల దగ్గర దురద రావడం సాధారణం. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి రకరకాల పద్ధతులను అనుసరిస్తుంటారు. నీళ్లలో ఎక్కువ సేపు నానడం వల్ల పాదాలకు ఇన్ఫెక్షన్ల బెడద..

Monsoon foot care tips in telugu: వర్షాకాలంలో పాదాలు ఎక్కువ సేపు నానడం వల్ల అరికాళ్లు, కాళ్ల వేళ్ల దగ్గర దురద రావడం సాధారణం. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి రకరకాల పద్ధతులను అనుసరిస్తుంటారు. నీళ్లలో ఎక్కువ సేపు నానడం వల్ల పాదాలకు ఇన్ఫెక్షన్ల బెడద ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల్లో కూడా ఈ సమస్య అధికంగా తలెత్తుతుంది. ఈ విధమైన చర్మ సమస్యలు తలెత్తినప్పుడు అరికాళ్లలో, పాదాల వేళ్ల దగ్గర దురద పెడుతుంది. సమస్య తీవ్రతరమైతే చర్మం ఎర్రగా కమిలిపోవడం, దద్దుర్లు, వాపు, పొలుసుల మాదిరి చర్మం వూడిపోవడం, రక్తం కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.ఐతే ఇంట్లోనే లభించే పదార్ధాలతో సహజసిద్ధంగా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందచ్చు. అవేంటో తెలుసుకుందా..
ప్రతి రెండు గంటలకోసారి ఉప్పు కలిపిన నీళ్ల బకెట్‌లో కాళ్ల పాదాలు పూర్తిగా మునిగేలా ఉంచాలి. ఇలా చేస్తే దురద తగ్గుముఖం పడుతుంది. పొడిచర్మ సంబంధిత సమస్యలను తగ్గించడంలో పెప్పర్‌మింట్ ఆయిల్ కూడా బాగా పనిచేస్తుంది. సరిపడా నీళ్లు తీసుకొని దానిలో కాస్త పెప్పర్‌మింట్ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు రాస్తే ఫలితం ఉంటుంది. ఇది చర్మాన్ని మృదువుగా మార్చి పొడిచర్మ సమస్యలను దూరం చేస్తుంది. పొడిచర్మం కారణంగా కూడా అరికాళ్లలో దురద తలెత్తుతుంది. పొడిబారిన చర్మాన్ని మృదువుగా మార్చే గుణం పెట్రోలియం జెల్లీకి ఉంటుంది. ఇది తేమ నిలిచి ఉండేలా చేసి, దురద తగ్గుముఖం పట్టేలా చేస్తుంది. బేకింగ్ సోడా, వైట్ వెనిగర్, హైడ్రోజెన్ పెరాక్సైడ్ వంటి పదార్థాల్లో ఏదైనా ఒకదానిని నీళ్లలో కలిపి, ఆ నీళ్లలో పాదాలు మునిగే వరకు ఉంచినా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందచ్చు.




