సైకిల్ కి పంక్చర్ వేసినట్టే..గాయం మాన్పే ‘ గ్లూ ‘

సైకిల్, బైక్ లేదా ఇతర వాహనాల్లోని రబ్బర్ ట్యూబుల్లో రంధ్రం పడి పంక్చర్ అయితే వెంటనే ‘ పంక్చర్ మెకానిక్ ‘ వద్దకు పరుగులు తీస్తాం. మరి శరీరానికి గాయం తగిలి రక్తం కారుతుంటే..ఆ గాయం త్వరగా మానాలంటే డాక్టర్ దగ్గరకు వెళ్లి బ్యాండేజీ వేయించు కోవాల్సిందే….లేదా కట్టు కట్టించుకోవాల్సిందే…అయితే ఇక ఆ అవసరం ఉండదు. చైనా సైంటిస్టులు ఓ మిరాకిల్ ‘ గ్లూ ‘ కనిపెట్టడంతో ఇది సాధ్యమవుతోంది. తీవ్రమైన గాయాలను ఈ గ్లూ క్షణాల్లో […]

సైకిల్ కి పంక్చర్ వేసినట్టే..గాయం మాన్పే ' గ్లూ '
Follow us

|

Updated on: May 15, 2019 | 2:40 PM

సైకిల్, బైక్ లేదా ఇతర వాహనాల్లోని రబ్బర్ ట్యూబుల్లో రంధ్రం పడి పంక్చర్ అయితే వెంటనే ‘ పంక్చర్ మెకానిక్ ‘ వద్దకు పరుగులు తీస్తాం. మరి శరీరానికి గాయం తగిలి రక్తం కారుతుంటే..ఆ గాయం త్వరగా మానాలంటే డాక్టర్ దగ్గరకు వెళ్లి బ్యాండేజీ వేయించు కోవాల్సిందే….లేదా కట్టు కట్టించుకోవాల్సిందే…అయితే ఇక ఆ అవసరం ఉండదు. చైనా సైంటిస్టులు ఓ మిరాకిల్ ‘ గ్లూ ‘ కనిపెట్టడంతో ఇది సాధ్యమవుతోంది. తీవ్రమైన గాయాలను ఈ గ్లూ క్షణాల్లో మాన్పగలదట.. మెడికల్ హెల్ప్ వెంటనే అందని సందర్భాల్లో ఈ గ్లూ సంజీవనిలా పని చేస్తుందట. జెల్ వంటి ఈ పదార్థాన్ని అల్ట్రా వయొలెట్ కిరణాలతో యాక్టివేట్ చేసినప్పుడు వెంటనే ఇది వాటర్ ప్రూఫ్ సీల్ గా ఏర్పడుతుందని, శరీర కణజాలం లోకి ప్రవేశించి సెకండ్లలో మెడిసిన్ రక్తం కారడాన్ని ఆపుతుందని రీసెర్చర్లు అంటున్నారు. హార్ట్ సర్జరీ సందర్భాల్లో రోగులు బ్లీడింగ్ తో మృతి చెందకుండా చూసేందుకు ఈ గ్లూ ఎంతో సహాయపడుతుందని వాళ్ళు చెబుతున్నారు. అంతేకాదు..వైద్య సహాయం అందని చోట్ల, వార్ జోన్ల లోను, టెర్రరిస్టు దాడుల్లో గాయపడిన వారికి ఈ జెల్ ఉపయోగపడుతుందని చైనా లోని జిజాంగ్ యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్ అంటోంది.. ఈ కేంద్రం వారు మొదట ఈ జెల్ ని పంది కాలేయంపై పరీక్షించి చూశారు. మంచి ఫలితం కనిపించింది. నీరు, జిలెటిన్, కొన్ని కెమికల్స్ తో కూడిన ఈ జెల్ ని . గాయం ఉన్న చోట చిన్న ఇంజెక్షన్ లా ఇస్తే సరిపోతుందట. గాయాలకు కుట్లు వేయాల్సిన అవసరం అసలే ఉండదంటున్నారు. మొత్తానికి ఈ జెల్ ‘ సంజీవని ‘ ని కనిపెట్టి చైనా వారు మంచి పనే చేశారు. సమీప భవిష్యత్తులో ఇది మార్కెట్లోకి వస్తుందని అంటున్నారు.