AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: మగవాళ్లు ఈ 4 ఫుడ్స్ అస్సలు తినొద్దు.. పట్టించుకోకపోతే ఆ సమస్యలు పక్కా..

కెరీర్ ఫోకస్‌తో ఆలస్యంగా పిల్లల కోసం ప్రయత్నిస్తున్న యువ జంటల్లో సంతానోత్పత్తి సమస్యలు పెరుగుతున్నాయి. దీనికి కారణం ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లేనని నిపుణులు అంటున్నారు. మీ రోజువారీ ఆహారంలో మీరు ఇష్టంగా తినే ఆ 4 ప్రమాదకరమైన పదార్థాలే మగవారిలో సంతానోత్పత్తిని దెబ్బతీస్తన్నాయట.. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Health Tips: మగవాళ్లు ఈ 4 ఫుడ్స్ అస్సలు తినొద్దు.. పట్టించుకోకపోతే ఆ సమస్యలు పక్కా..
Mens Stop Eating These 4 Foods
Krishna S
|

Updated on: Oct 11, 2025 | 1:31 PM

Share

ఈ రోజుల్లో యువత కెరీర్, సెటిల్ అవ్వడంపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అందుకే పెళ్లయిన వెంటనే పిల్లలు వద్దని మూడు, నాలుగేళ్లు వెయిట్ చేస్తున్నారు. కానీ తర్వాత పిల్లల కోసం ట్రై చేస్తే.. సమస్యలు స్టార్ట్ అవుతున్నాయి.. ముఖ్యంగా నేటి లైఫ్‌స్టైల్ వల్ల మగవారిలోనూ ఇన్‌ఫెర్టిలిటీ పెరిగిపోతోందట. దీనికి నేటి ఆధునిక జీవనశైలి ప్రధాన కారణంగా నిలుస్తోంది. ఆశ్చర్యకరంగా ఈ సమస్యలు కేవలం మహిళల్లోనే కాకుండా పురుషులలో కూడా సంతానోత్పత్తి సమస్యలకు దారితీస్తున్నాయి.

ఆహారపు అలవాట్లే అసలు సమస్య!

వివాహం తర్వాత పురుషులలో సంతానోత్పత్తికి సంబంధించిన అనేక సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణం వారి ఆహారపు అలవాట్లేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యల నుండి బయటపడటానికి పురుషులు వెంటనే కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

పురుషులు తప్పనిసరిగా నివారించాల్సిన 4 ఆహారాలు ఇవే..

ట్రాన్స్ ఫ్యాట్స్

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న ఆహారాలు అత్యంత అనారోగ్యకరమైనవి. పురుషులు వీటికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ పురుషులలో స్పెర్మ్ నాణ్యతను తీవ్రంగా తగ్గిస్తాయి. స్పెయిన్‌లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం.. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. కుకీలు, కేకులు, డొనట్స్, పేస్ట్రీలు ప్యాక్ చేసిన చిప్స్ సహా కొన్నింటిలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటుంది.

ప్రాసెస్ చేసిన మాంసం

ఏ రకమైన ప్రాసెస్ చేసిన మాంసాన్ని అధికంగా తీసుకున్నా పురుషులలో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఈ రకం మాంసంతో తయారు చేసిన ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. కాగా మాంసాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి లేదా రుచిని పెంచడానికి కొన్ని పద్ధతుల ద్వారా తయారు చేసిన మాంసం ఉత్పత్తులను ప్రాసెస్ మీట్ అంటారు.

సోయా ఆహారాలు

సోయా ఆధారిత ఆహారాలలో ఫైటోఈస్ట్రోజెన్లు అధికంగా ఉంటాయి. వీటిని అధికంగా తీసుకోవడం వలన శరీరంలోని హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఇటీవలి అధ్యయనాల ప్రకారం.. ఈ హార్మోన్ల మార్పులు పురుషులలో స్పెర్మ్ కౌంట్‌ను తగ్గించడానికి దారితీస్తాయి.

అధిక కొవ్వు పాల ఉత్పత్తులు

అధిక కొవ్వు కలిగిన పాల ఉత్పత్తులు కూడా పురుషులలో సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతాయని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ఒక అధ్యయనంలో ఈ ఉత్పత్తులను ఎక్కువగా వినియోగించడం స్పెర్మ్ నాణ్యత తగ్గడానికి కారణమైందని తేలింది.

అమృతం కూడా విషమే

మనకు తెలిసిందే కదా.. అమృతం కూడా విషమే అన్నట్లు ఏ హెల్తీ ఫుడ్ అయినా లిమిట్‌గా తినాలి. హ్యాపీగా, హెల్తీగా ఉండాలంటే సరైన ఫుడ్ ఎంచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ ఫుడ్స్‌ను అవాయిడ్ చేస్తే మీ ఫ్యామిలీ ప్లానింగ్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగిపోతుందని నిపుణులు అంటున్నారు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..