Mediterranean Diet: ఈ ఏటిమేటి డైట్ మెడిటేరియన్‌ డైట్‌.. మహిళలకు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది..

ఈ డైట్ ను అనుసరించే వారు జంతు ప్రోటీన్ లేదా జంతు ఆహారాల నుంచి దూరంగా ఉండాలి. ఒక విధంగా ఇది శాకాహార ఆహారాన్ని అనుసరించమని సలహా ఇస్తుంది. మధ్యధరా ఆహారం మహిళల్లో గుండె ఆగిపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఒక కొత్త అధ్యయనం ద్వారా తెలిసింది. ఈ పరిశోధన ఎక్కడ జరిగింది. ఈ డైటింగ్ పద్ధతిని దినచర్యలో ఎలా భాగం చేసుకోవచ్చో ఈ రోజు తెలుసుకుందాం..

Mediterranean Diet: ఈ ఏటిమేటి డైట్ మెడిటేరియన్‌ డైట్‌.. మహిళలకు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది..
Mediterranean Diet
Follow us
Surya Kala

|

Updated on: Oct 04, 2024 | 8:46 PM

బరువు తగ్గడానికి, అనేక ఇతర ప్రయోజనాల కోసం అనేక రకాల డైట్ ని, ఉపవాసాలను అనుసరిస్తారు. కీటో డైట్, ఇంర్మింటెంట్‌ ఫాస్టింగ్‌, ప్యాడ్‌ డైట్‌లు వంటి వాటిని అనుసరిస్తున్నారు. అయితే, హెల్తీ, టేస్టీ, ట్రెండీ డైట్‌లలో ఒకటి మెడిటరేనియన్ డైట్. ఇది పూర్తిగా మొక్కల ఆధారిత ఆహారం. ఈ డైట్ లో చెట్లు, మొక్కల నుంచి లభించే వస్తువులను మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. ఈ డైట్ ను అనుసరించే వారు జంతు ప్రోటీన్ లేదా జంతు ఆహారాల నుంచి దూరంగా ఉండాలి. ఒక విధంగా ఇది శాకాహార ఆహారాన్ని అనుసరించమని సలహా ఇస్తుంది. మధ్యధరా ఆహారం మహిళల్లో గుండె ఆగిపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఒక కొత్త అధ్యయనం ద్వారా తెలిసింది. ఈ పరిశోధన ఎక్కడ జరిగింది. ఈ డైటింగ్ పద్ధతిని దినచర్యలో ఎలా భాగం చేసుకోవచ్చో ఈ రోజు తెలుసుకుందాం..

మధ్యధరా ఆహారం అంటే ఏమిటి?

ఇది ఎక్కువ మొక్కల ఆధారిత ఆహారాన్ని తినడానికి ప్రాధాన్యతనిచ్చే ఆహారం. ఈ ఆహారాన్ని ఎక్కువ కాలం పాటిస్తే గుండె జబ్బులు తగ్గుతాయి. ఈ ఆహారంలో పండ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, బీన్స్ , మూలికలను తినమని సలహా ఇస్తోంది. దీని వల్ల గుండె జబ్బులు తగ్గడమే కాకుండా డిప్రెషన్‌కు దూరంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ డైట్ ని అనుసరించడం వల్ల మెదడు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇది అనేక నరాల ప్రయోజనాలను ఇస్తుంది. ఈ డైట్ ని అనుసరించే వారు తినే ఆహారంలో చక్కెర, ఉప్పును చాలా తక్కువగా తినమని లేదా త్రాగమని సలహా ఇస్తారు.

పరిశోధన ఏం చెబుతోందంటే?

మధ్యధరా ఆహారం మహిళల్లో గుండె ఆగిపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ డైట్ లో తీసుకునే ఆహరం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం వెల్లడించింది. ఈ డైట్ లో తినే ఆహారంలో ఆక్సీకరణ ఒత్తిడి , వాపును తగ్గించే శోథ నిరోధక లక్షణాలు ఉన్నాయి. పరిశోధన ప్రకారం గుండె వైఫల్యం వెనుక ఉన్న కారణాలలో ఒకటి NT-proBNP.. అయితే ఈ డైట్ లో తినే ఆహారం ఈ బయోమార్కర్ స్థాయిని తగ్గిస్తుంది. మహిళల్లో వచ్చే హార్ట్ స్ట్రోక్స్ వచ్చే ముప్పును తగ్గిస్తుంది తినే ఆహారంలో సంతృప్త, ట్రాన్స్-ఫ్యాట్ వినియోగాన్ని పరిమితం చేయడానికి సహాయపడుతుందని.. తద్వారా రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గుతాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఈ పరిశోధన యూరప్‌లో జరిగింది. ఇక్కడ ఈ డైట్ వలన సానుకూల ప్రభావం మహిళల్లో కనిపించింది.

ఇవి కూడా చదవండి

ఈ డైట్ తో ఇతర ప్రయోజనాలు

ఈ డైట్ ని సరిగ్గా అనుసరిస్తే.. ప్రయోజనాలు జీవక్రియలో కూడా కనిపిస్తాయి. అంతేకాదు ఇన్సులిన్ సెన్సిటివిటీ తో పాటు లిపిడ్ ప్రొఫైల్ కూడా మెరుగవుతుంది. సరళంగా చెప్పాలంటే, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ఈ డైట్ మంచి సహాయకరంగా ఉంటుంది. ఈ డైట్ ని అనుసరించడం ద్వారా వాపును తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. ఇది ఆక్సీకరణ ఒత్తిడి నుండి కూడా రక్షిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ డైట్‌లో వేటిని ఆహారంగా తీసుకోవాలంటే

ఈ డైట్ లో తీసుకునే ఆహారంలో క్యాలీఫ్లవర్, క్యారెట్, ఉల్లిపాయలు, టొమాటో, బ్రకోలీ, దోసకాయ, పుట్టగొడుగులు వంటి కూరగాయలను తీసుకోవచ్చు. పండ్లలో దానిమ్మ, అరటి, నారింజ, పియర్, స్ట్రాబెర్రీలను తినవచ్చు. అంతేకాదు తృణధాన్యాలు తినడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది, ఇందులో మొక్కజొన్న, బ్రౌన్ రైస్, చిక్కుళ్ళు, గింజలు, నట్స్‌ వంటి వాటిని కూడా ఆహారంగా తీసుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పుష్పాగాడి రూల్.. 2000 కోట్ల క్లబ్ లో పుష్ప 2.! బన్నీ మార్క్ సెట్
పుష్పాగాడి రూల్.. 2000 కోట్ల క్లబ్ లో పుష్ప 2.! బన్నీ మార్క్ సెట్
ఇకపై గంటలో తిరుమల వెంకన్న దర్శనం.. ఎలాగంటే?
ఇకపై గంటలో తిరుమల వెంకన్న దర్శనం.. ఎలాగంటే?
మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..
మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్