Tirumala: శ్రీవారి ఆలయంలో తప్పిన అపశృతి.. విరిగిన ఇనుప కొక్కెం రిపేర్ చేసి ధ్వజారోహణ చేసిన పురోహితులు
శ్రీవారి ఆలయంలోని ధ్వజస్తంభం కొక్కెం ద్వారానే గరుడ పఠాన్ని ఎగురవేసి సకల దేవతలకు ఆహ్వానం పలకనున్న నేపధ్యంలో వెంటనే టీటీడీ అధికారులు అలర్ట్ అయ్యారు. అర్చకుల సహాయంతో టీటీడీ అధికారులు మరమ్మతులు చేశారు. సాయంత్రం మీన లగ్నంలో శ్రీవారి ధ్వజారోహణ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించిన అర్చకులు బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు.
తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల వేడుకలో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమానికి ముందు అపశృతి చోటు చేసుకుంది. శ్రీవారి ఆలయంలోని గరుడ ధ్వజస్తంభం ఇనుప కొక్కెం ఇరిగిపోయింది. ఈ విషయాన్నీ ముందుగానే ఆలయ అర్చకులు గుర్తించారు. ఈ ధ్వజస్తంభం కొక్కెం ద్వారానే గరుడ పఠాన్ని ఎగురవేసి సకల దేవతలకు ఆహ్వానం పలకనున్న నేపధ్యంలో వెంటనే టీటీడీ అధికారులు అలర్ట్ అయ్యారు. అర్చకుల సహాయంతో టీటీడీ అధికారులు మరమ్మతులు చేశారు. సాయంత్రం మీన లగ్నంలో శ్రీవారి ధ్వజారోహణ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించిన అర్చకులు బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..