- Telugu News Photo Gallery Spiritual photos Navaratri 2024: delhi chittaranjan park kali mandir durga puja know the amazing facts
Navaratri 2024: కోల్‌కతాలో కాదు ఇక్కడ కూడా దుర్గా పూజ వెరీ వెరీ స్పెషల్.. నవరాత్రులలో లక్షలాది భక్తులు హాజరయ్యే ఆలయం..
నవరాత్రులలో 9 రోజులలో అమ్మవారిని పూజిస్తారు. ఈ సమయంలో దుర్గాపూజ కూడా నిర్వహిస్తారు. అయితే దుర్గాపూజ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు కోల్‌కతా. ఇక్కడ ప్రతి మూలలో మండపాలను ఏర్పాటు చేస్తారు. అందంగా అలంకరిస్తారు. అమ్మవారిని ప్రతిష్టించి పూజిస్తారు. అయితే దేశ రాజధాని ఢిల్లీ కూడా కోల్‌కతా కంటే తక్కువేమీ కాదు. దుర్గాపూజ కోసం అనేక చోట్ల పెద్ద భారీ మండపాలను ఏర్పాటు చేశారు. అందంగా అలంకరించి అమ్మవారిని పూజిస్తున్నారు.
Updated on: Oct 04, 2024 | 5:26 PM

దుర్గా పూజ కోసం ఢిల్లీలో చాలా ప్రసిద్ధి చెందిన ప్రాంతం చిత్తరంజన్ పార్క్. కోల్‌కతాలోని కాళీఘాట్ దేవాలయం వలె ఇక్కడ కాళీమాత ఆలయం కూడా ఉంది. దుర్గాపూజ సమయంలో ఈ పండల్ చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. గుడికి వెళ్లాలంటే దాదాపు రెండు కిలోమీటర్ల మేర క్యూలో ఎదురు చూడాల్సిందే.

చిత్తరంజన్ పార్క్‌ని ఢిల్లీలోని మినీ కోల్‌కతా అని కూడా పిలుస్తారు. ఇక్కడ బెంగాలీ కల్చరల్ సెంటర్ కూడా ఉంది. ఈ ఆలయం గురించి చెప్పాలంటే.. మొదటగా ఇక్కడ శివుని ఆలయాన్ని 1973లో నిర్మించారు. దీని తరువాత మహాకాళి దేవి, శ్రీ కృష్ణుడు విగ్రహాన్ని ప్రతిష్టించారు.

ప్రతి సంవత్సరం ఇక్కడ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గాపూజ కోసం పండల్ అలంకరిస్తారు. ఇక్కడ దుర్గాపూజ చాలా భిన్నంగా ఉంటుంది. ఇక్కడికి వెళ్ళిన వారు బెంగాల్‌లో నవరాత్రి ఉత్సవాలను చూసినట్లు ఫీల్ అవుతారు.

1977లో మొదటిసారిగా ఇక్కడ దుర్గాపూజ నిర్వహించారు. అప్పటి నుంచి నేటి వరకు ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. దుర్గాపూజ రోజున లక్షలాది మంది ఆలయాన్ని దర్శించుకుంటారు. ఇక్కడ శివరాత్రి, దుర్గాపూజను చాలా వైభవంగా జరుపుకుంటారు. అంతే కాకుండా నవరాత్రి సమయంలో అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతాయి.

CR పార్క్‌లో బెంగాలీ ఆహారాన్ని రుచి చూడవచ్చు. ఇక్కడ ప్రత్యేకమైన బెంగాలీ మార్కెట్ ఉంది. ఇక్కడ మీరు ప్రతిదీ పొందుతారు. ఇక్కడ దుర్గా పూజ కోసం కుటుంబం, స్నేహితులతో వెళ్తారు.

ఇక్కడికి వెళ్లాలంటే మీరు నెహ్రూ ఎన్‌క్లేవ్ మెట్రో స్టేషన్‌కి వెళ్ళాల్సి ఉంది. అక్కడికి కొద్ది దూరంలో ఒక దేవాలయం ఉంది. కావాలంటే ఇ-రిక్షా సహాయంతో కూడా ఇక్కడకు చేరుకోవచ్చు.




