Pregnancy Care: గర్భిణీల్లో లోబీపీ సమస్య.. నేచురల్ టిప్స్‌తో ఇలా చెక్ పెట్టొచ్చు
కొన్ని సందర్భాల్లో లోబీపీ మహిళల్లో ప్రాణాంతక సమస్యకు సైతం దారి తీసే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. కడుపులో బిడ్డపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని అంటున్నారు. అందుకే గర్బధారణ సమయంలో బీపీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు బీపీని మానిటర్ చేస్తుండాలి. ఒకవేళ బీపీ తక్కువగా ఉంటే వెంటనే వైద్యుల సూచనలు.....
మహిళల గర్భం దాల్చిన సమయంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శరీరంలో హార్మోన్ల ప్రభావం, తీసుకునే ఆహారంలో మార్పుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇలాంటి సమస్యలో రక్తపోటు ఒకటి. గర్భదారణ సమయంలో మహిళల్లో బీపీలో హెచ్చుతగ్గులు కనిపించడం సర్వసాధారణం. ముఖ్యంగా లోబీపీ సమస్య ఎక్కువగా ఎదుర్కొంటారు. అయితే ఈ పరిస్థితిని ఎట్టి పరిస్థితుల్లో లైట్ తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
కొన్ని సందర్భాల్లో లోబీపీ మహిళల్లో ప్రాణాంతక సమస్యకు సైతం దారి తీసే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. కడుపులో బిడ్డపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని అంటున్నారు. అందుకే గర్బధారణ సమయంలో బీపీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు బీపీని మానిటర్ చేస్తుండాలి. ఒకవేళ బీపీ తక్కువగా ఉంటే వెంటనే వైద్యుల సూచనలు పాటించాలని చెబుతున్నారు. ముఖ్యంగా లో బీపీ కారణంగా.. మత్తుగా ఉండటం, తల భారంగా ఉండటం, వాంతులు, అలసట, తరచుగా దాహం, శ్వాస సంబంధిత సమస్యలు కనిపిస్తాయి.
అయితే లోబీపీని కొన్ని సహజ పద్ధతుల ద్వారా ఎదుర్కోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో లభించే కొన్ని వస్తువుల ద్వారా లోబీపీని అప్పటికప్పుడు కంట్రోల్‌లోకి తెచ్చుకోవచ్చు. వీటిలో ప్రధానమైంది ఉప్పు, నిమ్మకాయ నీరు. ఇది అప్పటికప్పుడు బీపీని పెంచడానికి ఉపయోగపడుతుంది. బీపీ తక్కువగా ఉన్నప్పుడు, స్త్రీకి నిమ్మకాయ రసం, ఉప్పు వేసి సగం గ్లాసు నీరు తాగించాలి. తద్వారా చాలా త్వరగా ఉపశమనం లభిస్తుంది.
ఇక లోబీపీతో బాధపడేవారు నానబెట్టిన ఎండుద్రాక్షను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రంతా నానబెట్టి ఉదయం సమయంలో తినాలి. ఆ తరువాత అవి నానబెట్టిన నీటిని తాగాలి. ప్రతి రోజూ ఇలా చేయడం ద్వారా బీపీ సాధారణ స్థితిలోకి వస్తుంది. అలాగే హిమోగ్లోబిన్ స్థాయి కూడా మెరుగవుతుంది. లోబీపీ ఉన్న వారు కాఫీ తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాగే.. అల్లం రసం.. అల్లం.. వంటివి కూడా లోబీపీని జయించడంలో ఉపయోగపడతాయి.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యం విషయంలో, మరీ ముఖ్యంగా గర్భిణీల విషయంలో సొంత వైద్యం కంటే వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమమని చెబుతున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..