Lifestyle: పురుషుల కంటే స్త్రీలు ఎందుకు ఎక్కువ కాలం జీవిస్తారు? పరిశోధనలో షాకింగ్ నిజాలు!
Lifestyle: మహిళల శరీరంలోని లైంగిక హార్మోన్ అయిన ఈస్ట్రోజెన్ గురించి ఆమె వివరిస్తూ, "ఈస్ట్రోజెన్ మహిళలను రక్షించడానికి అనేక పనులు చేస్తుంది" అని అన్నారు. ఇది మహిళల కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో, రోగనిరోధక వ్యవస్థను సమతుల్యం చేయడంలో, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లను నివారించడంలో..

Lifestyle: మహిళలు ఎక్కువ కాలం జీవించడానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా పూర్తిగా లేకపోయినా ఆ కారణాలను వివరించడంలో సహాయపడే కొన్ని సిద్ధాంతాలు శాస్త్రవేత్తల వద్ద ఉన్నాయి. స్త్రీపురుషుల జీవసంబంధమైన నిర్మాణాలు భిన్నంగా ఉంటాయన్నది ప్రధాన వాదన. అయినప్పటికీ, వారి జీవనశైలి, ఆహారం మొదలుకొని భాగస్వామి ఎంపిక వరకు అనేక అంశాలు కూడా వారి ఆయుర్దాయంలో పాత్ర పోషిస్తాయి. పక్షుల వంటి కొన్ని జాతులలో ఆడవాటి కంటే మగవాటి జీవితకాలం ఎందుకు ఎక్కువగా ఉంటుందో కనుక్కోవడానికి శాస్త్రవేత్తల ఈ వాదనలు కూడా సహాయపడతాయి.
పురుషుల అకాల మరణంలో ఆహార కారకాలు పాత్ర:
దాదాపు ప్రతి దేశంలోనూ పురుషుల కంటే మహిళలే ఎక్కువ కాలం జీవిస్తారు,” అని యూకేలోని ఆక్స్‌ఫర్డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ ఏజింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ సారా హార్పర్ అంటున్నారు. అయితే ఈ పరిస్థితి దేశాన్ని బట్టి మారుతుందని, రష్యా, ఉక్రెయిన్, వియత్నాం వంటి దేశాలను ఉదాహరణలుగా చూపుతూ ఆమె పేర్కొన్నారు. ఇక్కడ మహిళలు పురుషుల కంటే సుమారు 10 సంవత్సరాలు ఎక్కువ కాలం జీవిస్తారని, అయితే నైజీరియా వంటి ప్రదేశాలలో ఆయుర్దాయంలో ఈ వ్యత్యాసం చాలా తక్కువగా ఉంటుందని అంటారు. ఈ పరిశోధన ఫలితాలు ‘అవర్ వరల్డ్ ఇన్ డేటా’ వెబ్‌సైట్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం నుండి తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: WhatsApp: ఇక వాట్సాప్‌లో అసలైన ఫీచర్ వచ్చేస్తోంది..? ఇక నో టెన్షన్..!
శాస్త్రవేత్తలు ఈ వ్యత్యాసానికి సామాజిక, ప్రవర్తనా కారకాలను కారణంగా చూపుతున్నారు. రష్యాలో పురుషుల ధూమపానం, మద్యపానం దీనికి ప్రధాన కారణమని ప్రొఫెసర్ హార్పర్ అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా పురుషులు ఆయుష్షును తగ్గించే అలవాట్లలో ఎక్కువగా పాల్గొంటారని ఆమె అంటారు. వారు సాధారణంగా అంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోరు. అంతేకాకుండా, అనారోగ్యంగా ఉన్నప్పుడు వారు వైద్యుల వద్దకు వెళ్ల కూడా తక్కువేనంటున్నారు.
ప్రొఫెసర్ హార్పర్ ప్రకారం.. వివాహితులైన పురుషులకు ఒక ప్రయోజనం ఉంది. ఎందుకంటే వారి భార్యలు ఈ విషయంలో మరింత శ్రద్ధ వహిస్తారు. అలాగే తరచుగా వారిని వైద్యుడి వద్దకు తీసుకువెళతారు. అనేక సమాజాలలో పురుషులు ఎక్కువ ప్రమాదకరమైన పనులు చేస్తారని, సామాజికంగా పౌరుషం అనేది తరచుగా రిస్క్ తీసుకోవడంతో ముడిపడి ఉంటుందని కూడా ఆమె అంటారు. రోడ్డు ప్రమాదాలు, హింస, హత్యలు, ఆత్మహత్యల వల్ల పురుషులలో మరణాల రేటు ఎక్కువగా ఉందంటున్నారు.
అయితే, ఈ పరిస్థితి మారుతున్నట్లు కనిపిస్తోంది. 1960, 70వ దశకాలలో యూకేలో జరిగిన ధూమపాన వ్యతిరేక ప్రచారాల ఫలితంగా పురుషులలో అకాల మరణాలు తగ్గాయని ప్రొఫెసర్ హార్పర్ పేర్కొన్నారు.
ఈస్ట్రోజెన్ హార్మోన్ – మహిళల రక్షణ కవచం
పెరిగిన అవగాహన ఆయుర్దాయం పెరగడానికి దారితీసినప్పటికీ, “జీవనశైలిలో మార్పులు కూడా ఈ అంతరాన్ని పూర్తిగా తొలగించలేవు. ఎందుకంటే స్త్రీపురుషుల మధ్య జీవసంబంధమైన తేడాలు ఎల్లప్పుడూ ఉంటాయి” అని ప్రొఫెసర్ హార్పర్ అంటున్నారు. ఈ వ్యత్యాసాలలో ఒకటి హార్మోన్లు అని స్పెయిన్‌లోని వాలెన్సియా విశ్వవిద్యాలయంలో వృద్ధాప్యంపై పరిశోధన చేసే శరీరధర్మ శాస్త్రవేత్త ప్రొఫెసర్ కాన్సులో బోరాస్ వివరించారు.
ఇది కూడా చదవండి: Air Conditioners: భారీ డిస్కౌంట్.. రూ.48 వేల ఏసీ.. కేవలం రూ.25 వేలలోపే..!
మహిళల శరీరంలోని లైంగిక హార్మోన్ అయిన ఈస్ట్రోజెన్ గురించి ఆమె వివరిస్తూ, “ఈస్ట్రోజెన్ మహిళలను రక్షించడానికి అనేక పనులు చేస్తుంది” అని అన్నారు. ఇది మహిళల కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో, రోగనిరోధక వ్యవస్థను సమతుల్యం చేయడంలో, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లను నివారించడంలో, ఇంకా మెదడు, ఎముకలను రక్షించడంలో సహాయపడుతుందని చెబుతారు. దీనికి గల ప్రధాన కారణాలలో ఒకటి ఏమిటంటే ఈస్ట్రోజెన్ ఒక యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ, శరీరంలో హానికరమైన కణాలు (ఫ్రీ రాడికల్స్) ఏర్పడకుండా నిరోధిస్తుందట.
ఇక 2012లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. నపుంసకులు టెస్టోస్టెరాన్ అనే లైంగిక హార్మోన్‌ను ఉత్పత్తి చేయరని, వారు తమ పురుష సహచరుల కంటే 14 నుండి 19 సంవత్సరాలు ఎక్కువ కాలం జీవిస్తారని తేలింది. కొన్ని జంతువులలో మగ జీవులు తమ పునరుత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోయిన తర్వాత కూడా ఎక్కువ కాలం జీవిస్తాయని తేలింది. పురుషుల కంటే మహిళలు ఎక్కువ కాలం ఎందుకు జీవిస్తారో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఇతర జీవులపై కూడా అధ్యయనాలు నిర్వహిస్తున్నారు.
ఆడ జీవులు ఎక్కువ కాలం జీవించే ఏకైక జాతి మనం కాదు. ఇది సింహాలు, గొర్రెలు, తిమింగలాలు, ఎలుకల ఉన్నాయని జర్మన్ పరిశోధకురాలు జోహన్నా స్టార్క్ చెబుతున్నారు. కానీ పక్షులలో దీనికి విరుద్ధంగా ఉంటుంది. మగ జీవులు ఎక్కువ కాలం జీవిస్తాయి. దీనికి క్రోమోజోములు ఒక కారణం కావచ్చని చెబుతున్నారు.
