AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ash Gourd: దిష్టికే అంటూ బూడిద గుమ్మడిని పక్కకు పెట్టేస్తున్నారా.. సర్వరోగ నివారిణి అని తెలుసా..

బూడిద గుమ్మడికాయలో విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, ఇనుము, పొటాషియం, జింక్ మొదలుకొని అనేక ప్రయోజనకరమైన విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అనేక వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడే విధంగా శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఇందులో ఉండే బయో యాక్టీవ్ న్యూట్రియంట్స్ దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా ఉపశమనం ఇస్తాయి. బూడిద గుమ్మడికాయను శతాబ్దాలుగా ఆయుర్వేదంలో ఔషధంగా వాడుతున్నారు.

Ash Gourd: దిష్టికే అంటూ బూడిద గుమ్మడిని పక్కకు పెట్టేస్తున్నారా.. సర్వరోగ నివారిణి అని తెలుసా..
Ash Gourd Benefits
Surya Kala
|

Updated on: Aug 10, 2024 | 11:48 AM

Share

బూడిద గుమ్మడికాయ అంటే చాలు అందరికి ముందుగా గుమ్మానికి దిష్టి తగలకుండా కట్టడం గుర్తుకొస్తుంది. అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో గుమ్మడి కాయతో వడియాలు పెట్టుకుంటారు. మరికొన్ని ప్రాంతాల్లో స్వీట్ తయారు చేస్తారు. అతి తక్కువ మంది తినే ఈ గుమ్మడి కాయను తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గుమ్మడి పాదు ఎండిన తర్వాత కోసిన కాయ ఏడాది పాటు నిల్వ ఉంటుంది. ఈ బూడిద గుమ్మడికాయలో విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, ఇనుము, పొటాషియం, జింక్ మొదలుకొని అనేక ప్రయోజనకరమైన విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అనేక వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడే విధంగా శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఇందులో ఉండే బయో యాక్టీవ్ న్యూట్రియంట్స్ దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా ఉపశమనం ఇస్తాయి. బూడిద గుమ్మడికాయను శతాబ్దాలుగా ఆయుర్వేదంలో ఔషధంగా వాడుతున్నారు. కనుక ఈ బూడిద గుమ్మడికాయను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోమని నిపుణులు సూచిస్తున్నారు.

బూడిద గుమ్మడి కాయలో తగినంత ఫైబర్, నీరు ఉంటాయి. ఇవి పేగు ఆరోగ్యాన్ని కాపాడడానికి మంచి సహాయకారి. గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలతో నిత్యం బాధపడేవారు.. బూడిద గుమ్మడి కాయను ఏ రూపంలో తీసుకున్నా తగిన ఫలితం ఉంటుంది.

బూడిద గుమ్మడికాయ నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ప్రతి చిన్న విషయానికీ ఆందోళన చెందేవారు తరచుగా గుమ్మడి జూస్ తాగడం వలన మంచి ఫలితం ఉంటుంది. డిప్రెషన్‌ నుంచి ఉపశమనం ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

కష్టపడి పని చేసి ఇంటికి వచ్చిన తర్వాత అలసిపోయినట్లు అనిపించి పని చేయడానికి శక్తి లేదు అనుకుంటే బూడిద గుమ్మడికాయ మంచి ఎనర్జీని ఇస్తుంది. దీనిలోని విటమిన్ బి3 పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ తక్షణ శక్తి ఇస్తుంది.

కడుపులో ఏర్పడే పుండ్లు,అల్సర్ నుంచి ఉపశమనం కోసం బూడిద గుమ్మడికాయను రెగ్యులర్ గా తినడం వల్ల అల్సర్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. కనుక అల్సర్ బాధితులు తప్పనిసరిగా బూడిద గుమ్మడికాయను ఆహారంలో చేర్చుకోవాలి.

బూడిద గుమ్మడికాయ శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇందులో శరీరాన్ని ప్రశాంతంగా ఉంచే ఉపశమన గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఫలితంగా రాత్రి సమయంలో నిద్ర బాగా పడుతుంది.

బూడిద గుమ్మడికాయ శరీరంలో పేరుకున్న విష వ్యర్ధాలను తొలగిస్తుంది. అంతేకాదు కాలేయం పని తీరుని మెరుగుపరుస్తుంది.కడుపులో మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

Follow Us
వాకింగ్ లేదా రన్నింగ్.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
వాకింగ్ లేదా రన్నింగ్.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
మరికొన్ని గంటల్లో ముగుస్తు Polycet 2026 దరఖాస్తు గడువు.. లింక్
మరికొన్ని గంటల్లో ముగుస్తు Polycet 2026 దరఖాస్తు గడువు.. లింక్
మ్యూజిక్ లవర్స్‌కి జాతీయ గీతం లాంటి పాట ఇది...
మ్యూజిక్ లవర్స్‌కి జాతీయ గీతం లాంటి పాట ఇది...
రూ.5 లక్షల్లో సూపర్‌ బిజినెస్‌.. తలరాత మారిపోవాల్సిందే!
రూ.5 లక్షల్లో సూపర్‌ బిజినెస్‌.. తలరాత మారిపోవాల్సిందే!
రైతన్నలకు సూపర్ గుడ్‌న్యూస్..మరికొన్ని గంటల్లో అకౌంట్లోకి డబ్బులు
రైతన్నలకు సూపర్ గుడ్‌న్యూస్..మరికొన్ని గంటల్లో అకౌంట్లోకి డబ్బులు
అదృష్టం అంటే వీళ్లదే..1 లక్షను రూ.1.75 కోట్లు చేసిన మల్టీబ్యాగర్
అదృష్టం అంటే వీళ్లదే..1 లక్షను రూ.1.75 కోట్లు చేసిన మల్టీబ్యాగర్
మండే ఎండల్లోను బెజవాడ వాహనదారులను పలకరిస్తున్న చిరు జల్లులు.. ఇలా
మండే ఎండల్లోను బెజవాడ వాహనదారులను పలకరిస్తున్న చిరు జల్లులు.. ఇలా
ప్రసూతి వార్డులోని భార్యను కత్తితోపొడిచి హత్య చేసిన భర్త!
ప్రసూతి వార్డులోని భార్యను కత్తితోపొడిచి హత్య చేసిన భర్త!
రిటైర్మెంట్‌ తర్వాత నెలకు రూ.60 వేలు కావాలా?
రిటైర్మెంట్‌ తర్వాత నెలకు రూ.60 వేలు కావాలా?
మిత్రమా బిగ్‌ అలర్ట్‌.. ముందు ఈ పని చేసుకో.. జూన్‌ 14 వరకే గడువు
మిత్రమా బిగ్‌ అలర్ట్‌.. ముందు ఈ పని చేసుకో.. జూన్‌ 14 వరకే గడువు