Aman Sehrawat: అన్న అమన్ బాటలో నేను సైతం అంటున్న అమిత్.. దేశం కోసం ఆడి బంగారు పతకం తెస్తా అంటున్న బుల్లి రెజ్లర్

57 కేజీల విభాగంలో రెజ్లర్ అమన్ సెహ్రావత్ కాంస్య పతకం గెలుపొందడంపై అమన్ ఎనిమిదేళ్ల సోదరుడు అమిత్ సెహ్రావత్ మాట్లాడుతూ.. తన అన్నలా తాను కూడా రెజ్లర్ గా పోటీల్లో పాల్గొంటానని.. దేశం కోసం బంగారు పతకాన్ని తీసుకువస్తానని చెప్పాడు. శుక్రవారం 57 కిలోల ఫ్రీస్టైల్ విభాగంలో కాంస్య పతక పోరులో ప్యూర్టో రికోకు చెందిన డారియన్ టోయ్ క్రూజ్ పై 13-5 తేడాతో గెలుపొందాడు. అండర్-23 ప్రపంచ చాంపియన్ అమన్ సెమీ ఫైనల్‌లో జపాన్‌కు చెందిన రీ హిగుచి చేతిలో 0-10 తేడాతో ఓడిపోయాడు. పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఏకైక మల్లయోధుడు.

Aman Sehrawat: అన్న అమన్ బాటలో నేను సైతం అంటున్న అమిత్.. దేశం కోసం ఆడి బంగారు పతకం తెస్తా అంటున్న బుల్లి రెజ్లర్
Paris Olympics 2024
Follow us

|

Updated on: Aug 10, 2024 | 11:23 AM

పారిస్ ఒలింపిక్స్‌లో శుక్రవారం జరిగిన రెజ్లింగ్‌లో భారత్‌కు అమన్ సెహ్రావత్ తొలి పతకాన్ని అందించాడు. భారతదేశం నుంచి పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఏకైక పురుష రెజ్లర్ అమన్ భారతీయులను నిరాశ పరచలేదు. 2008 నుండి జరిగిన ప్రతి ఒలింపిక్స్‌లో భారతదేశం రెజ్లింగ్‌ విభాగంలో పతకాన్ని గెలుచుకుంది. ఈ ఏడాది అమన్ ఈ ట్రెండ్‌ను కొనసాగించాడు.

57 కేజీల విభాగంలో రెజ్లర్ అమన్ సెహ్రావత్ కాంస్య పతకం గెలుపొందడంపై అమన్ ఎనిమిదేళ్ల సోదరుడు అమిత్ సెహ్రావత్ మాట్లాడుతూ.. తన అన్నలా తాను కూడా రెజ్లర్ గా పోటీల్లో పాల్గొంటానని.. దేశం కోసం బంగారు పతకాన్ని తీసుకువస్తానని చెప్పాడు.

ఇవి కూడా చదవండి

భారతదేశపు ఏకైక పురుష రెజ్లర్

శుక్రవారం 57 కిలోల ఫ్రీస్టైల్ విభాగంలో కాంస్య పతక పోరులో ప్యూర్టో రికోకు చెందిన డారియన్ టోయ్ క్రూజ్ పై 13-5 తేడాతో గెలుపొందాడు. అండర్-23 ప్రపంచ చాంపియన్ అమన్ సెమీ ఫైనల్‌లో జపాన్‌కు చెందిన రీ హిగుచి చేతిలో 0-10 తేడాతో ఓడిపోయాడు. పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఏకైక మల్లయోధుడు.

దేశానికి బంగారు పతకం సాధిస్తాం

పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఈవెంట్‌లో రెజ్లర్ అమన్ సెహ్రావత్ కాంస్య పతకాన్ని గెలుచుకోవడంపై.. జాతీయ రెజ్లింగ్ కోచ్ జగ్మందర్ సింగ్ ప్రదర్శన బాగుంది. స్వర్ణంపై ఆశలు పెట్టుకున్నా కాంస్యంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే రానున్న కాలంలో దేశానికి బంగారు పతకం సాధిస్తామని హామీ ఇస్తున్నానని.. భవిష్యత్తులో కూడా బంగారు పతకం సాధిస్తానని అమన్ హామీ ఇచ్చాడు.

భారత్ కు ప్రతి ఒలింపిక్స్‌లోనూ రెజ్లింగ్‌లో పతకం

2008 నుంచి ప్రతి ఒలింపిక్స్‌లో భారతదేశం రెజ్లింగ్‌లో పతకాన్ని గెలుచుకుంది. అమన్ ఈ ట్రెండ్‌ను కొనసాగించాడు. బీజింగ్‌లో సుశీల్ కుమార్ (2008), యోగేశ్వర్ దత్ లండన్‌లో (2012), సాక్షి మాలిక్ రియో (2016)లో కాంస్యం, రవి దహియా, బజరంగ్ పునియా టోక్యో 2021లో వరుసగా రజత, కాంస్య పతకాలు సాధించారు. కాంస్య పతక పోరులో ఆరంభం నుంచే ప్రత్యర్థికి ఒత్తిడి సృష్టించి పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు.

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఆరో పతకం

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇది ఆరో పతకం. అంతకుముందు షూటింగ్‌లో మను భాకర్ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్), మను భరత్, సరబ్జోత్ సింగ్ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్), స్వప్నిల్ కుసాలే (50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లు), భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాలను గెలుచుకోగా.. స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా. రజత పతకం సాధించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..