AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

National flag: స్వాతంత్ర్య దినోత్సవానికి ముందే దేశవ్యాప్తంగా నాందేడ్ ఖాదీ జెండాకు డిమాండ్..ఒక్క రోజే రూ.30 లక్షల విలువైన జెండాలు విక్రయం

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకోవడానికి భారతీయులు సిద్ధం అవుతున్నారు. మార్కెట్ లో ఎక్కడ చూసినా త్రివర్ణ పతకాలు దర్శనం ఇస్తున్నాయి. అయితే జాతీయ జెండా విషయంలో కొన్ని నియమ నిబంధనలు పాటించాలనేది రాజ్యాంగంలో పేర్కొన్నారు. ముఖ్యంగా జెండా తయారీ విధానం, ఎగర వేసే సమయం, వస్త్రం ఇలా ఎన్నో ఉన్నాయి. ఈ నేపధ్యంలో స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు దేశవ్యాప్తంగా నాందేడ్ కు చెందిన ఖాదీ జెండాకు డిమాండ్ దేశవ్యాప్తంగా పెరిగింది. ఆగస్ట్ 8న 2024న పుణేపల్స్‌లో రూ.30 లక్షల విలువైన జెండాలు అమ్ముడయ్యాయి.

National flag: స్వాతంత్ర్య దినోత్సవానికి ముందే దేశవ్యాప్తంగా నాందేడ్ ఖాదీ జెండాకు డిమాండ్..ఒక్క రోజే రూ.30 లక్షల విలువైన జెండాలు విక్రయం
Nanded's Khadi Flag
Surya Kala
|

Updated on: Aug 10, 2024 | 1:31 PM

Share

స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్న కొద్దీ నాందేడ్‌లోని ఖాదీ గ్రామ ఉద్యోగ సమితి జాతీయ జెండాలకు డిమాండ్ పెరిగింది. ఈ జెండాలు మహారాష్ట్ర లో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఎగురవేస్తారు. ఇది నాందేడ్‌ ఖాదీ ప్రాముఖ్యతను.. చేనేత కళాకారుల దేశం దేశభక్తి ప్రదర్శనలకు గర్వకారణంగా మారింది. నాందేడ్‌లో జెండా తయారీకి 1993 నాటి చరిత్ర ఉంది. కర్ణాటకలోని హుబ్లీ కేంద్రంతో పాటు.. భారతదేశంలో జాతీయ జెండాను ఉత్పత్తి చేసే రెండు ప్రదేశాలలో నాందేడ్ ఒకటి. జెండాలు ప్రధానంగా రెండు దశల్లో తయారు చేయబడతాయి.. ఆగస్టు 15, జనవరి 26 ల కొరకు జాతీయ జెండాలను తయారు చేస్తారు. అయితే కొనసాగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఏడాది పొడవునా ఉత్పత్తి కొనసాగుతుంది. ఇప్పటివరకు నాందేడ్ కు చెందిన ఖాదీ గ్రామ ఉద్యోగ సమితి 5 మిలియన్ జెండాలను ఉత్పత్తి చేసింది, ఈ సీజన్‌లోనే దాదాపు 2.5 మిలియన్ల అమ్మకాలు జరిగాయి.

నాందేడ్ నుండి జాతీయ జెండాలు మహారాష్ట్రలోనే కాకుండా ఢిల్లీ, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, రాజస్థాన్, హర్యానా, చండీగఢ్, తమిళనాడు, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా గర్వంగా ఎగురవేయబడతాయి. జెండాలు వివిధ సైజెస్ లో వస్తాయి. అతిపెద్ద పరిమాణం 14 నుండి 21 అడుగుల వరకు ఉంటుంది. ఇతర సాధారణ సైజ్ అంటే 8 బై 21 అడుగులు, 6 బై 9 అడుగులు, 3 బై 4.5 అడుగులు, 2 బై 3 అడుగులు.. 6.5 అంగుళాలు 9 అంగుళాలు ఉన్నాయి. ఈ కొలతలు జెండాను పెద్ద ప్రభుత్వ భవనాల నుండి చిన్న కార్యాలయాల వరకు వివిధ సందర్భాల్లో వివిధ సెట్టింగ్లో ఉపయోగిస్తారు.

ఈ జెండాలను తయారు చేసే ప్రక్రియ చాలా సునిశితంగా ఉంటుంది. లాతూర్ జిల్లాలోని ఉద్గీర్ కేంద్రం నుంచి ముడి ఖాదీ వస్త్రాన్ని మొదట గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని ప్రభుత్వం ఆమోదించిన BMC మిల్లుకు పంపుతారు. ఇక్కడ వస్త్రం కాషాయం, తెలుపు, ఆకుపచ్చ అనే మూడు రంగులలో రంగులు వేయబడుతుంది. తర్వాత అల్లుతారు. ఈ ఫాబ్రిక్ ఫ్లాగ్ ఉత్పత్తిలో ఉపయోగించే ముందు ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేయడానికి ఎన్నో పరీక్షలు చేస్తారు. అశోక చక్రం 24 గీతను స్క్రీన్ ప్రింటింగ్ ఉపయోగించి జెండాపై ముద్రిస్తారు. “గార్డి” అని పిలువబడే జెండాను భద్రపరచడానికి ఉపయోగించే తాళ్లు పసుపు, బెరడు, టేకు, శిషం వంటి మన్నికైన చెక్కలతో తయారు చేస్తారు. అంతేకాదు వాటిని ముంబై నుంచి తెస్తారు. జెండా చెక్కుచెదరకుండా ఉండేలా వర్షం, ఇతర వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఈ తాళ్లు రూపొందించబడతాయి.

ఇవి కూడా చదవండి

ఎన్ని సంవత్సరాలు అయినా ఏడాది ఏడాది గడిచేకొద్దీ నాందేడ్‌లోని ఖాదీ గ్రామ ఉద్యోగ సమితి ఈ జెండాలను ఉత్పత్తి చేసే సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఉంది. దేశానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన రోజులలో తాము తయారు చేసే జాతీయ జెండా ఎగురుతుంటే దేశమంతటా గర్వంగా తలెత్తుకుని చూస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..