Gold Price Today: మగువలకు షాకింగ్ న్యూస్.. మళ్లీ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
కేంద్ర బడ్జెట్ తర్వాత బంగారం ధరలు భారీగా తగ్గడంతో, దుకాణాల్లో కొనుగోళ్ల జోష్ పెరిగింది. గత వారం రోజులుగా పసిడి, వెండి రేట్లు భారీ పడిపోవడంతో వినియోగదారులు కొనడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు రోజుల నుంచి బంగారం, వెండి ధరలు షాకిచ్చాయి.. మళ్లీ ధరలు పెరిగాయి..
కేంద్ర బడ్జెట్ తర్వాత బంగారం ధరలు భారీగా తగ్గడంతో, దుకాణాల్లో కొనుగోళ్ల జోష్ పెరిగింది. గత వారం రోజులుగా పసిడి, వెండి రేట్లు భారీ పడిపోవడంతో వినియోగదారులు కొనడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు రోజుల నుంచి బంగారం, వెండి ధరలు షాకిచ్చాయి.. మళ్లీ ధరలు పెరిగాయి.. బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకం 6%కి తగ్గించడంతో ఇటీవల ధరలు భారీగా తగ్గాయి.. వాస్తవానికి బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు జరుగుతుంటాయి.. ఒక్కోసారి ధరలు తగ్గితే మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి.. శనివారం (10 ఆగస్టు 2024) ఉదయం ఆరు గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. తాజాగా ధరలు పెరిగాయి.. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర పసిడి ధర రూ.70,100 ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ 64,260 గా ఉంది. 24 క్యారెట్లపై 820, 22 క్యారెట్లపై 750 మేర ధర పెరిగింది. వెండి ధర కిలో రూ.83,100లుగా ఉంది. వెండి ధర 16 మేర పెరిగింది..
దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో చూడండి..
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 64,260, 24 క్యారెట్ల బంగారం ధర రూ.70,100గా ఉంది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,260, 24 క్యారెట్ల బంగారం ధర రూ.70,100గా ఉంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,410, 24 క్యారెట్ల ధర రూ.70,250, ముంబైలో 22 క్యారెట్లు రూ.64,260, 24 క్యారెట్లు రూ.70,100, చెన్నైలో 22క్యారెట్లు రూ.64,260, 24 క్యారెట్లు రూ.70,100, బెంగళూరులో 22క్యారెట్ల రేటు రూ.64,260, 24 క్యారెట్లు రూ.70,100గా ఉంది.
వెండి ధరలు..
ఢిల్లీలో వెండి కిలో ధర రూ.83,100, ముంబైలో రూ.83,100, బెంగళూరులో రూ.80,650, చెన్నైలో రూ.88,100, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో రూ.88,100 లుగా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..