Aman Sehrawat: తల్లిదండ్రులను కోల్పోయి.. తాత పెంపకంలో పెరిగిన హర్యానా క్రీడా కుసుమం అమన్

అమన్ సెహ్రావత్ మొదటి రెండు మ్యాచ్‌లలో ఏకపక్షంగా గెలిచాడు.. అయితే సెమీ-ఫైనల్ బౌట్‌లో జపాన్ రెజ్లర్ చేతిలో పరాజయం పాలయ్యాడు. అమన్ సెహ్రావత్ ఓడిన విధానం చూసిన వారు ఇక ఈ సెక్షన్ లో కూడా భారత్ కు పతకం అందని కలే అనుకున్నారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అమన్ సెహ్రావత్ కాంస్య పతకాన్ని సాధించాడు. దేశానికి ఆరో పతకాన్ని అందించాడు. ఇది మాత్రమే కాదు అమన్ సెహ్రావత్ తన విజయంలో భారత్ తరపున మరో రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. మను భాకర్, నీరజ్ చోప్రా వంటి ఛాంపియన్ ఆటగాళ్ల రికార్డ్ ను చెరిపేశాడు.

Aman Sehrawat: తల్లిదండ్రులను కోల్పోయి.. తాత పెంపకంలో పెరిగిన హర్యానా క్రీడా కుసుమం అమన్
Aman SehrawatImage Credit source: Getty Images
Follow us

|

Updated on: Aug 10, 2024 | 1:30 PM

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు చెందిన 21 ఏళ్ల రెజ్లర్ అమన్ సెహ్రావత్ విజేతగా నిలిచాడు. 57 కిలోల రెజ్లింగ్ విభాగంలో అమన్ సెహ్రావత్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ప్యూర్టో రికోకు చెందిన డారియన్ క్రూజ్‌ను 13-5తో ఓడించి ఒలింపిక్ లో పతకం సాధించాలనే తన కలను అమన్ నెరవేర్చుకున్నాడు. హర్యానాలోని ఝజ్జర్‌లో జన్మించిన అమన్‌కి ఇది మొదటి ఒలింపిక్స్. అంతేకాదు ఒలింపిక్స్ లో అతని అరంగేట్రంలోనే ప్రతి క్రీడాకారుడు కలలు కనే ఒక ఘనతను సాధించాడు.

ఈ పతకం గెలవడం అమన్‌కు అంత ఈజీగా దక్కలేదు. అమన్ సెహ్రావత్ మొదటి రెండు మ్యాచ్‌లలో ఏకపక్షంగా గెలిచాడు.. అయితే సెమీ-ఫైనల్ బౌట్‌లో జపాన్ రెజ్లర్ చేతిలో పరాజయం పాలయ్యాడు. అమన్ సెహ్రావత్ ఓడిన విధానం చూసిన వారు ఇక ఈ సెక్షన్ లో కూడా భారత్ కు పతకం అందని కలే అనుకున్నారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అమన్ సెహ్రావత్ కాంస్య పతకాన్ని సాధించాడు. దేశానికి ఆరో పతకాన్ని అందించాడు. ఇది మాత్రమే కాదు అమన్ సెహ్రావత్ తన విజయంలో భారత్ తరపున మరో రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. మను భాకర్, నీరజ్ చోప్రా వంటి ఛాంపియన్ ఆటగాళ్ల రికార్డ్ ను చెరిపేశాడు.

అమన్ సెహ్రావత్ ఓ అద్భుతం

ఇవి కూడా చదవండి

పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా రజత పతకాన్ని సాధించగా..మను భాకర్‌కు రెండు కాంస్య పతకాలు వచ్చాయి. అయితే ఈ ఇద్దరు దిగ్గజాలను కూడా అమన్ సెహ్రావత్ ఓడించాడు. అమన్ సెహ్రావత్ కేవలం 21 సంవత్సరాల 24 రోజుల వయస్సులో ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్నాడు. వ్యక్తిగత ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకూ ఈ రికార్డ్ పీవీ సింధు పేరిట ఉంది. 21 ఏళ్ల 44 రోజుల వయసులో ఒలింపిక్ పతకం సాధించింది పీవీ సింధు

చిన్న వయసులోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న అమన్

అమన్ ఒలింపిక్ జీవితంలో విషాదకరమైన ఘటనలున్నాయి. అమన్ చాలా చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. అమన్ తల్లి గుండెపోటుతో మరణించింది. 6 నెలల వ్యవధిలో అతని తండ్రి కూడా మరణించాడు. దీంతో అమన్‌ను అతని తాత మంగెరామ్ సెహ్రావత్ పెంచారు. ఆర్థిక సంక్షోభం మధ్య ఢిల్లీలోని ఛత్రసల్ స్టేడియంకు చేరుకున్నాడు, అక్కడ అతను అనుభవజ్ఞులైన రెజ్లర్ల నుంచి శిక్షణ తీసుకున్నాడు. అమన్ ఆరాధ్య దైవం రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్. యితే టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన రవి దహియాను నిశితంగా గమనించి అతని నుంచి ఎన్నో మెలకువలు నేర్చుకున్నాడు. రవి దహియాను ఓడించి పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన అమన్ ఇప్పుడు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ పతకం సాధించడం విశేషం.

అమన్ సెహ్రావత్ విజయానికి బానిస

అమన్ సెహ్రావత్‌కు గెలవడం అలవాటు. చిన్నదైన అతని కెరీర్ అద్భుతమైనది. ఈ 21 ఏళ్ల రెజ్లర్ ఒలింపిక్ పతకాన్ని గెలుచుకోవడానికి ముందు అనేక ప్రధాన పోటీలలో స్వర్ణం సాధించాడు, అమన్ ఆసియా ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించాడు. అదే ఏడాది జాగ్రెబ్‌లో కూడా స్వర్ణం సాధించాడు. బుడాపెస్ట్‌లో రజత పతకం సాధించడంలో సఫలమయ్యాడు. ఈ సంవత్సరం, అమన్ తన ఫామ్‌ను ప్యారిస్‌లో కూడా కొనసాగించాడు.

పారిస్ ఒలింపిక్స్‌లో అమన్ తన ప్రదర్శనను మెరుగుపరుచుకోగలిగాడు. కాంస్య పతకాన్ని గెలుచుకున్న తర్వాత అమన్ స్వయంగా ఈ విషయాన్ని చెప్పాడు. సెమీఫైనల్ మ్యాచ్‌లో చిన్నపాటి టెక్నికల్ మిస్టేక్ చేశానని.. అయితే తాను చేసిన తప్పు నుంచి పాఠం నేర్చుకుని కాంస్య పతకం కోసం బరిలోకి దిగినట్లు చెప్పాడు. ఏకపక్షంగా సాగిన పోటీలో కాంస్య పతకాన్ని సాధించడం ఇక్కడ పెద్ద విషయమని చెప్పాడు. అమన్ తన ఆటతీరును ఇలాగే కొనసాగిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2028లో జరగనున్న లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో తన పతకం రంగు స్వర్ణంగా ఉండేలా చూసుకుంటానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు 21 ఏళ్ల అమన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

40 ప్లస్ అయినా తగ్గేదలే అంటున్న సౌత్ హీరోయిన్స్! నార్త్ లో కూడా..
40 ప్లస్ అయినా తగ్గేదలే అంటున్న సౌత్ హీరోయిన్స్! నార్త్ లో కూడా..
ఓరీ దేవుడో.. డ్యాన్స్ చేస్తుండగా వ్యక్తిపై పిడుగుపాటు.. షాకింగ్‌
ఓరీ దేవుడో.. డ్యాన్స్ చేస్తుండగా వ్యక్తిపై పిడుగుపాటు.. షాకింగ్‌
డ్రగ్స్‌ కేస్‌ అప్డేట్.. గుడ్ న్యూస్ చెప్పిన హేమ.! వీడియో..
డ్రగ్స్‌ కేస్‌ అప్డేట్.. గుడ్ న్యూస్ చెప్పిన హేమ.! వీడియో..
రిలీజ్‌ అవ్వని సినిమాకి టికెట్స్ అడగడం ఏంట్రా.! సుహాస్ వీడియో..
రిలీజ్‌ అవ్వని సినిమాకి టికెట్స్ అడగడం ఏంట్రా.! సుహాస్ వీడియో..
అచ్చం పవన్‌ కళ్యాణ్ ను గుర్తు చేసిన తేజు! విజయవాడలో సుప్రీమ్ హీరో
అచ్చం పవన్‌ కళ్యాణ్ ను గుర్తు చేసిన తేజు! విజయవాడలో సుప్రీమ్ హీరో
ధనుష్ పై నిషేధం ఎత్తివేసిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.!
ధనుష్ పై నిషేధం ఎత్తివేసిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.!
దారుణం.! నాగమణికంఠ భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్..
దారుణం.! నాగమణికంఠ భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్..
హార్దిక్ ముందే బాయ్‌ఫ్రెండ్‌తో చక్కర్లు కొడుతున్న మాజీ భార్య.!
హార్దిక్ ముందే బాయ్‌ఫ్రెండ్‌తో చక్కర్లు కొడుతున్న మాజీ భార్య.!
సూపర్ న్యూస్.! NTR వైపే అల్లు అర్జున్ | 2.57 గంటల అరాచకం.!
సూపర్ న్యూస్.! NTR వైపే అల్లు అర్జున్ | 2.57 గంటల అరాచకం.!
రూ.50 కోట్లు గెల్చుకునే ఛాన్స్! డిజిటల్ లాటరీని ప్రారంభించిన సీఎం
రూ.50 కోట్లు గెల్చుకునే ఛాన్స్! డిజిటల్ లాటరీని ప్రారంభించిన సీఎం