- Telugu News Photo Gallery Spiritual photos Mattithaleswara temple: The holy mud of this temple in Karnataka cures skin diseases
Mattithaleswara Temple: ఈ ఆలయంలోని మట్టి చర్మ వ్యాధులకు మెడిసిన్.. గురు, ఆదివారాల్లో భారీ సంఖ్యలో భక్తులు..
మనదేశంలో అనేక పుణ్యక్షేత్రాలు, ఆలయాలు ఉన్నాయి. ప్రతి ఒక్క ఆలయానికి ఒక చారిత్ర ఒకొక్క విశిష్టతను కలిగి ఉంటుంది. అంతేకాదు కొన్ని ఆలయాలను దర్శించుకోవడం వలన శుభఫలితాలు లభిస్తాయని నమ్మితే.. మరికొన్ని ఆలయాలలోని నీరు, మట్టి, ఇలాంటి కూడా అద్భుతాలు చేస్తాయని విశ్వాసం. అలాంటి ఓ ఆలయంలోని మట్టిలో ఔషధ గుణాలు ఉన్నాయని.. ఈ మట్టిని చర్మ వ్యాదులున్నావారు రాసుకుంటే మంచి మెడిసిన్ లా పని చేస్తుందని.. బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది విశ్వాసం. ఆ ఆలయం కర్నాటకలో ఉంది.
Updated on: Aug 10, 2024 | 10:54 AM

ఈ ఆలయంలోని బురద చర్మ వ్యాధిని నయం చేస్తుంది కర్ణాటకలో అద్భుతమైన చిన్న, పెద్ద దేవాలయాలు అనేకం ఉన్నాయి. అలాంటి ఆలయంలో ఒకటి మాండ్య జిల్లా మలవల్లి తాలూకాలోని కల్లువీరనహళ్లిలోని మఠితలేశ్వర దేవాలయం చరిత్ర ప్రసిద్ధి చెందినది. ఇక్కడ ప్రత్యేకత ఏమిటి? ఆది, గురువారాలతో పాటు కొని ప్రత్యెక రోజులలో ఈ చిన్న శివాలయానికి వేలాది మంది ఇక్కడకు వస్తారో తెలుసా..

దేశ వ్యాప్తంగా నాగ పంచమిని ఘనంగా జరుపుకున్నారు. అదేవిధంగా మండ్యలోని ఈ మఠితలేశ్వరాలయంలో కూడా ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. అయితే ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే

ఈ ఆలయం మద్ది చెట్టు క్రింద ఉంది. కనుక ఈ ప్రాంతానికి 'మఠితలేశ్వర' లేదా మత్తితలేశ్వర్ అని పేరు వచ్చింది. దేవుడి చుట్టూ ఉన్న మట్టిలో ఔషధ గుణాలు ఉన్నాయి. అన్ని రకాల చర్మ వ్యాధులను నయం చేసే శక్తి ఉంది.

ప్రతి ఆది, గురువారాల్లో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చర్మవ్యాధులతో బాధపడేవారు ఇక్కడికి వస్తుంటారు. చెరువులో (కళ్యాణి) స్నానం చేస్తే చర్మవ్యాధులు నయమవుతాయని నమ్ముతారు.

పూజ తర్వాత పూజారి ఇచ్చే మట్టిని (పుట్ట (హుట్టాడ-మన్ను లేదా మృత్తిక) నుంచి తీసిన మట్టి. చెట్టు బెరడు కలిపి)ఇచ్చిన పొడిని తీసుకుని ఎలాంటి చర్మవ్యాధులకైనా పూసుకుంటే నయమవుతుందని విశ్వాసం.

పురాణాల ప్రకారం చాలా కాలం క్రితం ఈ ప్రదేశంలో ఒక సాధువు నివసించాడట. శివ భక్తుడైన సాధువు చెట్టుకింద కూర్చుని తపస్సు చేసేవాడట. తపస్సులో నిమగ్నమై సాధువు చుట్టూ ఒక చీమ పుట్ట ఏర్పడిందట. కాలక్రమంలో ఒకరోజు గ్రామపెద్ద ఆవు పుట్ట దగ్గర నిలబడి పాలు ఇవ్వడం గమనించాడు. అతను పుట్ట దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ శివలింగం కనిపించిందట.

తరువాత అతని కలలో శివుడు కనిపించి తాను ఈ ప్రదేశంలో స్థిరపడతానని చెప్పాడు. సాధువు తపస్సుకు కూర్చున్న చెట్టు మద్ది చెట్టు. మత్తి చెట్టు కింద శివలింగం ఉండడంతో ఈ ప్రాంతానికి మతితలేశ్వర అని పేరు వచ్చింది. చెట్టు బెరడుతో పాటు పుట్ట మట్టిలో ఔషధ గుణాలు ఉన్నాయని చర్మ వ్యాధులను నయం చేస్తాయని విశ్వాసం.




