AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Soaking Pulses: పప్పు దినుసులు వండే ముందు ఈ ఒక్క పని చేస్తే చాలు..

అన్ని రకాల పప్పులు ఆరోగ్యానికి చాలా మంచిది. వండే ముందు పప్పులు వంటివి నీళ్లలో నానబెట్టడం అనేది సాధారణంగా పాటించే పద్దతి. నానబెట్టిన పప్పులను నీళ్లలో నానబెట్టడం వల్ల.. త్వరగా ఉడకడమే కాకుండా అనేక రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి. అదే విధంగా పప్పులను నానబెట్టిన నీటిని తిరిగి ఉపయోగించడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. పప్పుల్లో అనేక రకాలైన పోషకాలు లభిస్తాయి. ప్రోటీన్, ఫైబర్, క్యాల్షియం, విటమిన్లు అనేవి పుష్కలంగా లభిస్తాయి. నానబెట్టిన పప్పు తినడం వల్ల..

Soaking Pulses: పప్పు దినుసులు వండే ముందు ఈ ఒక్క పని చేస్తే చాలు..
Soaking Pulses
Chinni Enni
|

Updated on: May 30, 2024 | 5:53 PM

Share

అన్ని రకాల పప్పులు ఆరోగ్యానికి చాలా మంచిది. వండే ముందు పప్పులు వంటివి నీళ్లలో నానబెట్టడం అనేది సాధారణంగా పాటించే పద్దతి. నానబెట్టిన పప్పులను నీళ్లలో నానబెట్టడం వల్ల.. త్వరగా ఉడకడమే కాకుండా అనేక రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి. అదే విధంగా పప్పులను నానబెట్టిన నీటిని తిరిగి ఉపయోగించడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. పప్పుల్లో అనేక రకాలైన పోషకాలు లభిస్తాయి. ప్రోటీన్, ఫైబర్, క్యాల్షియం, విటమిన్లు అనేవి పుష్కలంగా లభిస్తాయి. నానబెట్టిన పప్పు తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా శరీరంలోని పేరుకు పోయిన చెడు కొవ్వును తగ్గిస్తుంది. కందిపప్పు, పెసరపప్పు తీసుకోవడం వల్ల శరీర ఆరోగ్యం మొత్తం మెరుగు పడుతుంది.

పప్పు తినడమే కాదు.. పప్పులు నానబెట్టిన నీటిని సక్రమంగా ఉపయోగిస్తున్నారా లేదా అనేది కూడా గమనించుకోవాలి. ఆ నీటిని తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. పప్పులను నానబెట్టి తింటే.. ఎలాంటి సమస్యలు రావు. అయితే ఒక్కో పప్పును ఎంత సేపు నానబెట్టాలి? ఎంత సేపు నానబెడితే పోషకాలు అందుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పప్పులు ఎంత సేపు నానబెట్టాలి..

కంది పప్పు, పెసర పప్పు, మినపప్పు కనీసం 6 నుంచి 8 గంటలు పూర్తిగా నీటిలో నానబెట్టాలి. మినుములు, పెసలు వంటివి అయితే కనీసం 8 నుంచి 12 గంటల పాటు నానబెట్టాలి. శనగలు, బీన్స్, రాజ్మా వంటి వాటిని 12 నుంచి 18 గంటలు నానబెడితే మంచి ఫలితాలు ఉంటాయి. చాలా మంది టిఫిన్ కోసం పప్పులను నానబెడుతూ ఉంటారు. ఇలా నానబెట్టేటప్పుడు పప్పులను కనీసం మూడు సార్లైనా కడగాలి. అప్పుడు వాటిల్లో ఉండే గ్యాస్ అనేది బయటకు వెళ్తుంది. పోషకాలు అనేవి శరీరానికి బాగా అందుతాయి.

ఇవి కూడా చదవండి

గ్యాస్ సమస్యలు రావు..

పప్పులు నానబెట్టిన నీటిని పడేయకుండా ఇంట్లోని మొక్కలకు పోస్తే బాగా పెరుగుతాయి. ఎందుకంటే ఈ నీటిలో అనేక పోషకాలు ఉంటాయి. కంది పప్పు, పెసరపప్పు, శనగ పప్పు, బీన్స్, రాజ్మా, శనగలు బాగా నానబెడితే నీటిలో ఫైటేస్ ఏర్పడుతుంది. దీని వల్ల పోషకాలు శరీరానికి అందుతాయి. అదే విధంగా పప్పు దినుసులను ఎక్కువ సేపు నానబెట్టడం వల్ల.. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి పప్పులను ఎక్కువ సేపు నానబెట్టడం చాలా మంచిది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్