AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BP: తరచూ నీరు తాగితే.. రక్తపోటు తగ్గుతుందా.?

రక్తపోటుతో బాధపడుతోన్న వారి సంఖ్య ఇటీవల ఎక్కువవుతోంది. జీవనశైలిలో మార్పుల కారణంగా బీపీ బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే నీటిని తీసుకోవడం వల్ల బీపీ అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఇందులో ఎంత వరకు నిజం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

BP: తరచూ నీరు తాగితే.. రక్తపోటు తగ్గుతుందా.?
Bp
Narender Vaitla
|

Updated on: Nov 03, 2024 | 6:31 PM

Share

మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పల కారణంగా రక్తపోటు బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ఎన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. గుండె, మెదడు, ఊపిరితిత్తులు, కిడ్నీల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బీపీ అదుపులో ఉండేందుకు పలు రకాల చిట్కాలను పాటించాలని సూచిస్తుంటారు. అయితే సరిపడ నీటిని తాగడం వల్ల కూడా రక్తపోటు అదుపులోకి వస్తుందని నిపుణులు చెబుతుంటారు. ఇంతకీ ఇందులో నిజం ఎం ఉంది.? నిజంగానే నీరు తాగితే బీపీ కంట్రోల్‌ అవుతుందా.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

వైద్యుల అభిప్రాయం ప్రకారం.. మన గుండెలో దాదాపు 73% నీటితో నిర్మితమై ఉంటుంది. కాబట్టి రక్తపోటును నియంత్రించడానికి నీరును మించింది మరొకటి లేదని అంటున్నారు. నీటిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం వంటి మినరల్స్ బీపీని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. నీటికి బిపిని తగ్గించే శక్తి ఉందని అనేక అధ్యయనాలలో రుజువైంది. కాబట్టి ప్రతిరోజూ వీలైనంత ఎక్కువ నీరు త్రాగాలి. నీటిలో నిమ్మ, దోసకాయ, తాజా పండ్లు, హెర్బల్ టీ, తక్కువ సోడియం సూప్, పాలు, పెరుగు వంటివి చేర్చుకోవచ్చు.

అధిక రక్తపోటును కంట్రోల్‌ చేయడంలో నీరు ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. నీరు రక్త నాళాలను సడలిస్తుంది, ఇది రక్తపోటును తగ్గిస్తుంది. నీరు రక్తాన్ని పలుచన చేస్తుంది అలాగే రక్తాన్ని సిరల ద్వారా సులభంగా ప్రవహించేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. నీరు శరీరంలోని విష పదార్థాలను తొలగించి బీపీని అదుపులో ఉంచుతుంది. నీరు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది, తద్వారా రక్తపోటును నిర్వహిస్తుంది.

రక్తపోటు అదుపులో ఉండాలంటే.. బరువును నియంత్రించుకోవాలి. కేలరీలు తక్కువ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ప్రతీరోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయమం చేయడాన్ని అలవాటు చేసుకోవాలి. ఇక వాకింగ్, స్విమ్మింగ్‌, యోగా, మెడిటేషన్‌ వంటి వాటిని జీవితంలో ఒక భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. తీసుకునే ఆహారంలో అదనపు ఉప్పు తగ్గించాలి. మద్యం, స్మోకింగ్‌కు దూరంగా ఉండాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us