Chinni Enni |
Updated on: Nov 03, 2024 | 7:28 PM
చేతి వేళ్లను అప్పుడప్పుడూ విరిస్తూ ఉంటారు. ఇలా విరవడం చాలా మందికి సంతోషంగా ఉంటుంది. పిల్లలకు దిష్టి తీసే సమయంలో కూడా ఇలా విరుస్తూ ఉంటారు. ఏమీ తోచనప్పుడు.. ఏదో ఆలోచిస్తూ కూడా ఇలా చేస్తూ ఉంటారు. అయితే ఇలా విరవడం వల్ల ప్రమాదమని.. అర్థరైటిస్ వచ్చే కీళ్ల నొప్పులు ఉందని అంటారు.
అయితే పలు అధ్యయనాల ప్రకారం నిపుణులు ఏం చెబుతున్నారంటే.. ఇలా చేతులు విరవడం వల్ల.. అర్థరైటిస్ రావడానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇలా మొటికలు విరవడం వల్ల కీళ్ల నొప్పులు రావని, చేతి వేళ్లు కూడా ఫ్రీగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
చేతి వేళ్లను విరవడం వల్ల అర్థరైటిస్ వస్తుందని అనుకుంటే అది పూర్తిగా అవాస్తవమన్నారు. ఈ విషయాన్ని పలు సార్లు అధ్యయనాల్లో తేలింది. ఈ విషయాన్ని 2011లో మెడికల్ న్యూస్ టుడేలో పబ్లిష్ అయింది.
కానీ పదే పదే చేతి వేళ్లు విరవడం వల్ల ఒత్తిడి ఎక్కువై నొప్పిగా వస్తుందట. ఎక్కువగా చేతులు మొటికలు విరవడం వల్ల నొప్పితో పాటు చేతుల్లో ఉండే గ్రిప్ కూడా పోతుందట. కాబట్టి ఎక్కువగా చేతులు విరవకూడదు.
చేతి వేళ్లు విరవడం వల్ల శబ్దం ఎలా వస్తుందనే డౌట్ అందరిలో ఉంటుంది. చేతి వేళ్లను వెనక్కి లాగినప్పుడు.. కీళ్ల గుజ్జులో పీడనం తగ్గి.. వాయువు కరిగి బుడగలు ఏర్పడాయి. వీటిని విరిచినప్పుడు బుడగలు పలిగి శబ్దం వస్తుంది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)