AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle: టీ తాగితే బరువు పెరుగుతారా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

రోజులో మోతాదుకు మించి టీ తాగితే దుష్ప్రభావాలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. రోజుకు రెండు నుంచి మూడు గ్లాసుల టీ తీసుకుంటే పెద్దగా ఏం జరగదు కానీ అంతకిమించి టీ తీసుకుంటే మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ అధికంగా టీ తీసుకుంటే ఎలాంటి నష్టాలు కలుగుతాయి.?

Lifestyle: టీ తాగితే బరువు పెరుగుతారా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Tea Side Effects
Narender Vaitla
|

Updated on: Mar 05, 2024 | 2:28 PM

Share

భారతీయులను, టీని వేరు చేసి చూడలేం. అంతలా మన కల్చర్‌లో టీ ఒక భాగమైపోయింది. ఉదయం లేవగానే టీ తాగకుండా ఉండలేని వారు మనలో చాలా మందే ఉంటారు. టీ తాగకపోతే రోజు గడవని పరిస్థితి. ఒక్కపూట టీ తాగకపోతే ఏదో కోల్పోయిన భావనలో ఉంటారు. అయితే టీ తాగడం వల్ల లాభాలు ఉన్నాయడంలో ఎంత వరకు నిజం ఉందో, అధికంగా తాగితే నష్టాలు అంతే ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

రోజులో మోతాదుకు మించి టీ తాగితే దుష్ప్రభావాలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. రోజుకు రెండు నుంచి మూడు గ్లాసుల టీ తీసుకుంటే పెద్దగా ఏం జరగదు కానీ అంతకిమించి టీ తీసుకుంటే మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ అధికంగా టీ తీసుకుంటే ఎలాంటి నష్టాలు కలుగుతాయి.? ఈ విషయమై పోషకాహార నిపుణులు ఏం అంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

బరువు తగ్గాలనుకునే వారిని టీకి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు. ఇంతీ టీ తాగడం వల్ల నిజంగానే బరువు పెరుతామా.? అంటే అవుననే చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఓన్లీ మై హెల్త్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారని చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో లభించే పాలలో తక్కువ కొవ్వు పాలు, టోన్డ్ మిల్క్, పాశ్చరైజ్డ్ పాలు వంటి అందుబాటలో ఉన్నాయి.

అలాగే టీ తయారీకి ఉపయోగించే శుద్ధి చేసిన చక్కెరలో కూడా క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటివల్ల శరీరం బరువు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే పాలలో ఉండే కొవ్వు కారణంగా కూడా బరువు పెరుగుతారని హెచ్చరిస్తున్నారు. కాబట్టి టీని అతిగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. రోజుకు మూడు కప్పుల కంటే ఎక్కువ టీ తాగితే కచ్చితంగా బరువు పెరుగుతారని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి…

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి