Lifestyle: బ్లాక్‌ కాఫీ తాగితే బరువు తగ్గుతారా.? ఇందులో నిజమెంతంటే..

బరువు తగ్గాలనుకోవడం సర్వసాధారణమైన విషయం. ఇందుకోసం చాలా మంది వ్యాయామం మొదలు, తీసుకునే ఆహారం వరకు అన్నింటిలో మార్పులు చేసుకుంటారు. అయితే బ్లాక్ కాఫీ తాగడం వల్ల బరువు తగ్గే ప్రక్రియ వేగంగా సాగుతుందని కొందరు భావిస్తుంటారు. ఇంతకీ ఇందులో ఎంత వరకు నిజం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

Lifestyle: బ్లాక్‌ కాఫీ తాగితే బరువు తగ్గుతారా.? ఇందులో నిజమెంతంటే..
Black Coffee
Follow us

|

Updated on: Nov 07, 2024 | 4:28 PM

ప్రస్తుతం ఊబకాయం సమస్య బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మారిన జీవన విధానం, తగ్గిన శారీక శ్రమ కారణంగా బరువు పెరుగుతున్నారు. దీంతో పెరిగిన బరువు తగ్గించుకునేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. తీసుకునే ఆహారం మొదలు, వ్యాయామం వరకు అలవాటు చేసుకుంటారు. అయితే బ్లాక్‌ కాఫీ తాగడం వల్ల బరువు తగ్గుతారని చాలా మంది భావిస్తుంటారు. ఇందులో ఎంత వరకు నిజం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్లాక్‌ కాఫీ బరువును తగ్గించడంలో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. బ్లాక్‌ కాఫీలో ఉండే కెఫిన్‌ జీవక్రియకు వేగాన్ని అందిస్తుంది. జీవక్రియ వేగంగా మారడం వల్ల బరువు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ కేలరీలను బర్న్‌ చేస్తుంది. అలాగే బ్లాక్‌ కాఫీ ఆకలిని తగ్గించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇది బరువు తగ్గడానికి దోహదపడుతుంది. ఇంతకీ బ్లాక్ కాఫీ బరువు తగ్గడానికి ఎలో తోడ్పడుతుందంటే.

బ్లాక్‌ కాఫీలో ఉండే కెఫిన్‌ జీవక్రియను పెంచుతుంది. ఇది శరీరంలో కేలరీలు బర్నింగ్ రేటును పెంచుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇక బ్లాక్ కాఫీలో పాలు, చక్కెర లేదా క్రీమ్ లేకపోవడం వల్ల తక్కువ కేలరీలు ఉంటాయి. దీన్ని తాగడం వల్ల శరీరంలో కేలరీలు కూడా తక్కువగా చేరుతాయి. కెఫిన్‌ ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది, తద్వారా అనవసరమైన చిరుతిళ్లను తగ్గిస్తుంది, ఇది కేలరీలను అదుపులో ఉంచుతుంది. కెఫీన్ శరీరంలోని కొవ్వు కణాలను శక్తిగా మార్చడంలో సహాయపడుతుంది, ఇది వ్యాయామం చేసేటప్పుడు శరీరంలోని కొవ్వును కాల్చే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. కాబట్టి బ్లాక్‌ కాఫీ తాగడం వల్ల బరువు త్వరగా తగ్గొచ్చని చెప్పడంలో నిజం ఉందని చెప్పాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

బ్లాక్‌ కాఫీ తాగితే బరువు తగ్గుతారా.? ఇందులో నిజమెంతంటే..
బ్లాక్‌ కాఫీ తాగితే బరువు తగ్గుతారా.? ఇందులో నిజమెంతంటే..
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..
ట్రంప్ ఫ్యాన్స్ అంటే మినిమం ఉంటది..!
ట్రంప్ ఫ్యాన్స్ అంటే మినిమం ఉంటది..!
కారు నంబర్‌ ద్వారా యజమాని పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు..ఎలాగంటే..
కారు నంబర్‌ ద్వారా యజమాని పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు..ఎలాగంటే..
గర్భిణీలు డ్రాగన్‌ ఫ్రూట్‌ తినొచ్చా.? నిపుణులు ఏమంటున్నారంటే..
గర్భిణీలు డ్రాగన్‌ ఫ్రూట్‌ తినొచ్చా.? నిపుణులు ఏమంటున్నారంటే..
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారు: వైఎస్ జగన్
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారు: వైఎస్ జగన్
ఈ విలన్ ఆఖరి రోజుల్లో ఎంత నరకం అనుభవించారో..
ఈ విలన్ ఆఖరి రోజుల్లో ఎంత నరకం అనుభవించారో..
కలెక్టర్ అంటే ఇలా ఉండాలి.! చాక్ పీస్ పట్టి.. లెక్కల మాస్టర్‌గా..
కలెక్టర్ అంటే ఇలా ఉండాలి.! చాక్ పీస్ పట్టి.. లెక్కల మాస్టర్‌గా..
కాలుష్యంతో ఉత్తరాది ఉక్కిరిబిక్కిరి.. నురగలు కక్కుతున్న యుమునా!
కాలుష్యంతో ఉత్తరాది ఉక్కిరిబిక్కిరి.. నురగలు కక్కుతున్న యుమునా!
డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డారో తప్పదు పాకీజా పని..!బీఅలర్ట్
డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డారో తప్పదు పాకీజా పని..!బీఅలర్ట్