Lifestyle: ఒక తెల్ల వెంట్రుకను పీకేస్తే.. మరిన్ని పెరుగుతాయా.? ఇందులో నిజం ఎంత..
ఇదిలా ఉంటే మొదట్లో ఒక్కటిగా మొదలయ్యే తెల్ల వెంట్రుకల సంఖ్య భారీగా పెరిగిపోతాయి. అయితే ఒక తెల్ల వెంట్రుకను పీకేస్తే దాని చుట్టూ మరిన్ని తెల్ల వెంట్రుకలు పుట్టుకొస్తాయని చెప్పడం మనం వినే ఉంటాం. అందుకే తెల్ల వెంట్రుకలను పీకకూడాదని సలహా ఇస్తుంటారు. అయితే ఇందులో నిజంగానే నిజం ఉందా.? అసలు వెంట్రుకలు పీకితే కొత్త తెల్ల వెంట్రుకలు రావడం ఏంటి.? అనే విషయంలో నిజం ఎంతుందో...

ఒకప్పుడు వయసు మళ్లిన వారిలోనే తెల్ల వెంట్రుకలు కనిపించేవి. అయితే ప్రస్తుతం మారుతోన్న జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకల సమస్యతో బాధపడుతున్నారు. కొందరు చిన్నారుల్లో అయితే విటమిన్ల లోపం వల్ల కూడా తెల్ల వెంట్రుకలు పెరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే మొదట్లో ఒక్కటిగా మొదలయ్యే తెల్ల వెంట్రుకల సంఖ్య భారీగా పెరిగిపోతాయి. అయితే ఒక తెల్ల వెంట్రుకను పీకేస్తే దాని చుట్టూ మరిన్ని తెల్ల వెంట్రుకలు పుట్టుకొస్తాయని చెప్పడం మనం వినే ఉంటాం. అందుకే తెల్ల వెంట్రుకలను పీకకూడాదని సలహా ఇస్తుంటారు. అయితే ఇందులో నిజంగానే నిజం ఉందా.? అసలు వెంట్రుకలు పీకితే కొత్త తెల్ల వెంట్రుకలు రావడం ఏంటి.? అనే విషయంలో నిజం ఎంతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా మన జట్టు నల్లగా ఉండడానికి ప్రధాన కారణం హెయిర్ ఫోలిక్స్ చుట్టూ ఉండే మెలనోసైట్స్. ఇవి మెలనిన్‌ను ఉత్పత్తి చేస్తాయి. మెలనిన్ అనేది జుట్టును సహజంగా నల్లగా ఉంచే పదార్థం. అయితే ఈ మెలనిన్ ఉత్పత్తి తగ్గినప్పుడు జుట్టు దాని సహజ రంగును కోల్పోవడం ప్రారంభిస్తుంది. దీంతో తెల్ల రంగలోకి మారిపోతుంది. ఈ మెలిన్ ఉత్పత్తి తగ్గడం అనేది వయసు, ఒత్తిడి, రసాయనాలతో కూడిన షాంపూలు వాడడం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒక్కసారి తెల్లగా మారి జుట్టు మళ్లీ నలుపు రంగులోకి మారడం అసాధ్యం.
ఇక ఒక వెంట్రుక తీస్తే మిగతా వెంట్రుకలన్నీ తెల్లగా మారుతాయనేది కేవలం ఒక అపోహ మాత్రమేనని, ఇందులో నిజం లేదనని నిపుణులు చెబుతున్నారు. జుట్టు నల్లగా ఉండడానికి మెలనిన్ రసాయం కారణం. తెల్ల జుట్టు పీకేయం మెలనిన్‌పై ఎలాంటి ప్రభావం చూపదు. అయితే తెల్ల వెంట్రుకను పీకేసిన చోట మళ్లీ తెల్ల వెంట్రుకే వస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం ఒప ఫోలికల్ నుంచి ఒక వెంట్రుక మాత్రమే వస్తుంది. చుట్టుపక్కల వెంట్రుకలు మెలనిన్‌ను కోల్పోయే వరకు రంగు మారవు. కాబట్టి ఒక తెల్ల వెంట్రుకను తీస్తే చుట్టూ తెల్ల వెంట్రుకలు పెరుగుతాయనేది నిజం కాదు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..