AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: వాసన పసిగట్టే సామర్థ్యం తగ్గుతోందా.? అలర్ట్‌ అవ్వాల్సిందే..

వాసనను పసిగట్టే శక్తిని కోల్పోవడం పలు రకాల అనారోగ్య సమస్యలకు సంకేతమని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారిలో ఇలాంటి సమస్యలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఇంతకీ వాసన చూసే సామార్థ్యం కోల్పోవడం ఎలాంటి వ్యాధులకు సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం..

Health: వాసన పసిగట్టే సామర్థ్యం తగ్గుతోందా.? అలర్ట్‌ అవ్వాల్సిందే..
Smelling
Narender Vaitla
|

Updated on: Nov 03, 2024 | 3:51 PM

Share

శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగాల్లో ముక్కు ఒకటి. శ్వాస పీల్చుకోవడంలో ముక్కుదే ముఖ్యమైన పాత్ర. ఇక మనకు వాసనను తెలియజేసే అవయవం కూడా ముక్కు అని తెలిసిందే. అయితే ముక్కు వాసనను చూసే సామర్థ్యాన్ని కోల్పోతే వెంటనే అలర్ట్‌ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. కరోనా సమయంలో చాలా మంది వాసన చూసే సామర్థ్యాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే వాసన చూసే సామర్థ్యం తగ్గితే పలు రకాల అనారోగ్య సమస్యలకు సంకేతంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు.

వాసన సామర్థ్యం కోల్పోతుంటే తీవ్రమైన అనారోగ్య పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఫ్రాంటియర్స్ ఇన్ మాలిక్యులర్ న్యూరోసైన్స్‌లో ఇందుకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు ప్రచురించారు. వాసన సామర్థ్యం కోల్పోవడం అల్జీమర్స్, పార్కిన్సన్స్ వ్యాధి, మల్టిపుల్ స్క్లెరోసిస్, గుండె జబ్బులు, కరోనా తో పాటు ఇతర అనారోగ్య సమస్యలకు సంకేతంగా భావించాలని అంటున్నారు.

వాసన, ముక్కులో వాపునకు మధ్య సంబంధం ఉన్నట్లు పలు అధ్యయనాల్లో వెల్లడైంది. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, ఇర్విన్‌లోని చార్లీ డన్‌లప్ స్కూల్ ఆఫ్ బయోలాజికల్ సైన్సెస్ రచయిత, ప్రొఫెసర్ ఎమెరిటస్ మైఖేల్ లియోన్ ఈ విషయమై మాట్లాడుతూ.. వాసన చూసే సామర్థ్యాన్ని పెంచడం వల్ల పెద్దలలో జ్ఞాపకశక్తి 226 శాతం మెరుగుపడుతుందని చెప్పారు. వాసన సామర్థ్యం ఎందుకు తగ్గుతుంది.? ఎలాంటి వ్యాధులకు ఇది సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం..

అలర్జీలు, సైనసైటిస్, ఆస్తమా, ముక్కు క్యాన్సర్, మధుమేహంతో పాటు ముక్కు సంబంధిత సమస్యలు ఉంటే వాసనను పసిగట్టే సామర్థ్యాన్ని కోల్పోతామని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఇక ముక్కు వాసనను పసిగట్టే సామర్థ్యాన్ని కోల్పోవడానికి గల ప్రధాన కారణాల్లో.. అలెర్జీలు, ఇన్ఫెక్షన్, గాలి కాలుష్యం, గాలిలో విషపూరిత కణాలు, ఆల్కహాల్, స్మోకింగ్‌, యాంటీబయాటిక్స్ ఎక్కువగా ఉపయోగించడం వంటివి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us