AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parenting Tips : ఈ 5 టిప్స్ పాటిస్తే చాలు మీ పిల్లవాడిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లే అవసరం ఉండదు..

తల్లిదండ్రులు తమ పిల్లలు ఎలాంటి వ్యాధులకు రాకుండా ఉండాలని జాగ్రత్తపడుతుంటారు. దీనితో పాటు పిల్లలు మానసికంగా కూడా డిస్టర్బ్ కావొద్దని ప్రయత్నం చేస్తుంటారు.

Parenting Tips : ఈ 5 టిప్స్ పాటిస్తే చాలు మీ పిల్లవాడిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లే అవసరం ఉండదు..
New Parents
Madhavi
| Edited By: |

Updated on: Mar 22, 2023 | 7:25 AM

Share

తల్లిదండ్రులు తమ పిల్లలు ఎలాంటి వ్యాధులకు రాకుండా ఉండాలని జాగ్రత్తపడుతుంటారు. దీనితో పాటు పిల్లలు మానసికంగా కూడా డిస్టర్బ్ కావొద్దని ప్రయత్నం చేస్తుంటారు. అయితే పిల్లలు మానసిక, శారీరక ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలంటే కొన్ని రకాల టిప్స్ పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జాబ్ చేసే తల్లిదండ్రులు తమ పిల్లలపై సరైన శ్రద్ధ చూపలేకపోతున్నారు. దీంతో పిల్లలు శారీరకంగా బలహీనంగా ఉండటం వల్ల, పిల్లల మానసిక ఎదుగుదల కూడా దెబ్బతింటుంది. అటువంటి పరిస్థితిలో, చిన్న పిల్లల తల్లిదండ్రులు కొన్ని టిప్స్ పాటించడం వల్ల పిల్లలు శారీరకంగా, ఆరోగ్యంగా ఎదిగేందుకు సహాయపడుతుంది. అలాంటి చిట్కాలను తెలుసుకుందాం.

ఆటలు:

చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఆడుకోవడం ఇష్టపడరు. దీంతో పిల్లలు అల్లరి చేస్తారని వారు భావిస్తారు. పిల్లల శారీరక అభివృద్ధికి, వారి ఆటలు చాలా ముఖ్యం. ఆడుకోవడం వల్ల పిల్లల ఎత్తు, రక్త ప్రసరణ, శారీరక బలం పెరుగుతాయి. అలాగే వారు మానసికంగా అనుభవిస్తున్న స్ట్రెస్ కూడా ఆటలో మరిచిపోతారు.

ఇవి కూడా చదవండి

హెల్దీ ఫుడ్:

ల్లల అభివృద్ధిలో పౌష్టిక ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పిల్లల మంచి ఆరోగ్యాన్ని నిరంతరం కొనసాగించడానికి, వారికి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని ఇవ్వడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పప్పు దినుసులు, గుడ్లు, పాలు, ఆకుకూరలు, మాంసం రూపంలో పిల్లలకు మంచి మోతాదులో ప్రోటీన్ ఇవ్వాలి. మంచి ఆరోగ్యం కోసం వారిని జంక్‌ఫుడ్‌లకు దూరంగా ఉంచడం చాలా ముఖ్యం.

గదిలో వెంటిలేషన్:

పిల్లల ఎదుగుదల కోసం, వారిని మంచి ప్రదేశంలో పెంచడం అవసరం. దీని కోసం వెంటిలేషన్ సౌకర్యం అందుబాటులో ఉన్న గది అయితే బాగుంటుంది. కిటికీలు ఉన్న గదులు పిల్లల మూడ్ మారేందుకు సహాయపడుతుంది. తెరిచి ఉన్న కిటికీలోంచి చల్లటి గాలి, వెంటిలేషన్ లభిస్తుంది. ఏసీ గదుల్లో పిల్లలు ఒత్తిడికి గురవుతారు. ఆకాశంలోని మెరిసే నక్షత్రాలను చూసి పిల్లల మనస్సు ఎప్పుడూ సంతోషిస్తుంది, అయితే ఓపెన్ స్కై వారు చాలా సృజనాత్మకంగా ఉండటానికి సహాయపడుతుంది.

మంచి నిద్ర:

పిల్లల్లో నిద్రలేవి కూడా వారిని చురుకుగా లేకుండా చేస్తుంది. ముఖ్యంగా మొబైల్, లాప్ టాప్, టీవీ, టాబ్లెట్ వంటి గాడ్జెట్స్ పిల్లలకు అందుబాటులో ఉంచకూడదు. ఇవి అందుబాటులో ఉంచితే వారు వీడియోలు, గేమ్స్ కు బానిసఅయిపోయి, సరిగ్గా నిద్రపోరు. అందుకే పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఎట్టి పరిస్థితుల్లోనూ చేతికి ఇవ్వకూడదు.

శుభ్రత:

చిన్నతనం నుండే పిల్లలకు పరిశుభ్రత గురించి చెప్పడం చాలా ముఖ్యం. వారి దంతాలు, చేతులు, వేళ్లు శుభ్రంగా ఉంచుకోవడానికి వారిని ఎంకరేజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం తగ్గుతుంది. ఏదైనా వ్యాధి ప్రారంభం మురికిగా ఉండే చేతులతో ప్రారంభం అవుతుంది. అందుకే కాస్త సమయం కేటాయించి పిల్లల గోళ్ళను కత్తిరించాలి. వారు తినే ముందు చేతులను సరిగ్గా శుభ్రం చేసుకున్నారో లేదో చూడాలి. లేకుంటే దగ్గరుండి చేయించాలి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..