AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bleeding Gums: చిగుళ్ల నుంచి రక్తం వస్తోందా? ఈ ఇంటి చిట్కాలతో చెక్ చెప్పండి..

చిగుళ్లలో బ్లీడింగ్ అనేది చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్య. మీ చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు రక్తస్రావం నివారించడంలో సహాయపడే సహజ నివారణ పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Bleeding Gums: చిగుళ్ల నుంచి రక్తం వస్తోందా? ఈ ఇంటి చిట్కాలతో చెక్ చెప్పండి..
Dental Care Tips
Madhu
|

Updated on: Mar 20, 2023 | 5:45 PM

Share

చిగుళ్లలో బ్లీడింగ్ అనేది చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్య. నోటి పరిశుభ్రత సరిగా లేకపోవడం, చిగుళ్ల వ్యాధి, హార్మోన్ల మార్పులు లేదా కొన్ని మందుల ప్రభావం వంటి అనేక కారణాల వల్ల ఇది సంభవించవచ్చు. చికిత్స చేయకుండా వదిలేస్తే, ఇది దంతాల పాడైపోవడంతో పాటు చిగుళ్ల వాపు వంటి మరింత తీవ్రమైన నోటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మీ చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు రక్తస్రావం నివారించడంలో సహాయపడే సహజ నివారణ పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

నోటి పరిశుభ్రత ముఖ్యం.. మంచి టూత్‌పేస్ట్‌తో రోజుకు రెండుసార్లు మీ దంతాలను బ్రష్ చేయడం, ప్రతిరోజూ ఫ్లాసింగ్ చేయడం, యాంటీ బాక్టీరియల్ మౌత్ వాష్ ఉపయోగించడం వంటి వాటి వల్ల నోరు పరిశుభ్రంగా ఉంటుంది. ఇది మీ దంతాలు, అలాగే చిగుళ్లను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది మీ దంతాల మధ్య ఉన్న బ్యాక్టీరియాను తొలగిస్తుంది. తద్వార మీ చిగుళ్ళను చికాకు పెడుతూ, రక్తస్రావం కలిగించే హానికరమైన పదార్థాల నిర్మాణాన్ని మీరు నిరోధించగలగుతారు.

ఉప్పునీటితో పుక్కలించాలి.. ఉప్పులో సహజ యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి బ్యాక్టీరియాను చంపడానికి, మీ చిగుళ్లలో మంటను తగ్గించడానికి సహాయపడతాయి. ఒక కప్పు గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ ఉప్పును కరిగించి, 30 సెకన్ల పాటు బాగా పుక్కిలించండి..

ఇవి కూడా చదవండి

ఆయిల్ పుల్లింగ్.. ఆయిల్ పుల్లింగ్ అనేది నోటి ఆరోగ్యాన్ని పెంపొందించడానికి శతాబ్దాలుగా ఉపయోగించబడుతున్న మరొక సహజ నివారణ. ఒక టేబుల్ స్పూన్ నూనెను (కొబ్బరి లేదా నువ్వుల నూనె వంటివి) మీ నోటిలో ఉంచి పుక్కిలించాలి. ఆయిల్ పుల్లింగ్ మీ నోటి నుండి హానికరమైన బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే మీ చిగుళ్ళలో మంటను తగ్గిస్తుంది.

విటమిన్ సి.. విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం ద్వారా మీ చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. విటమిన్ సి ఒక యాంటీ ఆక్సిడెంట్, ఇది రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. ఆరోగ్యకరమైన చిగుళ్ల కణజాలాన్ని ప్రోత్సహిస్తుంది. నారింజ, కివీస్, స్ట్రాబెర్రీలు, బెల్ పెప్పర్స్ వంటి ఆహారాల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.

గ్రీన్ టీ.. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ చిగుళ్లలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. మీ నోటిలో హానికరమైన బ్యాక్టీరియా వృద్ధిని నిరోధిస్తాయి. రోజుకు ఒకటి నుండి రెండు కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

పొగాకును దూరం పెట్టాలి.. పొగాకు ఉత్పత్తులను నివారించడం వల్ల చిగుళ్లలో రక్తస్రావం, ఇతర నోటి ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. పొగాకు వాడకం మీ చిగుళ్లను చికాకుపెడుతుంది. చిగుళ్ల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది, ఇది రక్తస్రావం, ఇతర సమస్యలకు దారితీస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్