Health Tips: మాంసం తింటున్నారా..? అయితే మీరు ఈ విషయాలను తప్పక తెలుసుకోవలసిందే..

మంచి మొత్తంలో పోషకాలను పొందడానికి మాంసాహారం మంచి ఎంపిక. ఇంకా మనలో కూడా చాలా మంది మాంసాహారం అంటే పడి చచ్చిపోతారంటే అతిశయోక్తి కాదేమో..!

Health Tips: మాంసం తింటున్నారా..? అయితే మీరు ఈ విషయాలను తప్పక తెలుసుకోవలసిందే..
Red Meat Side Effects
Follow us

|

Updated on: Mar 20, 2023 | 7:50 PM

మానవ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు కావలసిన పోషకాలతో కూడిన సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. ఈ క్రమంలో మంచి మొత్తంలో పోషకాలను పొందడానికి మాంసాహారం మంచి ఎంపిక. ఇంకా మనలో కూడా చాలా మంది మాంసాహారం అంటే పడి చచ్చిపోతారంటే అతిశయోక్తి కాదేమో..! కానీ ఏదైనా పరిమితంగా తింటేనే ఆరోగ్య ప్రయోజనాలు, మితిమీరితే ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు ఆరోగ్య, పోషకాహార నిపుణులు. ఈ క్రమంలోనే చికెన్, మటన్ వంటివాటిని కూడా పరిమితంగానే తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తారు. ముఖ్యంగా రెడ్ మీట్ ఎక్కువగా తింటే.. తద్వారా కలిగే మంచి కన్నా కూడా చెడు ఎక్కువగా జరుగుతుందని వారు హెచ్చరిస్తున్నారు. మాంసం వినియోగం ఎక్కువైతే వివిధ ఆరోగ్య సమస్యలు తప్పవని అనేక పరిశోధనలు సైతం ధ్రువీకరించాయి. ఈ నేపథ్యంలో రెడ్ మీట్ వినియోగం మితిమీరితే ఎదురయ్యే ఆరోగ్య సమస్యలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఎముకలు, గుండె ఆరోగ్యం: సాధారణంగా మాంసాహారం ఎముకల ఆరోగ్యానికి సహకరిస్తుంది. ఎముకల పనితీరు సక్రమంగా ఉండాలంటే రెడ్ మీట్ తినాలి. అయితే మటన్ ఎక్కువగా తింటే బోన్స్‌పై సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే దీనిలో చెడు కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది మన రక్తంలో కొవ్వు శాతాన్ని పెంచడంతో పాటు గుండె నాళాలను దెబ్బతీస్తుందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫలితంగా గుండె జబ్బుల బారిన పడే ముప్పు ఉంటుందట. అదే సమయంలో ఎముకల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.

రక్తం ఆమ్లత్వం: రెడ్ మీట్ ఎక్కువగా తినే వారి రక్తంలో ఆమ్లత్వం పెరుగుతుంది. దీనివల్ల కొన్ని రకాల పోషకాలను శరీరం సంగ్రహించలేదు. అలాగే ఎసిడిక్ బ్లడ్ కారణంగా ఎముకలపై తీవ్ర ప్రభావం పడి, అవి బలహీనంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే రక్తంలో ఆమ్లత్వం పెరిగితే, ఇది ఎముకల నుంచి కాల్షియం తొలగిపోయేందుకు దారితీస్తుంది.

ఇవి కూడా చదవండి

కాల్షియం స్థాయి: ఎముకలు ధృడంగా ఉండాలంటే కాల్షియం తప్పనిసరి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే జంతువుల నుంచి లభించే హై ప్రోటీన్ కారణంగా ఎముకలు కాల్షియంను కోల్పోయే ప్రమాదం ఉంది. అంటే మాంసాహార తీసుకునే స్థాయి పెరిగితే, ఎముకల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అంతేకాక రెడ్ మీట్‌లో ఫాస్పరస్- కాల్షియం నిష్పత్తి ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకల్లోని కాల్షియం కోల్పోయే స్థితిని అధికం చేస్తుంది. ఫలితంగా మినరల్ రహితంగా ఎముక మారుతుంది.

మాంసాహారానికి ప్రత్యామ్నాయం:

మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా వివిధ రూపాల్లోని ప్రొటీన్‌ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పాల వంటి డెయిరీ పదార్థాలు, చేపలు, చికెన్, ప్రొటీన్ ఉండే మొక్కలను డైట్‌లో చేర్చుకోవాలి. వీటితో పాటు పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలతో బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకోవాలి. బీన్స్, పప్పులు, ఆకు కూరలను ఆహారంలో చేర్చుకోవాలి. ముఖ్యంగా ప్లాంట్ బేస్డ్ ప్రొటీన్స్‌పై అవగాహన పెంచుకోవడం మంచిది. దీనివల్ల ఎన్నో అదనపు ప్రయోజనాలు ఉంటాయి. పైగా మాంసంతో పోలిస్తే వీటికయ్యే ఖర్చు కూడా తక్కువే అవుతుండటం కలిసొస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో