AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దంపతుల మధ్య ఏజ్‌ గ్యాప్ ఉంటే ఈ 4 సమస్యలు..! అవేంటో తెలుసుకోండి..

బాలీవుడ్‌లో చాలా జంటల మధ్య ఏజ్‌ గ్యాప్ ఉంటుంది. షాహిద్ కపూర్ అతని భార్య మీరా రాజ్‌పుత్ కంటే 13 సంవత్సరాలు పెద్దవాడు. మిలింద్ సోమన్ అంకిత మధ్య 26 సంవత్సరాల

దంపతుల మధ్య ఏజ్‌ గ్యాప్ ఉంటే ఈ 4 సమస్యలు..! అవేంటో తెలుసుకోండి..
Age Gap
uppula Raju
|

Updated on: Aug 05, 2021 | 9:19 PM

Share

బాలీవుడ్‌లో చాలా జంటల మధ్య ఏజ్‌ గ్యాప్ ఉంటుంది. షాహిద్ కపూర్ అతని భార్య మీరా రాజ్‌పుత్ కంటే 13 సంవత్సరాలు పెద్దవాడు. మిలింద్ సోమన్ అంకిత మధ్య 26 సంవత్సరాల తేడా ఉంది. సైఫ్, కరీనా కంటే 10 సంవత్సరాలు పెద్దవాడు. వివాహానికి వయస్సు వ్యత్యాసం ముఖ్యం కాదని పరస్పర అవగాహన ముఖ్యమని నేటి యువతరం నమ్ముతుంది. అయితే వయస్సు అంతరం కూడా ముఖ్యం. ఇద్దరి మధ్య వయస్సు అంతరం ఎక్కువగా ఉంటే సంబంధంలో చీలిక వచ్చే అవకాశం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య వయస్సు వ్యత్యాసం ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ ఉంటే వారిద్దరి సంబంధం సంతోషంగా ఉంటుందని శాస్త్రీయ పరిశోధన సూచిస్తుంది. ఇంతకంటే ఎక్కువ ఉంటే సంబంధంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. ఒకవేళ ఏజ్ గ్యాప్ ఉంటే ఈ సమస్యలు ఏర్పడుతాయి.

1. అనుకూలత సమస్య జంటల మధ్య భారీ వ్యత్యాసం కారణంగా ఇద్దరి మధ్య సఖ్యత కుదరదు. వయస్సు ప్రకారం కొన్నిసార్లు ఇద్దరి ప్రాధాన్యతలు భిన్నంగా ఉంటాయి. చిన్న చిన్న విషయాలపై వాదనలు తగాదాలకు అవకాశం ఉంటుంది.

2. పిల్లలు పుట్టే సమస్య ఏజ్‌ గ్యాప్‌ ఎక్కువగా ఉంటే దంపతుల మధ్య పిల్లలు పుట్టే సమస్య పెరుగుతుంది. దీంతో గొడవలు జరుగుతాయి. వృద్ధుడు కుటుంబ నియంత్రణ సమయానికి జరగాలని కోరుకుంటాడు. చిన్నవాడు జీవితాన్ని ముందుగా ఆస్వాదించాలనుకుంటాడు.

3. లైంగిక జీవితం వయస్సు అంతరం ఉన్న జంటలు లైంగికంగా ఇబ్బందిపడుతారు. చిన్న భాగస్వామికి ఈ విషయం అర్థం కాదు. దీని కారణంగా గొడవలు జరుగుతాయి. కొన్నిసార్లు వివాహేతర సంబంధాలకు దారి తీస్తుంది.

4. సామాజిక సవాలు సమాజంలో భార్యాభర్తల మధ్య వ్యత్యాసం ఇంకా పూర్తిగా అంగీకరించబడలేదు. అటువంటి పరిస్థితిలో, అమ్మాయి వయస్సులో పెద్దది అయితే సవాళ్లు మరింత పెరుగుతాయి. ఇద్దరి మధ్య సమస్య ఉంటే వయస్సు వ్యత్యాసాన్ని కారణంగా చూపి అవమానాలకు గురిచేస్తారు.

Guava : ఈ 3 వ్యాధులు ఉన్నవారు జామపండు అస్సలు తినకూడదు..! ఎందుకో తెలుసుకోండి..

Viral video: ఇంటికి గెస్ట్‌‌‌గా వచ్చిన మొసలి.. పలకరిద్దామని చూస్తే ఇంటిపైకెక్కి కూర్చున్నారు..

Telangana Corona Cases: తెలంగాణలో కొత్తగా 582 కరోనా కేసుల.. యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా

ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం