Monsoon: వానా కాలంలో కొంపముంచే అలవాటు.. మర్చిపోయి కూడా ఇలా చేయొద్దు!
చాలా మంది వానా కాలంలో నీరు తక్కువగా తాగుతారు. మీరూ వానా కాలంలో నీళ్లు తక్కువగా తాగుతుంటే.. వెంటనే ఈ అలవాటును మార్చుకోవడం మంచిది. లేదంటే త్వరలోనే ఆస్పత్రిలో చేరాల్సి ఉంటుంది. ఎందుకంటే.. దాహం వేయకుండా నీరు తాగే అలవాటు మీ ప్రాణాలను కాపాడుతుంది..

వర్షాకాలంలో సాధారణంగా దాహం చాలా తక్కువగా ఉంటుంది. దీంతో చాలా మంది నీరు తక్కువగా తాగుతారు. మీరూ వానా కాలంలో నీళ్లు తక్కువగా తాగుతుంటే.. వెంటనే ఈ అలవాటును మార్చుకోవడం మంచిది. లేదంటే త్వరలోనే ఆస్పత్రిలో చేరాల్సి ఉంటుంది. ఎందుకంటే.. దాహం వేయకుండా నీరు తాగే అలవాటు మీ ప్రాణాలను కాపాడుతుంది. వర్షాకాలంలో తాగే నీటి పరిమాణం తగ్గితే అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని వైద్యులు అంటున్నారు . కాబట్టి వర్షాకాలంలో తక్కువ నీరు తాగడం వల్ల కలిగే సమస్యలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
మలబద్ధకం సమస్య
శరీరంలో తగినంత నీరు లేకపోతే మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇందుకు సరైన మందులు సకాలంలో తీసుకోకపోతే, మూలశంఖం వంటి వ్యాధులు వస్తాయి. అంతే కాదు వర్షాకాలంలో తక్కువ నీరు తాగడం వల్ల జీర్ణ సమస్యలు కూడా వస్తాయి.
శరీర బలహీణత
ప్రతిరోజూ ఉత్సాహంగా పనిచేయాలంటే శరీరానికి తగినంత శక్తి అవసరం. దీనికోసం క్రమం తప్పకుండా నీరు తాగడం చాలా అవసరం. లేకపోతే చిన్న చిన్న పనులు చేసినా త్వరగా అలసిపోతారు.
మూత్రపిండాల సంబంధిత సమస్యలు
సాధారణంగా మూత్రపిండాలు మన శరీరం నుంచి విషాన్ని తొలగించడానికి సహాయపడతాయి. కానీ శరీరంలో నీటి కొరత ఉంటే, అది మూత్రపిండాల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. చాలా మంది తెలియకుండానే తక్కువ నీరు తాగుతుంటారు. తద్వారా మూత్రపిండాల సమస్యలను ఆహ్వానిస్తారు.
చర్మ సంబంధిత సమస్యలు
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. శరీరంలో నీటి శాతం తగినంతగా లేనప్పుడు చర్మం దాని మెరుపును కోల్పోతుంది. ముఖంలో ప్రకాశం కూడా తగ్గుతుంది. దీనితో పాటు మొటిమలు, ఇతర చర్మ సంబంధిత సమస్యలు కూడా ప్రారంభమవుతాయి. తగినంత నీరు తాగే అలవాటు చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అదేవిధంగా చర్మం పొడిబారడం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
మూత్ర నాళ ఇన్ఫెక్షన్లు
శరీరంలో నీటి స్థాయి తగ్గితే మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగాలి. అందువల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎక్కువ నీరు తాగాలని నిపుణులు ఎల్లప్పుడూ సలహా ఇస్తుంటారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి.








