మీ జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరిగేందుకు చియా సీడ్స్ ఇలా వాడండి..
పొడవాటి, బలమైన, ఒత్తైన జుట్టు ఆడవాళ్లకు ఎంతో అందాన్ని ఇస్తుంది. అలాంటి జుట్టు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ, నేటి ఆధునిక ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రజలంతా అనేక రకాల జుట్టు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలోనే చియా విత్తనాలను ఉపయోగించి జుట్టును పెంచుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

ఈ చియా విత్తనాలు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, జింక్, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. జుట్టు సంరక్షణ కోసం చియా సీడ్స్‌ని వాడితే చక్కటి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం 2 టేబుల్ స్పూన్ల చియా విత్తనాలను అర కప్పు నీటిలో 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. అవి మంచి జెల్ లాంటి ఆకృతిని ఏర్పరచిన తర్వాత దీనిని తలంతటా, జుట్టుకు పూర్తిగా అప్లై చేసుకోవాలి.. ఒక అరగంట తరువాత వాష్ చేసుకోవాలి. ఈ మాస్క్ మీ తలను హైడ్రేట్ చేస్తుంది. తలలో పొడితనాన్ని తగ్గిస్తుంది.
మరో విధానంలో ఒక టీస్పూన్ చియా విత్తనాలను ఒక కప్పు నీటిలో నానబెట్టిన వాటర్‌తో చియా సీడ్ స్ప్రే తయారు చేసుకోవచ్చు. ఆ నీటిని వడకట్టి స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి. దీన్ని ప్రతిరోజూ తలకు, జుట్టుపై స్ప్రే చేయాలి. అలాగే, నానబెట్టిన చియా విత్తనాలను అలోవెరా జెల్ తో మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని మీ నెత్తికి, జుట్టుకు అప్లై చేసుకోవచ్చు. దీన్ని 10-15 నిమిషాలు ఉంచండి. దురద, చుండ్రును తగ్గించడానికి సహాయపడుతుంది.
అలాగే, చియా సీడ్స్, కొబ్బరి నూనెతో హెయిర్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. నానబెట్టిన చియా విత్తనాలను ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెతో కలపండి. దీన్ని జుట్టుకు, నెత్తికి అప్లై చేసి, 30 నిమిషాల పాటు అలాగే ఉంచి, తలస్నానం చేయాలి. కొబ్బరి నూనె అదనపు తేమ, ప్రకాశాన్ని అందిస్తుంది.
(నోట్: ఈ కథనంలోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏదైనా సమస్యలున్నా.. సందేహాలు ఉన్నా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది..)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..