Lemon Peel: నిమ్మ తొక్కలో ఏముందిలే అనుకుంటున్నారా..? ప్రయోజనాలు తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..!
చాలా మంది నిమ్మతొక్కలను బయటపడేస్తూ ఉంటారు. కానీ, నిమ్మ తొక్కలు కూడా అద్భుతమై ప్రయోజనాలు అందిస్తాయని మీకు తెలుసా..? వాటి వల్ల ఉపయోగాలు, ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. అవును, నిమ్మకాయతోనే కాదు వాటి తొక్కల వల్ల కూడా బోలెడన్నీ ఉపయోగాలుంటాయి. ఒక రకంగానే కాదు అనేక రకాలుగా వీటిని ఉపయోగించుకోవచ్చు. అదేలాగో ఇక్కడ చూద్దాం..
Updated on: Jun 09, 2025 | 6:32 PM

నిమ్మ తొక్కలు కూడా అద్భుతమై ప్రయోజనాలు అందిస్తాయి. ముఖ్యంగా నిమ్మకాయ తొక్క పోషక లక్షణాలతో నిండి ఉంటుంది. నిమ్మ తొక్కలు విటమిన్ సి తో నిండి ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచటంలో సహాయపడుతుంది. సాధారణ వ్యాధులతో పోరాడటానికి మన రోగనిరోధక శక్తిని బలపరిచేందుకు విటమిన్ సీ ఉపయోగపడుతుంది. నిమ్మ తొక్కలలో ఉండే బయోఫ్లావనాయిడ్స్ ఎముకల ఆరోగ్యానికి, ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఉపయోగపడతాయి.

నిమ్మ తొక్కలు యాంటీ బాక్టీరియల్ భాగాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా నోటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని నిర్వహించడానికి, అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే ఫ్లేవనాయిడ్‌లతో నిండి ఉన్నాయి.

నిమ్మ తొక్కలలోని ఫైబర్ కంటెంట్ ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది, గట్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే ఈ ప్రక్రియలో బరువు తగ్గడాన్ని సులభతరం చేస్తుంది. నిమ్మ తొక్కలలో ఉండే బయోఫ్లావనాయిడ్స్ ఎముకల ఆరోగ్యానికి, ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఉపయోగపడతాయి. నిమ్మ తొక్కలు యాంటీ బాక్టీరియల్ భాగాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా నోటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

నిమ్మ తొక్కను ఎండబెట్టి పొడిచేసి తీసుకుంటే అనేక పోషకాలను లభిస్తాయి. ఇందులో ఉండే పొటాషియం హైబీపీని తగ్గిస్తుంది. నిమ్మ తొక్క పొడి రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. గుండె జబ్బులను నివారిస్తుంది. అంతేకాదు.. నిమ్మ తొక్క పొడిలో క్యాన్సర్ కణాలను నాశనం చేసే గుణాలున్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది.

నిమ్మ తొక్కలను జుట్టు సంరక్షణకు కూడా ఉపయోగించవచ్చు. వీటిని పేస్ట్ లాగా తయారు చేసి వాడుకోవచ్చు. నిమ్మ తొక్కలను నూనెలో వేడి చేసిన తర్వాత చల్లార్చాలి. ఈ నీటిని జుట్టుకు పట్టించటం వల్ల తలలో చుండ్రు సమస్య తగ్గుతుంది. స్నానం చేసేటప్పుడు నిమ్మ తొక్కతో శరీరాన్ని రుద్దితే క్రిములు తొలగిపోతాయి.



















