Instagram Reels Addiction: మీరూ ఇన్ స్టా రీల్స్‌కు బానిసయ్యారా? ఈ అలవాటును సులువుగా వదిలించే చిట్కాలివిగో..
కొంతమంది రీల్స్‌కు బానిసై.. ఈ అలవాటు నుంచి బయటపడలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారు రోజంతా ఫోన్‌లో రీల్స్ స్క్రోలింగ్ చేస్తూ సమయాన్ని వృధా చేస్తుంటారు. కాబట్టి ఈ అలవాటును నియంత్రించడం చాలా ముఖ్యం. మీరు కూడా సెల్ ఫోన్లో రీల్స్ చూస్తూ గంటల తరబడి గడుపుతున్నారా?..

నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరి టైమ్‌ను, కెరీర్‌ను తినేస్తుంది. ఇందులో ఇన్‌స్టా రీల్స్ పిచ్చి నానాటికీ ముదిరిపోతుంది. రీల్స్ మోజులో ఎందరో యువత ప్రాణాలు సైతం పణంగా పెడుతున్నారు. నిజానికి రీల్స్ వినోదంలో ఒక భాగం మాత్రమే. గతంలో జనం టీవీ చూస్తూ సమయం గడిపేవారు. ఇప్పుడు రీల్స్ చూస్తూ తమ సమయాన్ని గడుపుతున్నారు. కొంతమంది రీల్స్‌కు బానిసై.. ఈ అలవాటు నుంచి బయటపడలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారు రోజంతా ఫోన్‌లో రీల్స్ స్క్రోలింగ్ చేస్తూ సమయాన్ని వృధా చేస్తుంటారు. కాబట్టి ఈ అలవాటును నియంత్రించడం చాలా ముఖ్యం. మీరు కూడా సెల్ ఫోన్లో రీల్స్ చూస్తూ గంటల తరబడి గడుపుతున్నారా? అయితే ఈ అలవాటును మానుకోవడానికి ఈ కింది చిట్కాలను ట్రై చేయండి..
రీల్స్ చూసే అలవాటును తగ్గించుకోవడానికి నిపుణుల చిట్కాలు..
సమయ పరిమితి
రీల్స్ చూడటానికి సమయ పరిమితిని నిర్ణయించుకోవాలి. కొంతమంది రీల్స్‌ను 5 నిమిషాలు చూస్తారు. కానీ మరికొందరు గంటల తరబడి రీల్స్ చూస్తూ గడుపుతారు. కాబట్టి ముందుగా సమయ పరిమితిని నిర్ణయించుకోవాలి. ఉదాహరణకు ప్రతిరోజూ 15 నుంచి 20 నిమిషాలు మాత్రమే రీల్స్ చూడాలి అనే పరిమితిని మీకు మీరే నిర్ణయించుకోవాలి. అంతకంటే ఎక్కువ రీల్స్ చూడకండి.
నోటిఫికేషన్‌లను ఆఫ్ చేయండి
ఫోన్లో సోషల్ మీడియా నోటిఫికేషన్‌లను ఆఫ్ చేయాలి. మీ స్నేహితులు రీల్స్ షేర్ చేస్తే, సోషల్ మీడియాను మళ్లీ మళ్లీ తనిఖీ చేయాల్సి ఉంటుంది. అందుకే నోటిఫికేషన్‌లను ఆఫ్ చేయాలి.
కొత్త అలవాట్లను అలవర్చుకోండి
చాలా మంది తమ ఖాళీ సమయంలో రీల్స్ చూస్తారు. కానీ రీల్స్ చూడటానికి బదులుగా, ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, పాటలు వినడం, డ్రాయింగ్ వేయడం, ఆటలు ఆడటం వంటి కార్యకలాపాలను ప్రాక్టీస్ చేయాలి. ఇది రీల్స్ వ్యసనం నుంచి బయటపడటానికి కూడా మీకు సహాయపడుతుంది.
మొబైల్ డేటాను ఆఫ్ చేయండి
మీ మొబైల్ డేటాను ఎల్లప్పుడూ ఆన్‌లో ఉంచుకోకండి. ముఖ్యంగా మీరు కుటుంబం, స్నేహితులతో ఉంటే డేటాను ఆఫ్ చేసి, మీ ఫోన్‌ను మీకు దూరంగా ఉంచాలి. ఇది రీల్స్ చూడటం నివారించి, సమయాన్ని ఆదా చేయడంలో మీకు సహాయపడుతుంది.
డిజిటల్ డిటాక్స్ సాధన చేయాలి
వారానికి ఒక రోజు సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉండండి. దీనిని డిజిటల్ డిటాక్స్ అంటారు. వారంలో ఒక రోజున, మీరు మీ మొబైల్‌కు దూరంగా ఉండాలి. ఆ రోజు మొత్తం మీ కుటుంబం లేదా స్నేహితులతో బయటకు వెళ్లి వారితో కొంత సమయాన్ని గడపండి. ఇలా చేయడం ద్వారా క్రమంగా రీల్స్, మొబైల్ వ్యసనాన్ని వదిలించుకోవచ్చు.
ఫోన్‌ను దూరంగా ఉంచండి
మీ ఫోన్‌ను వీలైనంత వరకు మీ నుండి దూరంగా ఉంచడానికి ప్రయత్నించండి. మొబైల్ ఫోన్ చేతిలో ఉంటే, మీరు దాన్ని పదే పదే ఆన్ చేసి రీల్స్ చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ మొబైల్ ఫోన్‌ను దూరంగా ఉంచండి. అవసరమైనప్పుడు మాత్రమే దాన్ని ఉపయోగించడం అలవాటు చేసుకోండి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.








