కూరలో ఉప్పు ఎక్కువైతే ఇలా సెట్ చేయండి.. రుచి కూడా బాగుంటుంది..!
వంట చేసే సమయంలో కూర లో ఉప్పు కొంచెం ఎక్కువయితే వెంటనే ఫ్రస్ట్రేట్ కావాల్సిన అవసరం లేదు. ఇంట్లో అందుబాటులో ఉండే కొన్ని పదార్థాల తోనే దాన్ని తగ్గించవచ్చు. అలా చేస్తే వృథా అయిపోకుండా ఆ కూరను ఉపయోగించుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

కూరలో ఉప్పు ఎక్కువగా ఉంటే కొద్దిగా పెరుగు కలపండి. పెరుగు కలపడం వల్ల ఉప్పు తక్కువగా అనిపిస్తుంది. ఇది కూరకి కాస్త మైల్డ్ టేస్ట్ తీసుకురావడంలో సహాయం చేస్తుంది. పెరుగు వలన రుచి కూడా మారిపోకుండా ఉంటుంది. ఉప్పు ఎక్కువైతే టొమాటో ముక్కలు లేదా టొమాటో సాస్ వాడొచ్చు. ఇవి కూరలో కలిపితే సహజమైన పులుపు వచ్చి ఉప్పు బ్యాలెన్స్ అవుతుంది. టొమాటో వల్ల కూర టేస్ట్ కూడా బాగుంటుంది.
కొబ్బరి పాలు వేయడం వల్ల కూరకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒకే సమయంలో ఉప్పు తగ్గించడంలో సహాయపడతాయి. కొబ్బరి పాలు సహజమైన తీపి వాసనతో ఉండడం వల్ల మసాలా కూరలకు ఇది బాగా సరిపోతుంది.
కొన్ని బంగాళదుంపల్ని ఉడికించి చిన్న ముక్కలుగా చేసి కూరలో కలపాలి. బంగాళదుంప ఉప్పును గ్రహిస్తుంది. కూరలోనే ఉంచి తినవచ్చు. ఇలాచేస్తే కూర టేస్ట్ చెడకుండా ఉప్పు తగ్గుతుంది.
కొన్ని పెద్ద ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయలను కూరలో వేయండి. వీటిని పచ్చిగా లేదా వేయించి వాడవచ్చు. ఇవి కూరలో ఉండే ఉప్పును గ్రహిస్తాయి. తర్వాత అవి తినకపోతే తీసేయొచ్చు. ఇలాచేయడం వల్ల ఉప్పు తగ్గుతుంది.
గోధుమపిండి లేదా ఇంకేదైనా పిండిలో కొద్దిగా నీళ్లు కలిపి చిన్న బాల్స్ చేసి కూరలో వేయండి. కొన్ని నిమిషాల పాటు ఉంచి ఆ బాల్స్ తీసేయాలి. ఇవి కూరలోని ఉప్పుని గ్రహిస్తాయి. ఇది చాలా సింపుల్ టిప్.
కొంత పాలు కూరలో వేసినప్పుడు ఉప్పు తగ్గుతుంది. పాలు కలిపిన కూర మైల్డ్ గా మారుతుంది. టేస్ట్ కూడా కాస్త సాఫ్ట్‌గా ఉంటుంది. మసాలా తక్కువగా ఉండే కూరలకు ఈ టిప్ బాగా పనిచేస్తుంది.
వెనిగర్ కొంచెం పుల్లగా ఉంటుంది. పంచదార తీయగా ఉంటుంది. వీటిద్వారా ఉప్పు బ్యాలెన్స్ చేయొచ్చు. రెండింటినీ కలిపి కూరలో వేసినప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఉప్పు ఎక్కువగా ఉండే కూరలకి ఇది మంచి పరిష్కారం.
కొంత తాజా క్రీమ్ కూరలో కలిపితే ఉప్పు తక్కువగా అనిపిస్తుంది. ఇది కూరకి మైల్డ్ టేస్ట్ తీసుకొస్తుంది. క్రీమ్ కలపడం వల్ల కూరలో రుచికి కొత్తగా తీపిదనం వస్తుంది. ఇది ప్రత్యేకంగా పచ్చడి తరహా కూరలకు బాగా సరిపోతుంది.
కూరలో ఉప్పు ఎక్కువయినప్పటికీ ఇవే టిప్స్ వాడి దాన్ని సరైన రుచికి తీసుకురావచ్చు. ఇలాచేయడం వల్ల ఆహారాన్ని వృథా చేయాల్సిన అవసరం ఉండదు. ఒక్కసారి ప్రయత్నించండి. మీరు కూడా ఫలితాన్ని ఆస్వాదిస్తారు.
